Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఉత్తీర్ణత పొందితే ఉద్యోగానికి అర్హత

కేంద్రప్రభుత్వం పర్యటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో దేశంలో హోటల్‌ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. యవతీ యువకులు దీన్ని కెరియర్‌గా ఎంచుకుని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేస్తున్నారు. భారత పర్యటక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) వీరికోసం దేశవ్యాప్తంగా అనేక కళాశాలలను ఏర్పాటుచేసింది. అందులో చదువుకునే విద్యార్థుల కోసం ప్రతిభగల అధ్యాపకులను అందించాలనే లక్ష్యంతో ఏటా ఎన్‌హెచ్‌టెట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికే టీచింగ్‌ పోస్టులను కేటాయిస్తున్నారు. ఎన్‌సీహెచ్‌ఎంసీటీకి అనుబంధంగా 21 కేంద్ర, 25 రాష్ట్ర, 20 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) కళాశాలలున్నాయి.
ఎవరు అర్హులు?: హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ (10+2+3)/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులు అర్హులు. హాస్పిటాలిటీ పరిశ్రమలో రెండేళ్ళ పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో మూడు పేపర్లుగా పరీక్ష ఉంటుంది.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: జులై 09
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు పంపేందుకు చివరితేది: జులై 12.
వెబ్‌సైట్‌: http://www.ihmhyd.org/
ప్రభుత్వ సంస్థల్లో..
హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ/ పీజీ తర్వాత టీచింగ్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ పరీక్ష రాయవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ఐహెచ్‌ఎంలలో ఉద్యోగాలున్నాయి. ప్రిపరేషన్‌కు ప్రత్యేక పుస్తకాలంటూ ఏమీ లేవు. గ్రాడ్యుయేషన్‌లో చదివిన సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ కోసం పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. - సంజయ్‌ ఠాకూర్‌, ప్రిన్సిపల్‌, ఐహెచ్‌ఎం హైదరాబాద్‌.



Back..

Posted on 09-07-2019