Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బ్రాంచి ఏదైనా భలే కోర్సులే!

* ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పీజీ - ఎంఎస్‌ఐటీ

అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా సాంకేతిక విద్యలో డొమైన్‌ స్పెషలైజేషన్లను తెలుగు రాష్ట్రాల్లోని అయిదు యూనివర్సిటీల కన్సార్టియమ్‌ అందిస్తోంది. ఎంఎస్‌ఐటీ (మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఐటీ) పేరుతో రెండేళ్ల కోర్సును ఇది నిర్వహిస్తోంది. ఏ బ్రాంచి నుంచి అయినా ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఈ-కామర్స్‌లలో తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ తీసుకొని పీజీ పూర్తి చేసుకోవచ్చు.

మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌... ఇంజినీరింగ్‌ విద్యలోకి వేగంగా దూసుకొస్తున్న టెక్నాలజీలు ఇవి. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయిదు యూనివర్సిటీలు కలిసి ఒక కోర్సును ప్రవేశపెట్టాయి. అదే మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఐటీ (ఎంఎస్‌ఐటీ). ఐఐఐటీ-హైదరాబాద్‌, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌, జేఎన్‌టీయూ-కాకినాడ, జేఎన్‌టీయూ-అనంతపురం, ఎస్‌వీ యూనివర్సిటీ-తిరుపతి కలిసి కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ (సీఐహెచ్‌ఎల్‌)ను స్థాపించి ఈ కోర్సును 18 సంవత్సరాలుగా అందిస్తున్నాయి. ఐటీ పరిశ్రమ కోరుకునే నైపుణ్యాలు నేర్పే ఈ కోర్సుకు అమెరికాలోని కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీతో ఎంఓయూ ఉంది. ప్రయోగపూర్వకంగా నేర్చుకోవటం (లర్నింగ్‌ బై డూయింగ్‌) దీని ప్రధానాంశం. అంటే థియరీనీ, ప్రాక్టికల్‌నీ జత చేస్తారు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని స్పెషలైజేషన్‌గా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నారు.

రెండేళ్ళ ఈ కోర్సులో- ఫుల్‌ స్టాక్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ అనే స్పెషలైజేషన్లు ఉన్నాయి. కోర్సు రెండో సంవత్సరంలో విద్యార్థులు ఒక స్పెషలైజేషన్‌ను తీసుకోవాల్సివుంటుంది. ఐటీ నైపుణ్యాలతో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌నూ, కార్పొరేట్‌ జీవితంలో పనికొచ్చే జీవన నైపుణ్యాలనూ కూడా నేర్పుతారు. ఐటీ తాజా ధోరణులకు అనుగుణంగా ఈ కోర్సు కరిక్యులాన్ని ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములవడం ద్వారా పరిశ్రమకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకోగలుగుతారు.

ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు
ఈ కోర్సులో అడ్మిషన్లను ప్రవేశపరీక్ష (జీఏటీ/ జీఆర్‌ఈ)లో వచ్చిన ర్యాంకు ఆధారంగా నిర్ణయిస్తారు. ఎంఎస్‌ఐటీ కౌన్సెలింగ్‌ 2019లో ర్యాంకు క్రమం ప్రకారం వివిధ కేంద్రాల్లో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
* జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏ, ఎస్‌వీయూలలో అడ్మిషన్లు పొందినవారు 4 వారాల ప్రిపరేటరీ ప్రోగ్రాం చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత వారిని ఎంఎస్‌ఐటీ మెయిన్‌ ప్రోగ్రాంలోకి ప్రవేశపెడతారు.
* ఐఐఐటీహెచ్‌, జేఎన్‌టీయూహెచ్‌లలో అడ్మిషన్లు పొందినవారికి ఈ కోర్సులోకి నేరుగా ప్రవేశం ఉంటుంది.
* హైదరాబాద్‌లోని ఐఐఐటీ (110 సీట్లు),
* జేఎన్‌టీయూహెచ్‌ (100 సీట్లు);
* జేఎన్‌టీయూ కాకినాడ (50 సీట్లు),
* జేఎన్‌టీయూ అనంతపురం (50 సీట్లు),
* తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (50 సీట్లు)
* మొత్తం 360 సీట్లలో ప్రవేశాలుంటాయి.
ఐఐఐటీలో వార్షిక ఫీజు రూ.2 లక్షలుంటుంది. జేఎన్‌టీయూహెచ్‌లో 1.70 లక్షల రూపాయలు. మిగతా చోట్ల ఈ ఫీజు రూ. 1.60 లక్షలు.

ఐటీ, సాఫ్ట్‌స్కిల్స్‌
విద్యార్థులకు ఐటీ నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పటం ఎంఎస్‌ఐటీ కరిక్యులమ్‌లో భాగం. ఐటీ స్కిల్స్‌లో- విద్యార్థులు కోర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను (కంప్యుటేషనల్‌ థింకింగ్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామింగ్‌, ప్రిన్సిపల్స్‌, అల్‌గారిదమ్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌, డేటా బేసెస్‌ వరకూ) మొదటి సెమిస్టర్లో అభ్యసిస్తారు.బీ టెక్‌ నేపథ్యమున్న ఏ విద్యార్థి అయినా ఐటీ డొమెయిన్‌లో పటిష్టమైన పునాదిని మొదటి సెమిస్టర్‌లోనూ పొందగలుగుతారు. సాఫ్ట్‌ స్కిల్స్‌లో- కీలక భావనల పరిజ్ఞానాన్ని ఈ-మాడ్యూల్స్‌ అందిస్తాయి. ప్రతిరోజూ లిసనింగ్‌ ఎసైన్‌మెంట్లు, స్పీకింగ్‌ యాక్టివిటీస్‌, రీడింగ్‌-రైటింగ్‌ అసైన్‌మెంట్లు ఉంటాయి.
* నలుగురి నుంచి ఏడుగురు విద్యార్థులకు ఒక మెంటర్‌ను కేటాయిస్తారు.
* ప్రతివారం విద్యార్థులు తరగతిలో మెంటర్‌ సమక్షంలో అందరి ముందు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లను ఇవ్వాల్సివుంటుంది. ఇలా కోర్సు మొదటి సంవత్సరంలో ప్రతి విద్యార్థీ 48 ప్రెజెంటేషన్ల వరకూ ఇచ్చే అవకాశం ఉంటుంది.
* కార్పొరేట్‌ ఎటికెట్‌... అక్కడి మర్యాదలూ పద్ధతులపై వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహిస్తారు.
* రెజ్యూమేలు తయారు చేయటం దగ్గరనుంచి మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరవటం వరకూ విద్యార్థులను సన్నద్ధం చేస్తారు.
దరఖాస్తు ఎలా?: వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వాక్‌ ఇన్‌ ఎంట్రన్స్‌: మే 18, 2019 వరకు
దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ: మే 13, 2019.
జీఏటీ ప్రవేశపరీక్ష: మే 26, 2019 నుంచి
వెబ్‌సైట్‌: www.msitprogram.net

ప్రముఖ సంస్థల్లో నియామకాలు
ఎంఎస్‌ఐటీ 2017-19 బ్యాచ్‌ విద్యార్థుల్లో చాలామంది ప్రాంగణ నియామకాల ద్వారా అమెజాన్‌, జీఈ ఇండియా, జీఈ డిజిటల్‌, టీసీఎస్‌, హెచ్‌ఎస్‌బీసీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఐఐఎస్‌బీసీ, మ్యాగ్నిట్యూడ్‌, పేటీఎం, మెడ్‌ప్లస్‌, ఇంటలెక్ట్‌... మొదలైన సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. కనిష్ఠంగా రూ. 3.53 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 29 లక్షల వరకూ వార్షిక వేతనం ఆఫర్‌ చేశాయి. ప్లేస్‌మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయి.

రెండు రకాలుగా జీఏటీ
ప్రవేశపరీక్ష అయిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీఏటీ) రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాక్‌ ఇన్స్‌. రెండోది ప్రవేశపరీక్ష. అభ్యర్థులు రెండిట్లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ హాజరుకావొచ్చు.
వాక్‌ ఇన్స్‌: ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్‌ చేసుకుని అనుకూలమైన తేదీల్లో వాక్‌ ఇన్స్‌కు వెళ్ళవచ్చు.హైదరాబాద్‌, కాకినాడల్లో వాకిన్స్‌ జరుగుతాయి.
ప్రవేశ పరీక్ష: దీన్ని హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురాల్లో నిర్వహిస్తారు. జులై 2016 తర్వాత జీఆర్‌ఈ రాసి 301/3.5 స్కోరు తెచ్చుకున్నవారికి ఈ జీఏటీ నుంచి మినహాయింపు ఇస్తారు.

మెరికల్లా మార్చే శిక్షణ
కీలకమైన కంప్యూటర్‌ సైన్స్‌ కాన్సెప్టులపైనే కాదు; సరికొత్త ఐటీ టెక్నాలజీలైన మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌ మొదలైనవాటిపై పట్టు పెంచుకునేలా కోర్సు రూపకల్పన జరిగింది. దీంతో పాటు కంప్యుటేషనల్‌ థింకింగ్‌, అల్గారిథ]మ్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, కాంపిటీటివ్‌ ప్రోగ్రామింగ్‌ లాంటి వాటి వల్ల విద్యార్థులు సాంకేతికంగా మెరికల్లా తయారై నిపుణులైన ఐటీ ప్రొఫెషనల్స్‌గా మారగలుగుతారు.
- ప్రొ. మేడా శ్రీనివాసరావు, డీన్‌, ఎంఎస్‌ఐటీ

విద్యార్థులేమంటున్నారు?
థియరీకి సంబంధించిన గట్టి పునాదినిచ్చి అత్యుత్తమ ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని కోర్సు నేర్పింది. అందుకే ప్రాంగణ నియామకాల్లో ప్రముఖ సంస్థ అమెజాన్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం అక్కడే ఇంటర్న్‌ చేస్తున్నా. ఎంఎస్‌ఐటీ ద్వారా గ్రహించిన పని సంస్కృతి వల్ల ఈ సంస్థలో తేలిగ్గానే ఇమిడిపోగలిగాను.
- ఎ. సాహితీ రెడ్డి, ఐఐఐటీహెచ్‌
బీటెక్‌లో కోర్‌ సబ్జెక్టులపై నాకేమంత పట్టు లేదు. ఎంఎస్‌ఐటీలో చేరాక ఆ లోపం సవరించుకున్నాను. సాఫ్ట్‌స్కిల్స్‌ ద్వారా స్టేజి ఫియర్‌ పోగొట్టుకున్నా. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవటానికి ఇక్కడ మెంటర్లు ఎంతో తోడ్పడ్డారు. ఫలితంగా కోడ్‌ విటా ప్రక్రియ ద్వారా ఉద్యోగం లభించింది.
- సంకల్ప్‌, జేఎన్‌టీయూహెచ్‌


Back..

Posted on 29-04-2019