Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పంచదార సంస్థలో తియ్యని కోర్సులు

* ఎన్‌ఎస్‌ఐ ప్రకటన విడుదల

పంచదార సంస్థలో చదివితే ఉద్యోగాల తీపి కబురు వెంటనే అందుతోంది. అందుకే కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తున్న పలు రకాల కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. చక్కెర, ఆల్కహాలు సంబంధిత పరిశ్రమల్లో పనిచేయాలనుకునే వాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, ఇంటర్‌, పదోతరగతి అర్హతలతో వీటిలోకి ప్రవేశాలు పొందవచ్చు.

షుగర్‌ టెక్నాలజీలో జాబ్‌ ఓరియెంటెడ్‌ పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి. ఇందులో చేరినవారికి స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్‌ అందుతాయి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.

పీజీ డిప్లొమాలు
షుగర్‌ టెక్నాలజీ: బీఎస్సీ ఎంపీసీ లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి రెండున్నరేళ్లు. 66 సీట్లు ఉన్నాయి.
షుగర్‌ ఇంజినీరింగ్‌: బీటెక్‌ లేదా ఏఎంఐఈలో మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ విభాగాలవారు అర్హులు. ఈ కోర్సును ఏడాదిన్నర వ్యవధితో అందిస్తున్నారు. 33 సీట్లు ఉన్నాయి.
ఇం‌డస్ట్రియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ: బీఎస్సీలో కెమిస్ట్రీ/ అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ ఇం‌డస్ట్రియల్‌ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ బయో కెమికల్‌ ఇంజీనీరింగ్‌ పూర్తిచేయాలి. కోర్సు వ్యవధి 18 నెలలు. సీట్లు 39.
షుగర్‌ కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌: బీఎస్సీ లేదా బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివుండాలి. కోర్సు వ్యవధి ఏడాది. సీట్ల సంఖ్య 20.
ఇం‌డస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌: ఎల‌్రక్టానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎల‌్రక్టికల్‌ తదితర విభాగాల్లో బీటెక్‌ లేదా ఏఎంఐఈ పూర్తిచేసినవారు అర్హులు. ఏడాది వ్యవధితో కోర్సు అందిస్తున్నారు. 17 సీట్లు ఉన్నాయి.
క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌: బీఎస్సీ ఎంపీసీ లేదా బీజడ్‌సీ లేదా బీస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా బీఎస్సీ/బీటెక్‌ బయో టెక్నాలజీ కోర్సుల్లో ఏదైనా చదివుండాలి. కోర్సు వ్యవధి ఏడాది. సీట్ల సంఖ్య 22.

సర్టిఫికెట్‌ కోర్సులు
షుగర్‌ బాయిలింగ్‌: పదో తరగతి ఉత్తీర్ణత. ఈ విభాగంలో అనుభవం ఉండాలి. వ్యవధి 18 నెలలు. 63 సీట్లు ఉన్నాయి.
షుగర్‌ ఇంజినీరింగ్‌: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎల‌్రక్టికల్‌/ ఎల‌్రక్టానిక్స్‌ విభాగాల్లో డిప్లొమా. వ్యవధి ఏడాది. 17 సీట్లు.
క్వాలిటీ కంట్రోల్‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఈ కోర్సును 4 నెలల వ్యవధితో అందిస్తున్నారు. 22 సీట్లు.

ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ విభాగం
షుగర్‌ టెక్నాలజీ/ షుగర్‌ కెమిస్ట్రీ, షుగర్‌ ఇంజినీరింగ్‌, ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ ఇవి ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌ కోర్సులు. వీటిలోకి ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలుంటాయి.
కోర్సులను పూర్తి చేసుకున్నవారికి పంచదార పరిశ్రమలు, అనుబంధ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తుకు అర్హులే. పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులకు జులై 1 నాటికి 38 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవచ్చు. ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ కోర్సులకు యాభై ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. కోర్సును బట్టి ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు ఉంటాయి. ఈ సంస్థలో కోర్సులు పూర్తిచేసుకున్నవారికి దేశంలోని ప్రముఖ పంచదార పరిశ్రమలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లోనూ ఉద్యోగం పొందడానికి వీలుంది.

ఆన్‌ లైన్‌ దరఖాస్తులు: మే 4 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష: జూన్‌ 14న నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు పుణె, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, కాన్పూర్‌, పట్నాల్లో ఉన్నాయి.

వెబ్‌సైట్‌: http://nsi.gov.in/

Back..

Posted on 28-04-2020