Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎన్ఐఎన్‌లో ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిష‌న్

     పోష‌కాహారానికి సంబంధించి నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (ఎన్ఐఎన్‌) దేశంలోనే ప్రసిద్ధి చెందిన సంస్థ. భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి ఆధ్యర్యంలో దీన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ, విజ‌య‌వాడ గుర్తింపు ఉంది. ఎమ్మెస్సీలో అప్లైడ్ న్యూట్రిష‌న్ కోర్సుకు తాజాగా ఎన్ఐఎన్ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఆ వివ‌రాలు చూద్దాం...

అర్హత‌: ఎంబీబీఎస్ లేదా బీఎస్సీ- హోంసైన్స్‌/ న్యూట్రిష‌న్‌/ న‌ర్సింగ్. లేదా బ‌యోకెమిస్ట్రీ / న్యూట్రిష‌న్ ఒక మేజ‌ర్ స‌బ్జెక్టుగా బీఎస్సీ కోర్సు పూర్తిచేసిన‌వారు అర్హులు.
ద‌ర‌ఖాస్తులు: జూన్ 5 నుంచి జూన్ 29 లోగా ఎన్ఐఎన్ లేదా ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ: జూన్ 29, 2015
రిజిస్ట్రేష‌న్ ఫీజు: రూ.3000 (ఎస్సీ, ఎస్టీలైతే రూ.2700)
చిరునామా: The HoD, Extension and Training Division, National Institute of Nutrition, Jamai-Osmania PO, Hyderabad-500007

హాల్ టికెట్లు: జులై 31న ఎన్ఐఎన్, హైద‌రాబాద్‌; ఆగ‌స్ట్ 2న ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ, విజ‌య‌వాడ‌ల నుంచి పొంద‌వ‌చ్చు.
ప‌రీక్ష తేదీ: ఆగ‌స్ట్ 2, 2015 (ఆదివారం ఉద‌యం 11 గంట‌ల నుంచి 12:30 వ‌ర‌కు)
ప‌రీక్ష కేంద్రం: విజ‌య‌వాడ‌
ఫ‌లితాలు: ఆగ‌స్ట్ 24న ప్రక‌టిస్తారు
కౌన్సెలింగ్‌: సెప్టెంబ‌ర్ 23న ఎన్ఐఎన్‌, హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో నిర్వహిస్తారు.
సీట్లు: మొత్తం 16 ఉన్నాయి. వీటిలో 6 స్టేట్ కోటాలో తెలంగాణ‌, ఆంధ్ర విద్యార్థుల‌కు కేటాయించారు. మిగిలిన 10 సెంట్రల్ కోటా ద్వారా ఇత‌ర రాష్ట్రాల విద్యార్థుల‌తో భ‌ర్తీ చేస్తారు.
రాత ప‌రీక్ష ఇలా: ఇందులో మొత్తం 100 ఆబ్జెక్టివ్ త‌ర‌హా ప్రశ్నలు అడుగుతారు. వ్యవ‌ధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. న్యూట్రిష‌న్ నుంచి 40, బ‌యోకెమిస్ట్రీ నుంచి 25, ఫిజియాల‌జీ 25, మైక్రోబ‌యాల‌జీ 10 ప్రశ్నలు అడుగుతారు.
అర్హత సాధించాలంటే: క‌నీసం 40 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీలైతే 30 మార్కులు రావాలి.

వెబ్‌సైట్‌: http://ntruhs.ap.nic.in/
http://ninindia.org/nin.htm


posted on 1.6.2015