Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నాటా

నేష‌న‌ల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ప్రవేశ ప్రక‌ట‌న వెలువ‌డింది. ఆర్కిటెక్చర్ కెరీర్‌గా ఆశించిన‌వాళ్లు ఈ ప‌రీక్ష ద్వారా ఉన్నత సంస్థల్లో ప్రవేశం పొంద‌డం ద్వారా క‌ల నెర‌వేర్చుకోవ‌చ్చు. భార‌తీయ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ (సీఓఏ) ప‌రీక్షను నిర్వహిస్తుంది. దేశ‌వ్యాప్తంగా దాదాపు 450 సంస్థలు నాటా స్కోర్‌తో ప్రవేశాల‌కు అనుమ‌తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌లు ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు ఈ స్కోర్‌తో బీఆర్క్ కోర్సులో ప్రవేశం క‌ల్పిస్తున్నాయి. ప‌రీక్షకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ప‌రీక్ష ఇలా...
మొత్తం 200 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎ కు 120 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో మ్యాథ్స్ నుంచి 20, జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పార్ట్‌-బి కూడా 90 నిమిషాల వ్యవ‌ధిలోనే ఉంటుంది. అయితే దీనికి మార్కులు 80. ఎ-4 ప‌రిమాణం పేప‌ర్‌పై డ్రాయింగ్ (రెండు సెట్లు) గీయాలి. ఒక్కో చిత్రానికి 40 చొప్పున మార్కులు ఉంటాయి.

అర్హత‌లు:
విద్యార్హత‌: మ్యాథ్స్ ఒక స‌బ్జెక్టుగా ఇంట‌ర్ ఉత్తీర్ణత సాధించాలి లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ఇంట‌ర్‌/ డిప్లొమాలో 50 శాతం మార్కులు త‌ప్పనిస‌రి.
వ‌యోప‌రిమితి: జులై 31, 2017 నాటికి 17 ఏళ్లు పూర్తవ్వాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ: ఫిబ్రవ‌రి 2.
ప‌రీక్ష తేదీ: ఏప్రిల్ 16 (ఆదివారం) ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌పట్నం.
ఫ‌లితాలు: జూన్ 10న ప్రక‌టిస్తారు.

బ్రోచ‌ర్‌
వెబ్‌సైట్: http://nata.nic.in/webinfo/public/home.aspx
అప్లై ఆన్‌లైన్: http://nata.nic.in/nataapp/Root/Home.aspx?appFormId=NATA2017

నోటిఫికేష‌న్‌

Back..

Posted on 09-01-2017