Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆర్కిటెక్చ‌ర్ కోర్సుల్లోకి... నాటా

దేశ‌వ్యాప్తంగా బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ (బీఆర్క్‌) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నేష‌న‌ల్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఆర్కిటెక్చ‌ర్ (నాటా) రాయ‌డం త‌ప్ప‌నిస‌రి. దేశంలో దాదాపు 480 సంస్థ‌లు ఆర్కిటెక్చ‌ర్ కోర్సులు అందిస్తున్నాయి. నాటా ద్వారా ఈ సంస్థ‌లు నిర్వ‌హిస్తోన్న‌ అయిదేళ్ల బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ కోర్సుల్లో ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు. ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌రీక్ష వివ‌రాలు తెలుసుకుందాం...

ప‌రీక్ష‌ను ఏడాదికి రెండు సార్లు నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థులు రెండుసార్లూ లేదా ఏదో ఒక‌సారి రాసుకోవ‌చ్చు. రెండుసార్లూ రాసుకున్న‌వారికి ఏ ప్ర‌య‌త్నంలో ఎక్కువ మార్కులు సాధిస్తే అదే స్కోర్ గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించ‌డానికి ఒక్కో విభాగంలోనూ క‌నీసం 25 శాతం మార్కులు సాధించాలి. అంటే పార్ట్ ఎలో 120కి 30, పార్ట్ బిలో 80కి 20 పొంద‌డం త‌ప్ప‌నిస‌రి. ప‌రీక్షకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ప‌రీక్ష ఇలా...
మొత్తం 200 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎ కు 120 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని60 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో మ్యాథ్స్ నుంచి 20, జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పార్ట్‌-బి 120 నిమిషాల‌ వ్యవ‌ధిలో ఉంటుంది. అయితే దీనికి మార్కులు 80. ఎ-4 ప‌రిమాణం పేప‌ర్‌పై డ్రాయింగ్ (రెండు సెట్లు) గీయాలి. ఒక్కో చిత్రానికి 40 చొప్పున మార్కులు ఉంటాయి.

విద్యార్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో క‌నీసం 50 శాతం మార్కుల‌తోపాటు ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు అర్హులు. ప్ర‌స్తుతం ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ: మార్చి 11 (మొద‌టి ప‌రీక్ష‌కు) జూన్ 12 (రెండో టెస్టుకు)

ప‌రీక్ష తేదీ: మొద‌టిది ఏప్రిల్ 14, రెండోది జులై 7.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌పట్నం.

వెబ్‌సైట్‌
Back..

Posted on 24-01-2019