Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నైపర్‌లో సీటు... భవితకు చోటు!

ఫార్మసీలో నాణ్యమైన పీజీ విద్య, ప్రమాణాలతో కూడిన పరిశోధన అందించే నైపర్‌-జేఈఈ. నైపర్‌-జేఈఈ అర్హత పొందినవారు ఏ కోర్సును ఏ నైపర్‌లో చేయాలనే విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది!

ఫార్మసీలో ఏ బ్రాంచి కూడా తక్కువ కాదు. ప్రతిదీ దేనికదే సాటి. విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా బ్రాంచి ఎన్నుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అంకుర సంస్థల ఏర్పాటుకు దేనిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అంచనా వేసి తదనుణంగా ఆ బ్రాంచిని ఎంచుకోవాలి.
ఈ సంవత్సరం నైపర్‌-జేఈఈ ఉమ్మడి కౌన్సెలింగ్‌ నైపర్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో జరుగనున్నది. పోటీ తక్కువగా ఉన్నా కోరుకున్న బ్రాంచి, అందుబాటులో ఉన్న నైపర్‌లో సీటు రావటం అంత సులువు కాదు. అందువల్ల విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో ముందుగానే ఒక అంచనాకు రావాలి.
ఏయే నైపర్‌లలో ఏ బ్రాంచిలు ఉన్నాయో, ఎన్ని సీట్లు ఉన్నాయో నైపర్‌ వెబ్‌సైట్లో వివరాలు ఉంచారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి నైపర్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాటి మౌలిక సదుపాయాలు, ప్రాంగణ నియామకాల తీరు, హాస్టలు వసతి మొదలైనవి తెలుసుకోవచ్చు.

నైపర్‌ అందించే పీజీ కోర్సులు
ఎంఎస్‌. (ఫార్మసీ): మెడిసినల్‌ కెమిస్ట్రీ
* నేచురల్‌ ప్రోడక్ట్స్‌
* ట్రెడిషనల్‌ మెడిసిన్‌ ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌
* ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ
* రెగ్యులేటరీ టాక్సికాలజీ
* ఫార్మాస్యూటిక్స్‌
* బయో టెక్నాలజీ
* ఫార్మకో ఇన్‌ఫర్మేటిక్స్‌
* మెడికల్‌ డివైజెస్‌
ఎం.ఫార్మసీ : ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌)
* ఫార్మసీ ప్రాక్టీస్‌
* క్లినికల్‌ రిసర్చ్‌
ఎంటెక్‌ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ
* ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయో టెక్నాలజీ)
ఎంబీఏ (ఫార్మా): ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌

పీహెచ్‌డీ ప్రోగ్రాం
* మెడిసినల్‌ కెమిస్ట్రీ
* నేచురల్‌ ప్రొడక్ట్స్‌
* ఫార్మకో ఇన్‌ఫర్మేటిక్స్‌
* ఫార్మసీ ప్రాక్టీస్‌
* ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌
* ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ
* బయో టెక్నాలజీ
* ఫార్మాస్యూటిక్స్‌
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌(నైపర్‌)లు ఏడు ఉన్నాయి. ఫార్మసీలో 16 శాఖల్లో పీజీ కోర్సులు, 8 శాఖల్లో పీహెచ్‌డీ కోర్సులు వీటిలో అందుబాటులో ఉన్నాయి.

ఉపకార వేతనం
నైపర్‌లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికీ (ఎంబీఏ ఫార్మా, ప్రభుత్వ/ప్రైవేటు స్పాన్సర్డ్‌ విద్యార్థులకు తప్ప) నెలకు రూ. 12,400 ఉపకారవేతనం లభిస్తుంది. పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి రెండేళ్ళూ నెలకు రూ.25,000, తర్వాత మూడు సంవత్సరాలూ నెలకు రూ.28,000 ఫెలోషిప్‌తో పాటు ఇంటి అద్దె కూడా లభిస్తుంది. ఎంబీఏ ఫార్మాలో ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థులకు నైపర్‌ నెలకు రూ.12,400 ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌ రెండో సెమిస్టర్‌ నుంచి లభిస్తుంది.

ప్రాంగణ నియామకాలు
నైపర్‌లకు మెంటర్‌ ఇన్‌స్టిట్యూట్లు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాయి. వీటికీ, నైపర్‌లకూ దేశ విదేశీ విశ్వవిద్యాలయాలతోనూ, ప్రముఖ పరిశోధన సంస్థలతోనూ, ఫార్మాస్యూటికల్‌ సంస్థలతోనూ ఒప్పందాలూ, సత్సంబంధాలూ ఉండటం వల్ల ఎక్కువమంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలు పొందగలుగుతున్నారు. ఔత్సాహికులైన విద్యార్థులు అంకుర సంస్థలు ఏర్పాటు చేయడానికి కూడా నైపర్‌లు కృషి చేస్తున్నాయి.

నైపర్లు... మెంటర్‌ ఇన్‌స్టిట్యూట్లు
1. మొహాలీ, పంజాబ్‌ www.niper.ac.in
2. అహ్మదాబాద్‌, గుజరాత్‌ www.niperahm.ac.in
మెంటర్‌: బీవీ పాటిల్‌ ఫార్మా. ఎడ్యు. అండ్‌ రిసర్చ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, అహ్మదాబాద్‌
3. గువహటి, అసోం www.niperguwahati.ac.in
మెంటర్‌: గువహటి మెడికల్‌ కాలేజ్‌&హాస్పిటల్‌
4. హాజీపూర్‌, బిహార్‌ www.niperhajipur.ac.in
మెంటర్‌: రాజేంద్ర మెమోరియల్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పట్నా.
5. హైదరాబాద్‌, తెలంగాణ www.niperhyd.ac.in
మెంటర్‌: సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌
6. కోల్‌కత, పశ్చిమ్‌ బంగ
www.niperkolkata.edu.in
మెంటర్‌: సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ, కోల్‌కత
7. రాయ్‌బరేలి, ఉత్తరప్రదేశ్‌
www.niperraebareli.edu.in
మెంటర్‌: సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ డ్రగ్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, లఖ్‌నవూ
నైపర్‌లకు ప్రముఖ పరిశోధన సంస్థలు, వైద్య కళాశాలలు మెంటర్లుగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల అతి తక్కువ కాలంలో నైపర్‌లు మంచి పేరు సంపాదించగలిగాయి.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు
ఎంబీఏ (ఫార్మా) గ్రూప్‌ డిస్కషన్లు: 2016 జులై 13, 14
కౌన్సెలింగ్‌: జులై 15, 2016
ఎంఎస్‌ (ఫార్మసీ), ఎం. ఫార్మసీ, ఎంటెక్‌ (ఫార్మసీ) కౌన్సెలింగ్‌: జులై 20-22, 2016
పీహెచ్‌డీ ఇంటర్వ్యూ: జులై 25-26, 2016

Back..

Posted on 12-07-2016