Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రత్యేక అభిరుచి ఉంటే... సెక్టోర‌ల్ ఎంబీఏ

ఎంబీఏ కోర్సు కోర్సు గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. అయితే ఇందులోనూ ప‌లు ర‌కాలు ఉన్నాయి. ఎక్కువ మంది జ‌న‌ర‌ల్ ఎంబీఏలోనే చేరుతున్నప్పటికీ ఇప్పుడు సెక్టోర‌ల్ ఎంబీఏ కోర్సులు కూడా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆ సెక్టార్‌కి సంబంధించిన అంశంపై నిర్వహించే ఎంబీఏ కోర్సునే సెక్టోర‌ల్ ఎంబీఏగా చెప్పుకోవ‌చ్చు. రూర‌ల్ మేనేజ్‌మెంట్‌, అగ్రిబిజినెస్‌, క‌మ్యూనికేష‌న్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌...ఇలా ప‌లు విభాగాల్లో సెక్టోరల్ ఎంబీఏ కోర్సులు ఉన్నాయి. కేవ‌లం వీటికోస‌మే కొన్ని ప్రత్యేక సంస్థలూ వెలిశాయి.

ఆ సెక్టార్‌లో ఉద్యోగం/ కెరీర్ ఆశించే విద్యార్థులు ఈ త‌ర‌హా కోర్సుల్లో చేర‌డం ద్వారా ఎక్కువ ప్రయోజ‌నం పొందొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఇన్సూరెన్స్ సెక్టార్ అంటే ఆస‌క్తి ఉన్న విద్యార్థి ఇన్సూరెన్స్ ఒక స్పెష‌లైజేష‌న్‌గా ఎంబీఏ చేసే బ‌దులు రెండేళ్లు మొత్తం ఇన్సూరెన్స్ గురించే బోధించే ఎంబీఏ (ఇన్సూరెన్స్‌) కోర్సులో చేరితే ఎక్కువ ప్రయోజ‌నం ఉంటుంది. ఈ త‌ర‌హా కోర్సుల‌ను ఆ విభాగానికి సంబంధించిన అవ‌స‌రాల‌ను పూర్తిస్థాయిలో తీర్చడం కోస‌మే రూపొందించారు. అందువ‌ల్ల ఈ కోర్సులు చ‌దివిన‌వాళ్లు దాదాపు కెరీర్ మొత్తం ఆ సెక్టార్‌లోనే కొన‌సాగాల్సి ఉంటుంది. అయితే ఇష్టం లేకుండా ఈ కోర్సులో చేర‌డం వ‌ల్ల ప్రయోజ‌నం ఉండ‌దు.

సెక్టోర‌ల్ ఎంబీఏ కోర్సులు అందిస్తోన్న కొన్ని ప్రముఖ సంస్థలు, బీ స్కూల్స్‌

ఎంబీఏ (ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్‌)
అంత‌ర్జాతీయ స్థాయి వ్యాపారాంశాల‌పై ఇందులో ఎక్కువ‌గా బోధిస్తారు. ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు, క‌స్టమ్స్ త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. సాధార‌ణంగా ఈ కోర్సు చ‌దివిన‌వారికి బ‌హుళ‌జాతి కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఆ కంపెనీకి విదేశాల‌తోపాటు మ‌న‌దేశంలోనూ శాఖ ఉంటే ఎంబీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్ చ‌దివిన‌వారి సేవ‌లు ఉప‌యోగ‌ప‌తాయి. విదేశీ అవ‌కాశాలు సొంతం చేసుకోవ‌చ్చు.
సంస్థలు
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌, న్యూదిల్లీ
వెబ్‌సైట్‌: http://edu.iift.ac.in
సింబ‌యాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్‌, పుణె
వెబ్‌సైట్‌: www.siib.ac.in
దిల్లీ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌, న్యూదిల్లీ
వెబ్‌సైట్‌: http://econdse.org
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ, నోయిడా
వెబ్‌సైట్‌: http://bimtech.ac.in
ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, న్యూదిల్లీ
వెబ్‌సైట్‌: www.fsm.ac.in
కె.జె.సోమ‌యా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్‌, ముంబై
వెబ్‌సైట్‌: www.somaiya.edu
మేనేజ్‌మెంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎండీఐ), గుర్‌గావ్‌
వెబ్‌సైట్‌: www.mdi.ac.in

రూర‌ల్ మేనేజ్‌మెంట్‌
గ్రామీణాభివృద్ధికోసం రూర‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రవేశ‌పెట్టారు. ఎన్జీవోలు, బ‌హుళ‌జాతి కంపెనీలు, ఏజెన్సీలు, ప్రభుత్వ విభాగాలు వివిధ‌ అంశాల్లో గ్రామీణాభివృద్ధి కోసం కృషిచేస్తున్నాయి. వీళ్లు చేప‌ట్టే కార్యక్రమాలు స‌వ్యంగా జ‌ర‌గడానికి రూర‌ల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల సేవ‌లు కీల‌కం. ప‌లు కంపెనీలు వ్యాపార విస్తర‌ణ వ్యూహాల్లో భాగంగా గ్రామాల‌కు ద‌గ్గర‌వుతున్నాయి. వీటికి కూడా రూర‌ల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు అవ‌స‌రం. డెయిరీలు, అగ్రిబిజినెస్‌, ఎరువుల ప‌రిశ్రమ‌లు..మొద‌లైన‌వాటిలో ఉద్యోగాలు ఉంటాయి.
కోర్సులిక్కడ‌...
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌, ఆనంద్‌
వెబ్‌సైట్‌: www.irma.ac.in
జేవియ‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, భువ‌నేశ్వర్‌
వెబ్‌సైట్: www.ximb.ac.in
ఎల్‌.ఎన్‌. వెలింగ్‌క‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రీసెర్చ్‌, ముంబై
వెబ్‌సైట్‌: www.welingkar.org
అమితీ యూనివ‌ర్సిటీ, నోయిడా
వెబ్‌సైట్‌: www.amity.edu

ఫార్మా మేనేజ్‌మెంట్‌
ఔష‌ధ కంపెనీల్లో ఫార్మా మేనేజ్‌మెంట్ కోర్సులు చ‌దివిన‌వాళ్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తారు. ఫార్మా కంపెనీల్లో కెరీర్ ఆశించేవాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు. బీఫార్మసీ అనంత‌రం ఎంబీఏ కోర్సు చ‌ద‌వాల‌నుకుంటే ఫార్మా మేనేజ్‌మెంట్ మంచి ఆప్షన్‌గా చెప్పుకోవ‌చ్చు.
సంస్థలివీ...
నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌, ముంబై
వెబ్‌సైట్‌: www.nmims.edu
ఎస్ఐఈఎస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌, ముంబై
వెబ్‌సైట్‌: www.siescoms.edu
బ‌యోటెక్నాల‌జీ
బ‌యోటెక్ ప‌రిశ్రమ‌ల్లో ఉద్యోగం కోరుకునేవాళ్లకు ఈ కోర్సు ఉప‌యోగ‌ప‌డుతుంది. బీటెక్ బ‌యోటెక్నాల‌జీ, బీఎస్సీ బ‌యోటెక్నాల‌జీ కోర్సులు చ‌దివిన‌వాళ్లు ఎంబీఏ బ‌యోటెక్నాల‌జీ బాట ప‌ట్టవ‌చ్చు.
కాలేజీలివీ...
ఎస్ఐఈఎస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌, ముంబై
వెబ్‌సైట్‌: www.siescoms.edu
అమితీ యూనివ‌ర్సిటీ, నోయిడా
వెబ్‌సైట్‌: www.amity.edu

అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌
వ్యవ‌సాయం, అనుబంధ విభాగాల్లో సేవ‌లందిస్తున్నకంపెనీల్లో ఉద్యోగం ఆశించేవారికి అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రయోజ‌నం. ఎరువులు, పురుగుమందులు..త‌యారుచేసే కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉద్యోగాలు ఉంటాయి. బీఎస్సీ(అగ్రిక‌ల్చర్‌) చ‌దివిన‌వాళ్లు ఈ కోర్సు ద్వారా మ‌రింత ప్రయోజ‌నం పొంద‌వ‌చ్చు.
కోర్సులిక్కడ‌...
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - అహ్మదాబాద్‌
వెబ్‌సైట్‌: www.iimahd.ernet.in
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - ల‌క్నో
వెబ్‌సైట్: www.iiml.ac.in
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర్ ఎక్స్‌టెన్సన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌)- హైద‌రాబాద్‌
వెబ్‌సైట్‌: www.manage.gov.in
సింబ‌యాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్‌, పుణె
వెబ్‌సైట్‌: http://www.siib.ac.in

ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌, భోపాల్‌
వెబ్‌సైట్‌: http://iifm.ac.in

క‌మ్యూనికేష‌న్ మేనేజ్‌మెంట్‌
ఈ కోర్సు చ‌దివిన‌వాళ్లు అడ్వర్టైజింగ్ కంపెనీలు, యాడ్ ఏజెన్సీలు, మీడియా, పీఆర్ ఏజెన్సీల్లో ఉద్యోగాలు పొంద‌వ‌చ్చు. కార్పొరేట్ కంపెనీల్లోనూ పీఆర్, క‌మ్యూనికేష‌న్ విభాగంలో వీరికి ఉద్యోగాలు ల‌భిస్తాయి.
సంస్థలివీ...
ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌, అహ్మదాబాద్‌
వెబ్‌సైట్‌: www.mica.ac.in
సింబ‌యాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌, పుణె
వెబ్‌సైట్‌: http://simc.edu
అమితీ యూనివ‌ర్సిటీ, నోయిడా
వెబ్‌సైట్‌: www.amity.edu

ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌
బీమా కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి.
కోర్సులిక్కడ‌...
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ, నోయిడా
వెబ్‌సైట్‌: http://bimtech.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజ్‌, హైద‌రాబాద్‌
వెబ్‌సైట్‌: www.ipeindia.org
నేష‌న‌ల్ ఇన్సూరెన్స్ అకాడెమీ, పుణె
వెబ్‌సైట్‌: www.niapune.org.in

టెలికాం మేనేజ్‌మెంట్‌
టెలికాం కంపెనీల్లో ఉద్యోగాలు ఆశించేవాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు.
సంస్థలివీ...
సింబ‌యాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్‌మెంట్‌, పుణె
వెబ్‌సైట్‌: www.sitm.ac.in
అమితీ యూనివ‌ర్సిటీ, నోయిడా
వెబ్‌సైట్‌: www.amity.edu

ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ(ఐటీ) మేనేజ్‌మెంట్‌
ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. బీటెక్ (సీఎస్ఈ, ఐటీ బ్రాంచీలు) చ‌దివిన‌వారికి ఈ కోర్సు ప్రయోజ‌నం.
కోర్సులిక్కడ‌...
ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్‌
వెబ్‌సైట్‌: www.spjimr.org
సింబ‌యాసిస్ సెంట‌ర్ ఫ‌ర్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ
వెబ్‌సైట్‌: www.scit.edu

ప్రవేశం ఇలా...
డిగ్రీ అర్హత‌తో పైన తెలిపిన అన్ని కోర్సుల్లోనూ చేరొచ్చు. క్యాట్ లేదా ఆయా బీ స్కూళ్లు నిర్వహించే ప‌రీక్షల ద్వారా కోర్సుల్లో ప్రవేశం ల‌భిస్తుంది. ఈ సంస్థల్లో చ‌దివిన‌వారికి ప్లేస్‌మెంట్లు కూడా ల‌భిస్తాయి. కోర్సుల‌న్నీ రెండేళ్ల వ్యవ‌ధితో ఉంటాయి.

Back..

Posted on 08-06-2016