Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
‘నీట్‌’ కటాఫ్‌ మారుతుందా?

నీట్‌లో అర్హత పొందితేనే ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ బీ, సీలలో సీట్లు పొందడానికీ, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చేరడానికీ అవకాశం ఉంది. అందుకే విద్యార్థులు గత సంవత్సరం కటాఫ్‌ మార్కులు, ఈ సంవత్సరం ఎంత ఉండవచ్చు అనే అంశాలపై స్పష్టత ఏర్పరచుకోవడం అవసరం.
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల మెడికల్‌ ప్రవేశపరీక్షలు ఈ సంవత్సరం అస్పష్టత నుంచి స్పష్టత వైపు ప్రయాణిస్తున్నాయని చెప్పవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన నీట్‌పై అవగాహన ఏర్పరచుకోగలిగితే తయారీ విధానంలో పట్టు ఏర్పరచుకుని మంచి ర్యాంకు సాధించుకోవచ్చు. ఎంసెట్‌లో ఇంటర్‌లోని గ్రూపు మార్కులకు 25 శాతం వెయిటేజి ఉంది కానీ నీట్‌లో ఇంటర్‌ మార్కులకు ఎలాంటి ప్రాధాన్యమూ లేదు.
ఈ సంవత్సరం కూడా ఎంసెట్‌లోని మెడికల్‌ సీట్ల సంఖ్య కంటే నీట్‌ ద్వారా నింపే సీట్లు చాలా ఎక్కువ.
నీట్‌ మొత్తం 180 ప్రశ్నలతో జరుగుతుంది. వీటిలో బయాలజీ 90, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45 ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికీ +4 మార్కులూ, తప్పు సమాధానానికి 1 మైనస్‌ మార్కు. అంటే నీట్‌ (గతంలో ఏఐపీఎంటీ) మొత్తం 720 మార్కులకు జరుగుతుంది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పోటీ బాగా పెరిగింది. క్రితం ఏడాది పరీక్షకు హాజరైన విద్యార్థులు 4,50,000 మంది. ఈ సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పరీక్ష రాసేవారి సంఖ్య రెట్టింపు అయింది. అంటే ఈ మార్కులు- ర్యాంకులుబాగా పెరిగే అవకాశం ఉంది. కటాఫ్‌ మార్కులు మారకపోవచ్చు కానీ ర్యాంకులు మారతాయి.
గత సంవత్సరం జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు హర్యానా రాష్ట్ర విద్యార్థి సాధించాడు. అతడికి 720 మార్కులకు 695 మార్కులు వచ్చాయి. ఈ సంవత్సరం ఈ మార్కు 700 వరకూ ఉండే అవకాశం ఉంది.
గత ఏడాది 720 మార్కులకు 600 మార్కులు తెచ్చుకుంటే జాతీయ స్థాయిలో 500 ర్యాంకు వచ్చింది. కానీ ఈ సంవత్సరం అదే 600 మార్కులకు రెట్టింపు ర్యాంకు అంటే 1000 ర్యాంకు వరకూ పెరగవచ్చు.
2015 సంవత్సరంలో కొన్ని ర్యాంకులకు సాధించిన మార్కుల ఆధారంగా సుమారుగా చేసిన విశ్లేషణ ఇది. మరి ఈ సంవత్సరం పోటీ రెట్టింపయింది కాబట్టి ఆ మార్కులకు ర్యాంకు రెట్టింపవుతుంది; కొద్దిగా తక్కువ మార్కులలో విద్యార్థుల సంఖ్య బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
నీట్‌-2కు ఉపయోగపడే పుస్తకాలు
బయాలజీ: ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీ పార్ట్‌-1, 2, ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జంప్లర్‌, ఏసీ దత్తా ఫర్‌ బోటనీ (ఆక్స్‌ఫర్డ్‌ పబ్లికేషన్‌)
కెమిస్ట్రీ: ఎన్‌సీఈఆర్‌టీ 11,12 కెమిస్ట్రీ, ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జంప్లర్‌, పీటర్‌ అట్కిన్స్‌ అండ్‌ జూలియో డీ పౌలా ఫర్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ
ఫిజిక్స్‌: ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 ఫిజిక్స్‌, ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జంప్లర్‌, కాన్సెప్ట్‌ ఆఫ్‌ కాంపిటిషన్‌ ఫిజిక్స్‌ ఫర్‌ సీబీఎస్‌ఈ పీఎంటీ బై అగర్వాల్స్‌


Back..

Posted on 07-05-2016