Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అవకాశాలు సముద్రమంత!

నౌకాయానం నానాటికీ విస్తృతమవుతోంది. సముద్ర వర్తకంలో మన దేశానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే భవిష్యత్తులోనూ ఈ రంగం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో సమర్థ మానవ వనరులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. కెప్టెన్‌, ఇంజినీర్‌, షిప్‌ బిల్డర్‌, డిజైనర్‌, పోర్ట్‌ మేనేజర్‌, లాజిస్టిక్స్‌ ఎక్స్‌పర్ట్‌ మొదలైన ఉద్యోగావ కాశాలెన్నో పెద్ద ఎత్తున ఈ రంగంలో ఉన్నాయి.

షిప్పింగ్‌లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీని చెన్నైలో ఏర్పాటు చేసింది. ముంబయి, కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చిల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు మారిటైమ్‌ యూనివర్సిటీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా 21 కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ప్రవేశాలకు ఉమ్మడి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు.
అండర్‌ గ్రాడ్యుయేట్‌
బీటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌
బీబీఏ: లాజిస్టిక్స్‌, రిటైలింగ్‌ అండ్‌ ఈ-కామర్స్‌
బీఎస్సీ: మారిటైమ్‌ సైన్స్‌, నాటికల్‌ సైన్స్‌, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్‌
అర్హత: బీఎస్సీ, బీటెక్‌, డీఎన్‌ఎస్‌ కోర్సులకు ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూప్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులు. అలాగే పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. బీబీఏ కోర్సుకు 60 శాతం మార్కులతో ఇంటర్‌లో ఏ గ్రూప్‌ విద్యార్థులైనా అర్హులే. అన్ని కోర్సులకు ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ కోర్సులు
ఎంటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, డ్రెడ్జింగ్‌ అండ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్‌
ఎమ్మెస్సీ: కమర్షియల్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌
ఎంబీఏ: పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్‌నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌
అర్హత: ఎంటెక్‌ కోర్సులకు సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీలో 60 శాతం మార్కులతో బీటెక్‌ ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సులకు 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
నాటికల్‌ సైన్స్‌లో ఏడాది డిప్లొమా (డీఎన్‌ఎస్‌), పీజీ డిప్లొమా ఇన్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌, పీహెచ్‌డీ, ఎంఎస్‌ కోర్సులను కూడా మారిటైమ్‌ యూనివర్సిటీ అందిస్తోంది. బీబీఏ కోర్సుకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. .
పరీక్ష విధానం
బీబీఏ తప్ప మిగిలిన అన్ని యూజీ కోర్సులకు ప్రశ్నపత్రంలో 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో 10+2 స్థాయి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏ, ఎమ్మెస్సీ కోర్సులకు 120 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఎంటెక్‌ కోర్సులకు 120 ప్రశ్నలు వస్తాయి.. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌తోపాటు మెకానికల్‌ /నేవల్‌ ఆర్కిటెక్చర్‌ /మెరైన్‌ /సివిల్‌ వీటిలో ఏదో ఒక విభాగం నుంచి అభ్యర్థి జవాబులు రాయాలి. ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 11
పరీక్ష తేదీ: జూన్‌ 2
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: www.imu.edu.in

Back..

Posted on 12-04-2018