Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చక్కెర సంస్థలో చక్కని దారులు!

పంచదార, ఆల్కహాల్‌ సంబంధిత పరిశ్రమల్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారి కోసం కాన్పుర్‌లోని జాతీయ చక్కెర సంస్థ (నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌) కొన్ని కోర్సులను నిర్వహిస్తోంది. వేగంగా ఉద్యోగావకాశాలను అందించే ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు ఇందులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు.

నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా వివిధ కోర్సుల్లో మొత్తం 210 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా ఫెలోషిప్‌ డిప్లొమాకు సంబంధించిన మూడు రకాల కోర్సుల్లో అవసరాన్ని బట్టి సీట్లను నింపుతారు. వీటికి వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలుంటాయి. డిప్లొమా కోర్సులకు డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సులకు టెన్త్‌, ఇంటర్‌ చదివినవారు అర్హులు.

పీజీ డిప్లొమా కోర్సులు
* పీజీ డిప్లొమా కోర్స్‌ ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ (ఏఎన్‌ఎస్‌ఐ (ఎస్‌టీ)): 60 సీట్లు
బీఎస్‌సీ (ఎంపీసీ)/ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసినవారు అర్హులు.
* పీజీ డిప్లొమా కోర్స్‌ ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ ఇంజినీరింగ్‌ (ఏఎన్‌ఎస్‌ఐ (ఎస్‌ఈ)): 30 సీట్లు
డిగ్రీ లేదా ఏఎంఐఈ నుంచి మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ చదివినవారు అర్హులు.
* పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఫర్మంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ (డీఐఎఫ్‌ఏటీ) : 35 సీట్లు
బీఎస్‌సీలో కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు లేదా బీటెక్‌లో బయోటెక్నాలజీ/ కెమికల్‌/ బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసినవారు అర్హులు.
* పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ షుగర్‌కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌ (డీఎస్‌పీఎంఎం): 18 సీట్లు ఏదైనా బీఎస్‌సీ/ బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చేసినవారు అర్హులు
* పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌. సీట్లు - 15. అర్హత ఏదైనా డిగ్రీ లేదా ఏఎంఐఈ.
* పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ (డీక్యూసీఈఎస్‌): 20 సీట్లు
బీఎస్‌సీ ఎంపీసీ/ బీజెడ్‌సీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ బయోటెక్నాలజీ/ బీటెక్‌ బయోటెక్నాలజీ చదివినవారు అర్హులు.

ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ విభాగం
ఫెలోషిప్‌ ప్రోగ్రాములు దీనిలో ఉంటాయి. ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ/ షుగర్‌ కెమిస్ట్రీ (ఏఎన్‌ఎస్‌ఐ (షుగర్‌ టెక్‌ పూర్తిచేసినవారు అర్హులు); ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ షుగర్‌ ఇంజినీరింగ్‌ (ఏఎన్‌ఎస్‌ఐ షుగర్‌ ఇంజినీరింగ్‌ చేసినవారు అర్హులు); ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ ఫర్మెన్‌టేషన్‌ టెక్నాలజీ (డీఐఎఫ్‌ఏటీ పూర్తిచేసినవారు అర్హులు) కోర్సులున్నాయి.
వయఃపరిమితి: పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులకు జులై 1, 2019నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ విభాగానికి 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఎలా?
ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్‌సీ, ఎస్‌టీ వారికి రూ.800, మిగిలినవారికి రూ.1200. దీనిని డీడీ రూపంలో డైరెక్టర్‌, నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర (పేయబుల్‌ ఎట్‌ కాన్పుర్‌) తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మే 3, 2019
పరీక్ష విధానం: దరఖాస్తు చేసుకున్న కోర్సునుబట్టి ప్రశ్నపత్రం మారుతుంది. ప్రశ్నపత్రం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. అభ్యర్థి ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఎంచుకున్న కోర్సునుబట్టి విభాగాల్లో మార్పులుంటాయి. రెండింటికీ సమాన మార్కులు కేటాయించారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌, స్వల్ప, దీర్ఘ సమాధానాల రూపంలో ఉంటాయి.
పరీక్ష తేదీ: జూన్‌ 9, 2019
పరీక్ష కేంద్రాలు: పుణె, చెన్నై, దిల్లీ, కాన్పుర్‌, కోల్‌కతా, పట్నా
వెబ్‌సైట్‌: http://nsi.gov.in

సర్టిఫికెట్‌ కోర్సులు
* షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ (ఎస్‌బీసీసీ): 57 సీట్లు
మెట్రిక్యులేషన్‌/ హైస్కూల్‌ సైన్స్‌/ అగ్రికల్చర్‌ కోర్సులతోపాటు వాక్యూమ్‌ పాన్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో కనీసం 90 రోజుల అనుభవం ఉండాలి.
* షుగర్‌ ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ (ఎస్‌ఈసీసీ): 15 సీట్లు
మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులు.
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ క్వాలిటీ కంట్రోల్‌ (సీసీక్యూసీ): 20 సీట్లు
ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు అర్హులు.


Back..

Posted on 17-04-2019