Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నీలిట్‌లో 340 ఉద్యోగాలు

న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేష‌న్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) సైంటిస్ట్‌, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. బీటెక్, ఎమ్మెస్సీ కోర్సులు చ‌దివిన‌వాళ్లు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

పోస్టు: సైంటిస్ట్ -బి (గ్రూప్ ఎ)
ఖాళీలు : 81 (యూఆర్ 42, ఓబీసీ 21, ఎస్సీ 12, ఎస్టీ 6)
అర్హత: క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌). లేదా ఎంఎస్సీ (ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్/అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్)తోపాటు సంబంధిత రంగంలో త‌గిన‌ అనుభవం ఉండాలి.
వేత‌న శ్రేణి: రూ.56,100 - రూ.1,75,500.

పోస్టు: సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్ (గ్రూప్ - బి)
ఖాళీలు: 259 (యూఆర్ 133, ఓబీసీ 69, ఎస్సీ 38, ఎస్టీ 19)
అర్హత: క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/బీటెక్‌/ ఎమ్మెస్సీ/ఎంఎస్ (ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ & నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ సిస్టం, ఇన్‌ఫ‌ర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ ఇన్‌ఫ‌ర్మాటిక్స్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, బయో ఇన్‌ఫ‌ర్మాటిక్స్, రిమోట్ సెన్సింగ్ జియోగ్రాఫికల్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సిస్టం (జీఐఎస్), మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఆపరేషన్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ డిజైన్‌ (లేదా) ఎంసీఏ.
వేత‌న శ్రేణి: రూ.35,400 - రూ.1,12,400.

వ‌యోప‌రిమితి: పై రెండు పోస్టుల‌కు ఆగ‌స్టు 28 నాటికి 30 ఏళ్లకు మించ‌రాదు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ద‌ర‌ఖాస్తు రుసుము: రూ.800. మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగుల‌కు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 28.08.2017.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రం: హైద‌రాబాద్‌

ఎంపిక విధానం: సైంటిస్ట్ బి (గ్రూపు ఎ) పోస్టుల‌కు ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక‌చేప‌డ‌తారు. సైంటిఫిక్ / టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఎ పోస్టుల‌కు రాత ప‌రీక్షలో ప్రతిభ ద్వారా నియామ‌కాలు ఉంటాయి. ఇంట‌ర్వ్యూలు ఉండ‌వు.

రాత ప‌రీక్ష ఇలా...
ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జ‌వాబులు ఓఎంఆర్ ప‌త్రంపై గుర్తించాలి. మొత్తం 120 ప్రశ్నలు వ‌స్తాయి. వీటిలో 60 ప్రశ్నలు కంప్యూట‌ర్ సైన్స్ నుంచే అడుగుతారు. మిగిలిన 60 ప్రశ్నలు లాజిక‌ల్‌, ఎన‌లిటిక‌ల్ రీజ‌నింగ్‌; క‌్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అబిలిటీస్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఆప్టిట్యూడ్ అంశాల నుంచి వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. త‌ప్పుగా గుర్తించిన జ‌వాబుకు పావు మార్కు చొప్పున‌ త‌గ్గిస్తారు. రాత ప‌రీక్షలో అర్హత సాధించ‌డానికి జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 50 శాతం, ఓబీసీలు 40 శాతం; ఎస్సీ, ఎస్టీలు 30 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. క‌నీస అర్హత మార్కులు సాధించిన‌వారినుంచి మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల‌కు వెయిటేజీ 85:15 గా నిర్ణయించారు. ఇంట‌ర్వ్యూలు దిల్లీలో చేప‌డ‌తారు.

నోటిఫికేష‌న్‌
అప్లై ఆన్‌లైన్‌: http://apply-delhi.nielit.gov.in/

Back..

Posted on 01-08-2017