Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జాతీయ క్రీడా పురస్కారాలు - 2020

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వర్చువల్‌ విధానంలో నిరాడంబరంగా జరిగింది.
* దేశంలోని వివిధ సాయ్‌ కేంద్రాల నుంచి పురస్కార గ్రహీతలు, రాష్ట్రపతి భవన్‌ నుంచి రామ్‌నాథ్‌ కోవింద్, విజ్ఞాన్‌ భవన్‌ నుంచి కేంద్ర క్రీడా మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* హాకీ దిగ్గజం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి (ఆగస్టు 29)ని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం రోజున క్రీడా అవార్డులును అందజేస్తారు.
* ఈ ఏడాది అత్యధికంగా 73 మందికి పురస్కారాలు ప్రకటించారు.

నగదు బహుమతి
ఈ ఏడాది నుంచి క్రీడా పురస్కార గ్రహీతలకు అందించే నగదు బహుమతిని పెంచినట్లు కేంద్ర క్రీడామంత్రి కిరెన్‌ రిజిజు ప్రకటించారు.
* ఖేల్‌రత్నకు రూ.7.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు, అర్జున, ద్రోణాచార్య జీవితకాల పురస్కారాలకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.

విజేతల జాబితా

రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డు
1. రోహిత్‌ శర్మ (క్రికెట్‌)
2. మరియప్పన్‌ టి. (పారా అథ్లెటిక్స్‌)
3. మణిక బాత్రా (టేబుల్‌ టెన్నిస్‌)
4. వినేష్‌ (కుస్తీ)
5. రాణి (హాకీ)

ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌ టైమ్‌ కేటగిరీ)
1. ధర్మేంద్ర తివారీ (విలువిద్య)
2. పురుషోత్తం రాయ్‌ (అథ్లెటిక్స్‌)
3. శివ సింగ్‌ (బాక్సింగ్‌)
4. రోమేష్‌ పథానియా (హాకీ)
5. క్రిషన్‌ కుమార్‌ హుడా (కబడ్డీ)
6. విజయ్‌ భల్‌చంద్ర మునిశ్వర్‌ (పారా పవర్‌లిఫ్టింగ్‌)
7. నరేష్‌ కుమార్‌ (టెన్నిస్‌)
8. ఓం ప్రకాష్‌ దహియా (కుస్తీ)

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్‌ కేటగిరీ)
1. జూడ్‌ ఫెలిక్స్‌ సెబాస్టియన్‌ (హాకీ)
2. యోగేశ్‌ మాల్వియా (మల్లఖాంబ్‌)
3. జస్పాల్‌ రానా (షూటింగ్‌)
4. కుల్దీప్‌ కుమార్‌ హందూ (వుషు)
5. గౌరవ్‌ ఖన్నా (పారా-బ్యాడ్మింటన్‌)

అర్జున అవార్డు
1. అతను దాస్‌ (విలువిద్య)
2. డ్యూటీ చంద్‌ (అథ్లెటిక్స్‌)
3. సాత్విక్‌ సైరాజ్‌ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్‌)
4. చిరగ్‌ చంద్రశేఖర్‌ శెట్టి (బ్యాడ్మింటన్‌)
5. విశేష్‌ భ్రిగువాన్షి (బాస్కెట్‌బాల్‌)
6. సుబేదార్‌ మనీష్‌ కౌశిక్‌ (బాక్సింగ్‌)
7. లోవ్లినా బోర్గోహైన్‌ (బాక్సింగ్‌)
8. ఇశాంత్‌ శర్మ (క్రికెట్‌)
9. దీప్తి శర్మ (క్రికెట్‌)
10. సావంత్‌ అజయ్‌ అనంత్‌ (ఈక్వెస్ట్రియన్‌)
11. సందేష్‌ జింగాన్‌ (ఫుట్‌బాల్‌)
12. అదితి అశోక్‌ (గోల్ఫ్‌)
13. ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (హాకీ)
14. దీపిక (హాకీ)
15. దీపక్‌ (కబడ్డీ)
16. కాలే సరిక సుధాకర్‌ (ఖో ఖో)
17. దత్తు బాబన్‌ భోకనాల్‌ (రోయింగ్‌)
18. మను భాకర్‌ (షూటింగ్‌)
19. సౌరభ్‌ చౌదరి (షూటింగ్‌)
20. మాధురికా సుహాస్‌ పట్కర్‌ (టేబుల్‌ టెన్నిస్‌)
21. దివిజ్‌ శరణ్‌ (టెన్నిస్‌)
22. శివ కేశవన్‌ (శీతాకాలపు క్రీడలు)
23. దివ్య కాక్రాన్‌ (కుస్తీ)
24. రాహుల్‌ అవేర్‌ (కుస్తీ)
25. సుయాష్‌ నారాయణ్‌ జాదవ్‌ (పారా స్విమ్మింగ్‌)
26. సందీప్‌ (పారా అథ్లెటిక్స్‌)
27. మనీష్‌ నార్వాల్‌ (పారా షూటింగ్‌)

ధ్యాన్‌ చంద్‌ అవార్డు
1. కుల్దీప్‌ సింగ్‌ భుల్లార్‌ (అథ్లెటిక్స్‌)
2. జిన్సీ ఫిలిప్స్‌ (అథ్లెటిక్స్‌)
3. ప్రదీప్‌ శ్రీకృష్ణ గాంధే (బ్యాడ్మింటన్‌)
4. తృప్తి ముర్గుండే (బ్యాడ్మింటన్‌)
5. ఎన్‌. ఉషా (బాక్సింగ్‌)
6. లఖా సింగ్‌ (బాక్సింగ్‌)
7. సుఖ్వీందర్‌ సింగ్‌ సంధు (ఫుట్‌బాల్‌)
8. అజిత్‌ సింగ్‌ (హాకీ)
9. మన్‌ప్రీత్‌ సింగ్‌ (కబడ్డీ)
10. జె. రంజిత్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌)
11. సత్యప్రకాష్‌ తివారీ (పారా బ్యాడ్మింటన్‌)
12. మంజీత్‌ సింగ్‌ (రోయింగ్‌)
13. దివంగత శ్రీ సచిన్‌ నాగ్‌ (ఈత)
14. నందన్‌ పి బాల్‌ (టెన్నిస్‌)
15. నేతర్‌పాల్‌ హుడా (కుస్తీ)

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ (మాకా) ట్రోఫీ
1. పంజాబ్‌ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌

టెన్జింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వెంచర్‌ అవార్డ్స్‌
1. అనితా దేవి (ల్యాండ్‌ అడ్వెంచర్‌)
2. కల్నల్‌ సర్ఫాజ్ర్‌ సింగ్‌ (ల్యాండ్‌ అడ్వెంచర్‌)
3. టాకా తముత్‌ (ల్యాండ్‌ అడ్వెంచర్‌)
4. నరేందర్‌ సింగ్‌ (ల్యాండ్‌ అడ్వెంచర్‌)
5. కేవల్‌ హిరెన్‌ కక్కా (ల్యాండ్‌ అడ్వెంచర్‌)
6. సతేంద్ర సింగ్‌ (వాటర్‌ అడ్వెంచర్‌)
7. గజానంద్‌ యాదవ (ఎయిర్‌ అడ్వెంచర్‌)
8. దివంగత శ్రీ మగన్‌ బిస్సా (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌)

రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌
1. ఐడెంటిఫికేషన్‌ అండ్‌ నర్చరింగ్‌ ఆఫ్‌ బడ్డింగ్‌ అండ్‌ యంగ్‌ ట్యాలెంట్‌ (లక్ష్యా ఇన్‌స్టిట్యూట్, ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌)
2. ఎంకరేజ్‌మెంట్‌ టు స్పోర్ట్స్‌ త్రూ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ - ఒఎన్‌జీసీ లిమిటెడ్‌.)
3. ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ పర్సెన్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ వెల్ఫేర్‌ మెజర్స్‌ (ఎయిర్‌ఫోర్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు)
4. స్పోర్ట్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ - ఐఐఎస్‌ఎం)

ధ్యాన్‌చంద్‌ గురించి
* జాతీయ క్రీడా దినోత్సవాన్ని భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న జరుపుకుంటారు.
* ధ్యాన్‌చంద్‌ 1905 ఆగస్టు 29న అలహాబాద్‌లోని ప్రయాగ్‌లో జన్మించారు. ఈయన 1936లో బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు.
* ఇతడు భారతదేశపు గొప్ప హాకీ ఆటగాడు. ‘విజార్డ్‌ ఆఫ్‌ హాకీ’గా పేరొందారు. ధ్యాన్‌చంద్‌ 1922 లో భారత సైన్యంలో సైనికుడిగా చేరారు. 1927లో ‘ల్యేన్స్‌ నేక్‌’ (lance naik) గా నియమితుడయ్యారు. 1932లో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు 1936లో నాయక్‌ మరియు సుబేదార్‌గా పదోన్నతి పొందారు. తర్వాత అతడు లెఫ్టినెంట్‌ అయ్యారు. కెప్టెన్, చివరికి మేజర్‌గా పదోన్నతి పొందారు. 1956లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రదానం చేసింది, ఇది మన దేశంలో మూడవ అతిపెద్ద పౌర పురస్కారం.
* మూడుసార్లు ఒలింపిక్‌ బంగారు పతకాన్ని గెలుపొందారు. భారత హాకీ జట్టులో భాగం. 1936 నాటి బెర్లిన్‌ ఒలింపిక్‌ క్రీడలల్లో భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ఎన్నికయ్యారు.
* మేజర్‌ ధ్యాన్‌చంద్‌ తన కెరీర్‌లో 1926 నుంచి 1948 వరకు 400కి పైగా అంతర్జాతీయ గోల్స్‌ చేశారు. అదే సమయంలో తన మొత్తం కెరీర్‌లో దాదాపు 1,000 గోల్స్‌ చేశారు.
* ఇటువంటి గొప్ప ఆటగాడికి నిజమైన నివాళి అందించే ఉద్దేశంతో అతడి పుట్టిన రోజును 2012 నుంచి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
* 1979లో మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ మరణానంతరం భారత పోస్టల్‌ విభాగం ఈయన పేరిట స్టాంపులను విడుదల చేసింది. దిల్లీలోని నేషనల్‌ స్టేడియంకు ‘మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ స్టేడియం’ అని పేరు పెట్టారు.

మరికొన్ని అంశాలు
* రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న దేశంలోని అత్యున్నత క్రీడా గౌరవం. దీన్ని క్రీడాకారుడు తన కేరీర్‌లో నాలుగేళ్ల కాలంలో అద్భుతమైన, అత్యుత్తమ ప్రదర్శనకుగాను ఇస్తారు.
* అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతక విజేతలను అందించినందుకు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తారు.
* నాలుగేళ్లుగా సంబంధిత క్రీడలో నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినవారికి అర్జున అవార్డును ఇస్తారు.
* క్రీడా అభివృద్ధికి జీవితకాలం కృషిచేసినవారికి ధ్యాన్‌చంద్‌ అవార్డును ప్రదానం చేస్తారు.
* ఇంటర్‌ యూనివర్శిటీ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే విశ్వవిద్యాలయానికి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ (మాకా) ట్రోఫీని ఇస్తారు.
* కార్పొరేట్‌ సంస్థలకు (ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో) రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కర్‌ను ప్రదానం చేస్తారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించిన, అభివృద్ధి చేసినవారికి కూడా ఈ పురస్కారాన్ని అందిస్తారు.

Back..

Posted on 07-09-2020