Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భ‌విష్యత్తుకు భ‌రోసానిచ్చే భౌతిక‌శాస్త్రం!

భ‌విష్యత్తుకి బాట‌లు వేసే కోర్సుల్లో భౌతిక‌శాస్త్రం ఒక‌టి. ఎందుకంటే యంత్రాలు, ప‌నిముట్లు, విద్యుత్‌, అంత‌రిక్షం...ఇలా ఫిజిక్స్ విశ్వవ్యాప్తమైంది. స‌బ్జెక్టు కొంచెం క‌ష్టమైన‌ప్పటికీ అందులో ప‌ట్టుంటే అవ‌కాశాలు సొంతం చేసుకోవ‌డం మాత్రం సులువే. ఈ శాస్త్రానికున్న ప్రత్యేక‌త‌లు, మాన‌వాళి అవ‌స‌రాల దృష్ట్యా దేశంలో ప‌లు సంస్థలు ఫిజిక్స్‌లో ప‌రిశోధ‌న‌ల కోసం ప్రత్యేకంగా వెలిశాయి. భౌతిక‌శాస్త్రంపై ఆస‌క్తి ఉన్నవాళ్లు ఉన్నత విద్య అభ్యసించ‌డం ద్వారా మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా ప‌రిశోధ‌నా సంస్థల్లోనూ రాణించొచ్చు.

ఇంట‌ర్ నుంచే మొద‌లు...
ఫిజిక్స్‌లో ప్రత్యేక అభిరుచి ఉన్న విద్యార్థులు ఇంట‌ర్‌లోనే దాన్ని ఒక స‌బ్జెక్టుగా తీసుకోవాలి. ఆ త‌ర్వాత బీటెక్ ఫిజిక‌ల్ సైన్సెస్‌, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా ఐదేళ్ల బీఎస్ ఎంఎస్ చ‌దువుకోవ‌చ్చు. లేదంటే నాలుగేళ్ల బీఎస్ లేదా మూడేళ్ల బీఎస్సీ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఉమ్మడి ప్రవేశ ప‌రీక్షల ద్వారా ప్రముఖ సంస్థల్లో ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఇంట‌ర్ విద్యార్థులైతే ఐఐటీ-జేఈఈ, డిగ్రీ చ‌దువుతున్నవాళ్లైతే జామ్, పీజీ విద్యార్థులైతే జెస్ట్..ఇలా అర్హత‌ల వారీ ప‌రీక్షలు రాసుకోవ‌చ్చు. ఐఐటీ జేఈఈ ద్వారా ప‌లు ఐఐటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సుల్లో చేరొచ్చు. అలాగే జామ్ ద్వారా ఎమ్మెస్సీ ఫిజిక్స్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ఫిజిక్స్ కోర్సుల్లో ఐఐఎస్సీ, ఐఐటీల్లో ప్రవేశం ల‌భిస్తుంది. జెస్ట్ ద్వారా ప‌రిశోధ‌నా సంస్థలు, ప్రత్యేక విద్యాల‌యాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరొచ్చు.
ఐఐటీ జేఈఈ ద్వారా...
* ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, బెంగ‌ళూరు ఫిజిక్స్‌లో నాలుగేళ్ల బీఎస్ కోర్సు అందిస్తోంది.
* ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, తిరువ‌నంత‌పురం నాలుగేళ్ల బీటెక్ ఫిజిక‌ల్ సైన్స్ కోర్సు అందిస్తోంది.
* ఐఐటీ కాన్పూర్ ఫిజిక్స్‌లో బీఎస్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది.
* ఐఐటీ మ‌ద్రాస్ ఫిజిక్స్‌లో బీఎస్‌, ఎంఎస్ ఐదేళ్ల డ్యూయ‌ల్ డిగ్రీ అందిస్తోంది.
* ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో ఐదేళ్ల ఇంటిగ్రెటెడ్ ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సు బోధిస్తున్నారు.
* ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ మైన్స్ లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ ఫిజిక్స్ కోర్సు అందుబాటులో ఉంది.
* పైన తెలిపిన సంస్థలు, కోర్సుల్లో చేర‌డానికి ఐఐటీ జేఈఈ రాయ‌డం త‌ప్పనిస‌రి.
జామ్ ద్వారా...
ఐఐటీ ఢిల్లీ, గాంధీన‌గ‌ర్‌, గువాహ‌టి, హైద‌రాబాద్‌, ఇండోర్‌, కాన్పూర్‌, ఖ‌ర‌గ్‌పూర్‌, మ‌ద్రాస్‌, రూర్కీ, రోపార్‌ల్లో రెండేళ్ల ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సు నిర్వహిస్తున్నారు. కాన్పూర్ ఐఐటీలో అద‌నంగా ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయ‌ల్ డిగ్రీ కూడా ఉంది. ఐఐఎస్సీ బెంగ‌ళూరు ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో ప్రవేశం క‌ల్పిస్తోంది. ఈ సంస్థల్లో ఎక్క‌డ చేరాల‌న్నా ఐఐటీలు ఏటా నిర్వహించే జాయింట్ అడ్మిష‌న్ టు ఎమ్మెస్సీ (జామ్‌) రాయ‌డం త‌ప్పనిస‌రి.
వెబ్ సైట్‌: https://jam.iitg.ernet.in/
నెస్ట్‌తో...
ఐఐఎస్ఈఆర్ తిరువ‌నంత‌పురం, భోపాల్‌, పుణే, మొహాలీ, కోల్‌క‌తా క్యాంప‌స్‌ల్లో ఐదేళ్ల బీఎస్‌, ఎంఎస్; ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ (డీఏఈ) ఆధ్వర్యంలో నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (నైసర్‌), భువ‌నేశ్వర్‌, యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబై ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఫిజిక‌ల్ సైన్స్ కోర్సు అందిస్తున్నాయి. విశ్వభార‌తి శాంతినికేత‌న్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఫిజిక‌ల్ సైన్స్ కోర్సు బోధిస్తోంది. ఈ సంస్థల్లో చేరిన‌వారికి నెల‌కు రూ.5 వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఫెలోషిప్ అందుతుంది. పై సంస్థల్లో ప్రవేశానికి నేష‌న‌ల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌) రాయాలి.
వెబ్‌సైట్‌: www.nestexam.in
జెస్ట్‌...
ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్‌) ఎంతో ఉప‌యోగం. ఈ ప‌రీక్ష ద్వారా దేశంలో పరిశోధ‌న రంగంలో ప్రసిద్ధి చెందిన సంస్థల్లో ప్రవేశం ల‌భిస్తుంది. వీటిలో చాలా సంస్థలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ (డీఏఈ)కి అనుబంధంగా ఉన్నవే. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రీసెర్చ్‌, ముంబై; ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌, భువ‌నేశ్వర్‌; న‌్యూక్లియ‌ర్ సైన్స్ సెంట‌ర్‌, న్యూఢిల్లీ; ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్‌, బెంగ‌ళూరు; హ‌రీష్ చంద్ర రీసెర్చ్ ల్యాబ‌రేటొరీ, అల‌హాబాద్‌; ఫిజిక‌ల్ రీసెర్చ్ ల్యాబొరేట‌రీ, అహ్మదాబాద్ ఎస్ఎన్‌బోస్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బేసిక్ సైన్సెస్, కోల్‌క‌తా జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ బెంగ‌ళూరు...ఇలా ప‌లు సంస్థల్లో జెస్ట్ ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు.
వెబ్‌సైట్‌: https://www.jest.org.in/
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (ఆన‌ర్స్‌) ఫిజిక్స్ కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.bitsadmission.com
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఫిజిక‌ల్ సైన్స్, రెండేళ్ల ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.uohyd.ernet.in
నిట్ దుర్గాపూర్‌, తిరుచురాప‌ల్లి, సిల్‌చార్‌, అగ‌ర్తల, జైపూర్ ఇలా ప‌లు నిట్లలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది. అయితే ఇవ‌న్నీ ఉమ్మడిగా ప్రవేశం క‌ల్పించ‌డం లేదు. వేటిక‌వే ప్రత్యేకంగా ప్రక‌ట‌న విడుద‌ల‌చేసి అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రా యూనివ‌ర్సిటీ, విశాఖ‌ప‌ట్నం
ఎమ్మెస్సీ- ఫిజిక్స్‌, స్పేస్ ఫిజిక్స్‌, న్యూక్లియ‌ర్ ఫిజిక్స్‌, మెటీరియాల‌జీ, ఫిజిక‌ల్ ఓషియ‌నోగ్రఫీ, జియోఫిజిక్స్ (టెక్‌), మెరైన్ జియోఫిజిక్స్‌
వెబ్‌సైట్‌: http://www.andhrauniversity.edu.in/courses.html
ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ, గుంటూరు
ఎమ్మెస్సీ-ఫిజిక్స్‌
వెబ్‌సైట్‌: http://www.andhrauniversity.edu.in/courses.html
శ్రీవెంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి
ఎమ్మెస్సీ ఫిజిక్స్‌
వెబ్‌సైట్‌: http://www.svuniversity.ac.in/Courses/Courses.aspx
శ్రీకృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ, అనంత‌పురం
ఎమ్మెస్సీ ఫిజిక్స్‌
వెబ్‌సైట్‌: http://www.skuniversity.org/coursesoffered.html
ఉస్మానియా యూనివ‌ర్సిటీ, హైద‌రాబాద్‌
ఎమ్మెస్సీ- ఫిజిక్స్‌, ఆస్ట్రాన‌మీ, ఆస్ట్రోఫిజిక్స్‌, జియోఫిజిక్స్‌
వెబ్‌సైట్‌: http://www.osmania.ac.in/AcademicInfo2012/PG%20Courses%20Offered.pdf
కాక‌తీయ యూనివ‌ర్సిటీ, వ‌రంగ‌ల్‌
ఎమ్మెస్సీ ఫిజిక్స్‌
వెబ్‌సైట్: http://kakatiya.ac.in/courses
కెరీర్‌...
ఫిజిక్స్‌లో పీజీ పూర్తిచేసిన‌వారు నెట్ జేఆర్ఎఫ్ ద్వారా పీహెచ్‌డీ చేసుకోవ‌చ్చు. ఈ స‌మ‌యంలో మొద‌టి రెండేళ్లు నెల‌కు రూ.25,000 చొప్పున త‌ర్వాత రెండేళ్లు నెల‌కు రూ.28,000 చొప్పున స్టైపెండ్‌గా చెల్లిస్తారు. నెట్‌లో అర్హత సాధించిన‌వారు యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, డిగ్రీ క‌ళాశాల‌ల్లో లెక్చర‌ర్ పోస్టుల‌కు పోటీ ప‌డొచ్చు. బోధ‌న‌, ప‌రిశోధ‌నా రంగాల్లో రాణించాల‌నుకునేవారు నెట్ తో ప్రయోజ‌నం పొందొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ గ్రూప్‌లోనే చేరుతున్నారు. కాబ‌ట్టి ప్రభుత్వ, ప్రైవేటు క‌ళాశాల‌ల్లో ఫిజిక్స్ లెక్చర‌ర్‌గా అవ‌కాశాలు మెరుగుప‌ర్చుకోవ‌చ్చు. ఇంజినీరింగ్ ప్రవేశ ప‌రీక్షలైన ఐఐటీ జేఈఈ, ఎంసెట్‌ల‌కూ ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఈ ప‌రీక్షల‌కు ఫిజిక్స్ కోచ్‌గా రాణించ‌వ‌చ్చు. అలాగే ఇంజినీరింగ్ ప్రథ‌మ సంవ‌త్సరంలో ఏ బ్రాంచ్‌లో చేరిన‌ప్పటికీ ఫిజిక్స్ త‌ప్పనిస‌రి స‌బ్జెక్టు. కాబ‌ట్టి అక్కడ కూడా అవకాశాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. స‌బ్జెక్టుపై ప‌ట్టుంటే ప‌లు ప‌రిశోధ‌నా సంస్థల్లో సైంటిస్ట్‌గా ఉన్నత అవ‌కాశాల‌ను చేజెక్కించుకోవ‌చ్చు.