Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సృజ‌నాత్మక‌ కోర్సుల‌కు చిరునామా...ఆర్‌కేయూ

- ప‌నిచేస్తూ నేర్చుకునేలా త‌ర్ఫీదు
-అనుభ‌వ‌జ్ఞుల‌తో ఆర్ఎఫ్‌సీలో బోధ‌న‌


బుల్లితెర‌, వెండితెర‌పై మెర‌వాల‌నుకునేవాళ్లెంద‌రో. మీడియా రంగంలో త‌మ‌దైన ముద్ర వేయాల‌ని క‌ల‌లు క‌నే యువ‌త సంఖ్య త‌క్కువేం కాదు. అయితే ఇలాంటి అవ‌కాశాలు సొంతం చేసుకోవడానికి కొన్ని అంశాల్లో ప్రత్యేక‌ ప‌రిజ్ఞానం త‌ప్పనిస‌రి. యాక్టింగ్.. యానిమేష‌న్‌.. సినిమాటోగ్రఫీ...ఇలా ప‌లు విభాగాల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్లు మీడియా రంగంలో రాణించ‌వ‌చ్చు. వీటికోసం ఎక్కడ శిక్షణ తీసుకోవాల‌నే ప్రశ్న రావ‌డం సహ‌జ‌మే. ఈ విష‌యంలో ఆశావ‌హుల‌కు వేదిక‌గా నిలుస్తోంది ... రామోజీ క్రియాన్ యూనివ‌ర్స్ (ఆర్‌కేయూ)

ప్రత్యేక‌త‌లేమిటంటే...
విఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ(ఆర్ఎఫ్‌సీ)లో ఆర్‌కేయూ ఏర్పాటు చేశారు. ఇందులో 40 ర‌కాల పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సు వ్యవ‌ధి ఏడాది. ఇందులో తొలి ప‌ది నెల‌లు త‌ర‌గ‌తి గ‌ది శిక్షణకు కేటాయించారు. మిగిలిన రెండు నెల‌లు ఇంట‌ర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అయితే కోర్సు పూర్తయిన త‌ర్వాత అవ‌కాశాల‌మాటేంట‌నే ప్రశ్న రావ‌డం స‌హ‌జమే. ఈ విష‌యంలో ఆర్‌కేయూ భ‌రోసా ఇస్తోంది. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసిన‌వాళ్లకు ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ క‌ల్పిస్తామ‌ని చెప్పుతోంది. కాబ‌ట్టి ఆస‌క్తి ఉన్నవాళ్లు మ‌రో సందేహం లేకుండా న‌చ్చిన కోర్సులో చేరి సృజ‌న, సామ‌ర్థ్యాల‌కు మెరుగులు దిద్దుకోవ‌చ్చు. ఆయా విభాగాల్లో విశేష అనుభ‌వం, అవ‌గాహ‌న ఉన్న 25 మంది సుశిక్షితులైన‌ బోధ‌కులు ఆర్‌కేయూ ప్రత్యేక‌త‌గా చెప్పుకోవ‌చ్చు. వీరితోపాటు గెస్ట్ ఫ్యాక‌ల్టీలు కూడా ఉన్నారు.

ఎవ‌రు అర్హులంటే...
పీజీ డిప్లొమా కోర్సుల‌కు 10+2+3 విధానంలో ఏ కోర్సు చ‌దివిన‌వారైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌ర‌గ‌తులు ఆగ‌స్టు నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. కోర్సులో భాగంగా మే 2018 వ‌ర‌కు త‌ర‌గ‌తి గ‌ది శిక్షణ ఉంటుంది. జూన్‌, జులై నెల‌ల్లో ఇంట‌ర్న్‌షిప్ చేయాలి.

ఫీజులు, వ‌స‌తి..
విద్యార్థులు ఎంచుకున్న కోర్సు బ‌ట్టి రూ.2.5 ల‌క్షల నుంచి రూ.4 ల‌క్షల వ‌ర‌కు ఫీజుతో వివిధ పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. కోర్సులో చేరిన‌వారికి ఆర్ఎఫ్‌సీలోనే వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పిస్తారు. ఇందుకోసం నెల‌కు రూ.16,000 చొప్పున వ‌సూలు చేస్తారు. ఇద్దరికి ఒక గ‌ది ఎటాచ్డ్ బాత్‌రూం, ఏసీ, టీవీ, వైఫై సౌక‌ర్యాలు ఉంటాయి. అల్పాహారం, భోజ‌నం అందిస్తారు.

ప్రస్తుతం పీజీ డిప్లొమా, స‌ర్టిఫికెట్‌ కోర్సులే నిర్వహిస్తోన్నప్పటికీ అతి త్వర‌లో బ్యాచిల‌ర్‌, మాస్టర్‌, మేనేజ్‌మెంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఫ్యాక‌ల్టీ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు కూడా ప్రారంభిస్తామ‌ని ఆర్‌కేయూ ప్రక‌టించింది.

నోటిఫికేష‌న్‌
వెబ్‌సైట్‌: http://rku.net.in/


Back..

Posted on 03-08-2017