Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నైపర్‌లో నెగ్గేదెలా?

ప్రతిష్ఠాత్మకమైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) ల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించిన నైపర్‌-జేఈఈ పరీక్ష వచ్చే నెలలో జరగబోతోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు మే 15. అర్హత సాధించినవారు నైపర్‌లలో రెండేళ్ల ఫార్మసీ పీజీ కోర్సులు, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో చేరవచ్చు. ఈ ఆన్‌లైన్‌ పరీక్ష సన్నద్ధత వివరాలను తెలుసుకుందామా!
మనదేశంలోని ఏడు నైపర్లు ఫార్మసీలో రెండేళ్ల పీజీ కోర్సులు, ఐదేళ్ల పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
ఎంఎస్‌ (ఫార్మసీ): మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ట్రెడిషనల్‌ మెడిసిన్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, బయోటెక్నాలజీ, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్‌, మెడికల్‌ డివైజెస్‌
ఎం.ఫార్మసీ: ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌), ఫార్మసీ ప్రాక్టీస్‌, క్లినికల్‌ రిసెర్చ్‌
ఎంటెక్‌ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ), ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ)
ఎంబీఏ (ఫార్మా): ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌
పీహెచ్‌డీ ప్రోగ్రాం: మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్‌, ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటిక్స్‌
ఉపకార వేతనం
నైపర్‌ ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికీ నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్‌ (ఎంబీఏ (ఫార్మా) ప్రభుత్వ/ ప్రైవేటు స్పాన్సర్డ్‌ విద్యార్థులకు తప్ప) లభిస్తుంది. పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.25000 ఫెలోషిప్‌, తరువాత మూడేళ్లు నెలకు రూ.28000 ఫెలోషిప్‌ లభిస్తుంది. ఎంబీఏ ఫార్మాలో ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థులకు నైపర్‌ నెలకు రూ.12,400 ఉపకారవేతనం అందిస్తుంది.
25 కేంద్రాల్లో...
నైపర్‌ జేఈఈ 2018 కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష. జూన్‌ 10న దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో దీన్ని నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడల్లో పరీక్షకేంద్రాలున్నాయి. పీహెచ్‌డీ కోర్సు పరీక్ష హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు.
పీజీ కోర్సులన్నింటికీ కలిపి ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌తోసహా ఒకే పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం 200 ప్రశ్నలతో ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉండే పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నలు బీఫార్మసీ, ఎంఎస్‌సీ స్థాయిలో ఉంటాయి. కొన్ని ప్రశ్నలు జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి ఉంటాయి.
పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష కూడా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే ఉంటుంది. 170 ప్రశ్నలుంటాయి. మార్కులు 85. కెమికల్‌, బయోలాజికల్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. వ్యవధి- రెండు గంటలు. ప్రతి విభాగంలో జనరల్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి.
కోర్‌ సబ్జెక్టులే ముఖ్యం
నైపర్‌ జేఈఈలో రాణించాలంటే కోర్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన, పట్టు అవసరం. విద్యార్థులు ముఖ్యంగా కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌ విభాగాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ప్రశ్నలకు ఆలోచించి సమాధానాలను ఎంచుకోవాలి. రుణాత్మక మార్కులు (0.25) ఉంటాయి. కాబట్టి సరైన సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు ఎన్నుకునేలా నియంత్రణ అవసరం.
కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీకి సంబంధించి డ్రగ్‌ డిస్కవరీకి చెందిన అంశాలు, స్టీరియో కెమిస్ట్రీ అండ్‌ డ్రగ్‌ యాక్షన్‌, ఎంజైమ్‌ కైనటిక్స్‌ డ్రగ్‌ యాక్షన్‌ అండ్‌ మెటబాలిజం, కెమిస్ట్రీ ఆఫ్‌ ఏడీఎంఈ ఆఫ్‌ డ్రగ్స్‌, నేమ్‌డ్‌ రియాక్షన్స్‌ మొదలైన అంశాలు, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌లో స్పెక్ట్రల్‌ అనాలిసిస్‌, సెపరేషన్‌ విధానాలు, ఫార్మకాలజీలో డ్రగ్‌ రిసిప్టర్స్‌ వాటి మెకానిజం ఆఫ్‌ యాక్షన్‌, స్ట్రక్చర్‌ యాక్టివిటీ సంబంధాలు, ఫాథో జెనిసిస్‌, ప్రీ క్లినికల్‌ అండ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై అవగాహన, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ముఖ్యంగా ఎంజైమ్స్‌, వాటి విధులు, మందుల తయారీలో వాటి పాత్ర, ప్రొటీన్స్‌, ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ టెక్నాలజీలపై అవగాహన ఉండాలి.
నైపర్‌-మొహాలీ, హైదరాబాద్‌ల్లో ఉన్న ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి జేఈఈ మార్కులతోపాటు మలి దశలో గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. వీటికి 15% వెయిటేజీ మార్కులుంటాయి.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌ టికెట్లు: జూన్‌ 1, 2018
జేఈఈ ఆన్‌లైన్‌ పరీక్ష: జూన్‌ 10, 2018
ఫలితాలు: జూన్‌ 18, 2018
www.niperahm.ac.in

ఎం.వి.రావు, CSIR-IICT


Back..

Posted on 08-05-2018