Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 610 అసిస్టెంట్ పోస్టులు

రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* అసిస్టెంట్‌: 610 పోస్టులు
శాఖల వారీగా ఖాళీలు: హైద‌రాబాద్‌-31, అహ్మదాబాద్‌-30, బెంగ‌ళూరు-35, భోపాల్‌-40, భువ‌నేశ్వర్‌-20, చండీగ‌ఢ్‌-38, చెన్నై-25, గువాహ‌టి-27, జైపూర్‌-20, జ‌మ్మూ-10, కాన్పూర్ & ల‌క్నో- 52, కోల్‌క‌తా-35, ముంబ‌యి-150, నాగ్‌పూర్‌-20, న్యూదిల్లీ-25, పాట్నా-22, తిరువ‌నంత‌పురం & కోచి- 30.
విద్యార్హత‌: 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు.
వ‌య‌సు: 08.11.2016 నాటికి 20-28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. 08.11.1988 - 07.11.1996 మ‌ధ్య పుట్టి ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్‌ ప‌రీక్షలు; ఇంట‌ర్వ్యూ ఆధారంగా. 100 మార్కుల‌కు ప్రిలిమిన‌రీ ప‌రీక్ష, 200 మార్కుల‌కు మెయిన్ ప‌రీక్ష, 35 మార్కుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్షల్లో ఇంగ్లిష్ స‌బ్జెక్ట్ మిన‌హా మిగ‌తా స‌బ్జెక్టుల‌న్నీ హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో ఉంటాయి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.11.2016
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 28.11.2016
ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: డిసెంబ‌రు 23, 24 తేదీల్లో.
ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది: 2017 జ‌న‌వ‌రి నెల‌లో.

నోటిఫికేష‌న్‌

ఆన్‌లైన్ అప్లికేష‌న్

Back..

Posted on 07-11-2016