Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రెండు బ్యాంకు పీవోల‌కు.. సన్నద్ధత ఒకటే!
 
ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌లో 120 ఉద్యోగాలు

-ఎంబీఏ, సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ పూర్తిచేసిన‌వారు అర్హులు

ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్ (ఓబీసీ) 120 స్పెష‌లిస్టు ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఎంబీఏ (ఫైనాన్స్‌), చార్టర్డ్ అకౌంటెంట్‌, ఐసీడ‌బ్ల్యుఏ కోర్సులు పూర్తిచేసిన‌వాళ్లు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అసిస్టెంట్ మేనేజ‌ర్ (ఫైనాన్షియ‌ల్ ఎన‌లిస్ట్) విభాగంలో వంద ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎంబీఏ ఫైనాన్స్ చ‌దువుకున్నవాళ్లు అర్హులు. ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు.

విభాగాల‌వారీ ఖాళీలిలా..
పోస్టు: అసిస్టెంట్ మేనేజ‌ర్ (ఫైనాన్షియ‌ల్ ఎన‌లిస్ట్‌)
ఖాళీలు - 100
అర్హత‌: ఎంబీఏ (ఫైనాన్స్‌)/ సీఏ/ ఐసీడ‌బ్ల్యుఏ/ సీఎఫ్ఎ వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వ‌యోప‌రిమితి: ఏప్రిల్ 1, 2017 నాటికి 21 - 30 ఏళ్లు

పోస్టు: మేనేజ‌ర్ ఎఫ్ఎ ఛార్టర్డ్ అకౌంటెంట్
ఖాళీలు: 18
అర్హత‌: సీఏ కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వ‌యోప‌రిమితి: ఏప్రిల్ 1, 2017 నాటికి 23 - 35 ఏళ్లు

పై రెండింటితోపాటు సీనియ‌ర్ మేనేజ‌ర్ విభాగాల్లో మ‌రో రెండు పోస్టులు ఉన్నాయి. వీటికి సీఏ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు. సంబంధిత విభాగంలో ప‌ని అనుభ‌వం ఉండాలి. ఏప్రిల్ 1, 2017 నాటికి 25- 35 ఏళ్లలోపువారు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

పై అన్ని పోస్టుల‌కు ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఎంపిక విధానం:
వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను అభ్యర్థుల అర్హత‌లు, ప‌ని అనుభ‌వం, అక‌డ‌మిక్ ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి వంద మార్కుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది నియామ‌కాలు చేప‌డ‌తారు. ఒక‌వేళ ఎక్కువ సంఖ్యలో అర్హులు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వహించి అందులో ఎంపికైన‌వారికి ఇంట‌ర్వ్యూలు చేప‌డ‌తారు. ఇలాంటి సంద‌ర్భంలో ప‌రీక్ష‌కు 200, ఇంట‌ర్వ్యూకు 50 మార్కులు కేటాయిస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్షలో అర్హత సాధించ‌డానికి జ‌న‌ర‌ల్ అభ్యర్థులు క‌నీసం 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే 35 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. అర్హత సాధించిన అభ్యర్థుల‌ను ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీల‌కు మూడు రెట్ల సంఖ్యలో ఇంట‌ర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూలోనూ జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 35 శాతం మార్కులు సాధిస్తేనే అర్హుల‌వుతారు. ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

రాత‌ ప‌రీక్షలో...
రీజ‌నింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ అంశాల నుంచి 200 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి 200 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. రీజ‌నింగ్‌లో 40 ప్రశ్నల‌కు 40, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 40 ప్రశ్నల‌కు 25, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 30 ప్రశ్నల‌కు 20, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నల‌కు 40, ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ 50 ప్రశ్నల‌కు 75 మార్కులు కేటాయించారు.

ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు రూ. వంద‌; మిగిలిన అంద‌రికీ రూ.600.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రం: హైద‌రాబాద్‌.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం: ఏప్రిల్ 7, 2017
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: ఏప్రిల్ 26, 2017
వెబ్‌సైట్‌: www.obcindia.co.in

NOTIFICATION

Back..

Posted on 06-04-2017