Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఫార్మసీ పీజీలో కొత్త కోర్సుల ప్రాముఖ్యం

సంప్రదాయ బ్రాంచీలయిన ఫార్మాస్యూటిక్స్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ మొదలైన విభాగాలతోపాటు ఇప్పుడు రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు ప్రాముఖ్యాన్ని సంతరించు కుంటున్నాయి.
ప్రతిష్ఠాత్మక నైపర్‌ల్లో ఫార్మసీలో పీజీ కోర్సు, పీహెచ్‌డీ ప్రోగ్రాం ప్రవేశాల కోసం నిర్దేశించిన నైపర్‌-జేఈఈ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం ఏడు నైపర్‌ల్లో 632 సీట్లకు 1558 మంది విద్యార్థులు అర్హత పొందారు. అంటే ప్రతి అయిదుగురిలో ఇద్దరికి ప్రవేశం లభించనుంది!
ఫార్మసీ పీజీలో పోటీ తక్కువగానే ఉంది. అయినప్పటికీ కోరుకున్న బ్రాంచి, అందుబాటులో ఉన్న నైపర్‌లో సీటు రావడం అంత సులువు కాదు. అందువల్ల విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో ముందుగానే ఒక అంచనాకు రావాలి.
ఏ బ్రాంచీ, ఏ నైపర్‌లో చదవాలన్నది విద్యార్థులను ముఖ్యంగా వేధించే సమస్య. అయితే ఫార్మసీ పీజీ కోర్సులో ఏ బ్రాంచీ కూడా తక్కువ కాదు. ప్రతీది దేనికదే సాటి. సంప్రదాయ బ్రాంచీలయిన ఫార్మాస్యూటిక్స్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ మొదలైన విభాగాలతోపాటు ఇప్పుడు రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ సంవత్సరం ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌లో చేరడానికి 556 మంది విద్యార్థులు అర్హత పొందారు. ఉన్న సీట్లు 73 మాత్రమే.
విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా బ్రాంచి ఎన్నుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
* అంకుర సంస్థల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌, బయోటెక్నాలజీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, పార్మాస్యూటిక్స్‌ లాంటి బ్రాంచీలను ఎంచుకోవచ్చు.
* కాంట్రాక్ట్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఆర్‌ఓ)లో అభిరుచి ఉన్నవారు ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, క్లినికల్‌ రిసెర్చ్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ లాంటి బ్రాంచీలను ఎంచుకోచ్చు.
* మానవ వనరుల అభివృద్ధి, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ల్లో ఆసక్తి ఉంటే ఎంబీఏ (ఫార్మా) ఎంచుకోవచ్చు.
ఉపకార వేతనం: నైపర్‌లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి నెలకు రూ.12,400 ఉపకార వేతనం లభిస్తుంది (ఎంబీఏ (ఫార్మా), ప్రభుత్వ/ ప్రైవేటు స్పాన్సర్డ్‌ విద్యార్థులకు తప్ప). పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.25,000 ఫెలోషిప్‌, తర్వాతి మూడు సంవత్సరాలు నెలకు రూ.28,000 ఫెలోషిప్‌ లభిస్తుంది.
ఎంబీఏ ఫార్మాలో ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థులకు నైపర్‌ నెలకు రూ.12,400 ఉపకారవేతనంగా అందిస్తుంది.

గమనించాల్సినవి
* జాయింట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు: 17, 18, 19 జులై 2017
* కోర్సులు: ఎంఎస్‌ (ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్‌ (ఫార్మా)
* ప్రదేశం: కన్వెన్షన్‌ సెంటర్‌, నైపర్‌ ఎస్‌ఏఎస్‌ నగర్‌ (మొహాలీ)
* సర్టిఫికెట్స్‌ ఒరిజినల్స్‌తోపాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలనూ వెంట తీసుకెళ్లవలసి ఉంటుంది. సీటు పొందినవారు బ్యాంకు డిమాండ్‌ డ్రాఫ్ట్‌/ పే ఆర్డర్‌/ బ్యాంకర్స్‌ చెక్‌ ద్వారా అడ్మిషన్‌ ఫీజును చెల్లించవలసి ఉంటుంది.

పీహెచ్‌డీ ప్రవేశానికి ఇంటర్వ్యూ తేదీలు
* మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్‌ ప్రాసెస్‌ కెమిస్ట్రీ, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్‌ - జులై 20, 2017
* ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మస్యూటిక్స్‌, ఫార్మస్యూటికల్‌ అనాలిసిస్‌, మెడికల్‌ డివైజెస్‌ - జులై 21, 2017

ఏ కోర్సులు, ఎన్ని సీట్లు?
దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్‌ల్లో మొత్తం నాలుగు విభాగాల్లో 16 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
* ఎంఎస్‌ (ఫార్మసీ): మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, నేచురల్‌ ప్రొడక్ట్‌, ట్రెడిషినల్‌ మెడిసిన్‌, బయోటెక్నాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మకో ఇన్‌ఫర్మాటిక్స్‌, మెడికల్‌ డివైజెస్‌, క్లినికల్‌ రిసెర్చ్‌.
* ఎం.ఫార్మసీ: ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌)
* ఎంటెక్‌ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ), ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ)
*ఎంబీఏ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌
* పీహెచ్‌డీ: పైవాటిల్లో చాలావరకు కోర్సుల్లో
అన్ని నైపర్‌లలో అన్ని పీజీ కోర్సులూ అందుబాటులో లేవు. మొత్తం 632 సీట్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మొహాలీలో 249, అత్యల్పంగా గువాహటిలో 41 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నైపర్‌లో మొత్తం 125 సీట్లు ఉన్నాయి.
హైదరాబాద్‌ నైపర్‌లో 80 శాతం ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. మిగతా విద్యార్థులు ఉన్నత విద్యకూ, పీహెచ్‌డీకీ వివిధ దేశ, విదేశీ సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతున్నారు.
* గువాహటి నైపర్‌లో ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ (20), బయోటెక్నాలజీ (10), ఫార్మసీ ప్రాక్టీస్‌ (10), పీహెచ్‌డీ సీటు 1 ఉన్నాయి.
* రాయ్‌బరేలీ నైపర్‌లో మెడిసినల్‌ కెమిస్ట్రీ (20), ఫార్మాస్యూటిక్స్‌ (15), ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ (6), పీహెచ్‌డీ సీటు 1 ఉన్నాయి.
* హాజీపూర్‌ నైపర్‌లో బయోటెక్నాలజీ (15), ఫార్మసీ ప్రాక్టీస్‌ (15), ఫార్మకో ఇన్‌ఫర్మాటిక్స్‌ (15), పీహెచ్‌డీ సీటు 1 ఉన్నాయి.
* కోల్‌కత నైపర్‌లో మెడిసినల్‌ కెమిస్ట్రీ (17), నేచురల్‌ ప్రొడక్ట్స్‌ (17), ఫార్మకో ఇన్‌ఫార్మాటిక్స్‌ (16), పీహెచ్‌డీ సీట్లు 2 ఉన్నాయి.
* అహ్మదాబాద్‌ నైపర్‌లో మెడిసినల్‌ కెమిస్ట్రీ (10), ఫార్మాస్యూటిక్స్‌ (15), ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ (10), ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ (14), నేచురల్‌ ప్రొడక్ట్స్‌ (6), బయోటెక్నాలజీ (10), మెడికల్‌ డివైజెస్‌ (10), పీహెచ్‌డీ సీట్లు 2 ఉన్నాయి.
* హైదరాబాద్‌ నైపర్‌లో మెడిసినల్‌ కెమిస్ట్రీ (30), ఫార్మాస్యూటిక్స్‌ (15), ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ (15), ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ (15), రెగ్యులేటరీ టాక్సికాలజీ (8), ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ)- 8, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ (30), పీహెచ్‌డీ సీట్లు 4 ఉన్నాయి.
* మొహాలీ నైపర్‌లో మెడిసినల్‌ కెమిస్ట్రీ (32), ఫార్మాస్యూటిక్స్‌ (18), ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ (23), ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ (8), నేచురల్‌ ప్రొడక్ట్స్‌ (12), ట్రెడిషనల్‌ మెడిసిన్‌ (4), బయోటెక్నాలజీ (32),, ఫార్మసీ ప్రాక్టీస్‌ (8), క్లినికల్‌ రిసర్చ్‌ (8), ఫార్మకో ఇన్‌ఫర్మాటిక్స్‌ (16), రెగ్యులేటరీ టాక్సికాలజీ (8), ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌)- 6, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ)- 16, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ)-8, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ (43), పీహెచ్‌డీ సీట్లు 7 ఉన్నాయి.
మిగతా వివరాలు- రిజర్వేషన్లకు సంబంధించి ఎన్ని సీట్లను కేటాయించారో నైపర్‌-మొహాలీ వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చు.


Back..

Posted on 17-07-2017