Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఓఎన్‌జీసీలో 5655 అప్రెంటీస్ ఖాళీలు

- ప‌ది, ఇంట‌ర్‌, డిగ్రీ, ఐటీఐ చ‌దివిన‌వారికి అవ‌కాశం

భార‌త ప్రభుత్వానికి చెందిన ఆయిల్ అండ్ న్యాచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) అప్రెంటీస్ ఖాళీల భ‌ర్తికి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. కాకినాడ‌, రాజమండ్రిల‌తో స‌హా దేశ‌వ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న 22 కేంద్రాల్లో క‌లుపుకుని మొత్తం 5655 ఖాళీలు ఉన్నాయి. వీటికి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, ఐటీఐ, డిగ్రీ అర్హత‌ల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్యర్థులు సంబంధిత అక‌డ‌మిక్ / ట్రేడ్‌ ప‌రీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నియామ‌కాలు చేప‌డ‌తారు. ఎంపికైన‌వారికి ప్రతి నెలా స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. విలువైన ప‌ని నైపుణ్యాలు మెరుగుప‌ర‌చుకోవ‌డానికి అప్రెంటీస్ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంది. అప్రెంటీస్‌గా ప‌నిచేసిన‌వాళ్లు భ‌విష్యత్తులో సంబంధిత విభాగంలో ఉద్యోగాలు పొంద‌డం, రాణించ‌డం సులువ‌వుతుంది. విలువైన అనుభ‌వంతో కొన్ని ట్రేడ్‌ల్లో స్వయం ఉపాధి పొంద‌డం సులువే. అప్రెంటీస్ అవ‌కాశం ఉన్న విభాగాలు, అందుకు కావాల్సిన అర్హత‌ల వివ‌రాలు చూద్దాం.

విభాగం: అకౌంటెంట్‌
అర్హత‌: కామ‌ర్స్‌, మ్యాథ్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: 14 నెల‌లు

విభాగం: క్యాబిన్ / రూం అటెండెంట్‌
అర్హత‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై 10 + 2 విధానంలో చ‌దివిన లేదా చ‌దువుతున్నవారై ఉండాలి. లేదా క్యాబిన్ / రూం అటెండెంట్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఇంట‌ర్ అర్హత ఉన్నవారికి 12 నెల‌లు. ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉంటే 6 నెల‌లు

విభాగం: క‌ంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్
అర్హత‌: స‌ంబంధిత విభాగంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: 12 నెల‌లు

విభాగం: డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్‌)
అర్హత‌: డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: ఎల‌క్ట్రీషియ‌న్‌
అర్హత‌: ఎల‌క్ట్రీషియ‌న్ విభాగంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌
అర్హత‌: ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్ విభాగంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: ఫిట్టర్‌
అర్హత‌: ఫిట్టర్ ట్రేడ్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌
అర్హత‌: ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ విభాగంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: మెకానిక్ డీజిల్‌
అర్హత‌: మెకానిక్ డీజిల్ విభాగంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: సెక్రటేరియ‌ల్ అసిస్టెంట్‌
అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత లేదా సెక్రటేరియ‌ల్ అసిస్టెంట్ విభాగంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఇంట‌ర్ అర్హత‌తో 15 నెల‌లు. ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉన్నవారికి ఏడాది.

విభాగం: స్టోర్ కీప‌ర్‌
అర్హత‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై 10 + 2 విధానంలో చ‌దివిన లేదా చ‌దువుతున్నవారై ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: రెఫ్రిజిరేష‌న్ అండ్ ఎయిర్ కండీష‌నింగ్ మెకానిక్‌
అర్హత‌: రెఫ్రిజిరేష‌న్ అండ్ ఎయిర్ కండీష‌నింగ్ మెకానిక్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది.

విభాగం: ఆటో మెకానిక్‌
అర్హత‌: ఆటో మెకానిక్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌
అర్హత‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై 10+2 విధానంలో చ‌దివిన‌/ చ‌దువుతున్నవారై ఉండాలి
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: 15 నెల‌లు

విభాగం: హౌస్ కీప‌ర్ (కార్పోరేట్‌)
అర్హత‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై 10+2 విధానంలో చ‌దివిన‌/ చ‌దువుతున్నవారై ఉండాలి
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అండ్ ఎల‌క్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెన‌న్స్‌
అర్హత‌: ఐటీ అండ్ ఈఎస్ఎంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ లేదా ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్‌
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఐటీ అండ్ ఈఎస్ఎం ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉన్నవారికి ఏడాది. ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉన్నవారికి రెండేళ్లు.

విభాగం: లేబొరేట‌రీ అసిస్టెంట్ (కెమిక‌ల్ ప్లాంట్‌)
అర్హత‌: ఫిజిక్స్, కెమిస్ట్రీల‌తో బీఎస్సీ లేదా లేబొరేట‌రీ అసిస్టెంట్‌లో ట్రేడ్ స‌ర్టిఫికెట్‌
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: లైబ్రరీ అసిస్టెంట్‌
అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: మ్యాచినిస్ట్ / ట‌ర్నర్‌
అర్హత‌: మ్యాచినిస్ట్ లేదా ట‌ర్నర్ ట్రేడ్‌లో ఫుల్ టైం రెగ్యుల‌ర్ ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: స‌ర్వేయ‌ర్‌
అర్హత‌: స‌ర్వేయ‌ర్ ట్రేడ్‌లో ఫుల్ టైం రెగ్యుల‌ర్ ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

విభాగం: వెల్డర్ (గ్యాస్ అండ్ ఎల‌క్ట్రిక్‌)
అర్హత‌: వెల్డర్ ట్రేడ్‌లో ఫుల్ టైం రెగ్యుల‌ర్ ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
ఇంట‌ర్న్‌షిప్ వ్యవ‌ధి: ఏడాది

దేశ‌వ్యాప్తంగా కేంద్రాల‌ వారీ ఖాళీల వివ‌రాలు
అగర్తల - 187
అహ్మదాబాద్ - 506
అంకలేశ్వర్ - 486
బొకారో - 47
కాంబే - 115
చెన్నై - 138
డెహ్రాడూన్ - 286
దిల్లీ - 284
గోవా - 28
హజీరా - 181
జోధ్‌పూర్‌ - 49
జొర్హాట్ - 224
కాకినాడ - 104
కరైకాల్ - 285
కోల్‌క‌తా - 78
మెహసానా - 450
ముంబయి - 560
నజీరా - 782
రాజమండ్రి - 385
సిల్చార్ - 80
ఉరాన్ - 120
వడోదర - 280

ఎంపిక విధానం:
* అభ్యర్థి అక‌డ‌మిక్ ప‌రీక్ష / ట్రేడ్ ప‌రీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజ‌ర్వేష‌న్‌ ప్రాతిప‌దిక‌న ఎంపిక‌చేస్తారు. అనంత‌రం మెడిక‌ల్ టెస్టు నిర్వహించి అప్రెంటీస్‌గా తీసుకుంటారు.
* అప్రెంటిస్‌గా ఎంపికైన‌వారికి ప‌నిచేస్తున్న వ్యవ‌ధికి స్టైపెండ్ చెల్లిస్తారు.
* చ‌దువుకున్న కోర్సు లేదా పూర్తిచేసిన ట్రేడ్‌లో జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్యర్థులైతే క‌నీసం 45 శాతం; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 40 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించిన‌వారై ఉండాలి.
* అభ్యర్థుల వ‌య‌సు న‌వంబ‌రు 1, 2017 నాటికి క‌నీసం 18 ఏళ్లు ఉండాలి.
* గ‌తంలో ఎప్పుడైనా అప్రెంటీస్‌షిప్ చేసిన‌వాళ్లు అన‌ర్హులు.
* ఏడాది లేదా అంత‌కంటే ఎక్కువ వ్యవ‌ధితో శిక్షణ పొందిన లేదా ఉద్యోగానుభ‌వం ఉన్నవారు అన‌ర్హులు.
* దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన‌ ధ్రువ‌ప‌త్రాలు జ‌త‌చేసి సంబంధిత కేంద్రానికి పోస్టులో పంపాలి.
* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివరి తేది: 03.11.2017 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు

Website

 

Back..

Posted on 17-10-2017