Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
SAP నైపుణ్యాలతో మేలెంతో!

సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంకాం వంటి కోర్సులు పూర్తిచేసుకున్న / చదువుతున్న నేటితరంవారు SAPలో ఫైనాన్స్‌ (FI), కంట్రోలింగ్‌ (CO) మాడ్యూళ్లలో నైపుణ్యం సంపాదిస్తే మంచి ఉద్యోగావకాశాలున్నాయి. ఆ నైపుణ్యం సంపాదించడానికి ఎస్‌ఏపీ వారి సర్టిఫికేషన్‌ పరీక్షలో నెగ్గాల్సివుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా 80% పైగా ఫార్చ్యూన్‌ 500 సంస్థలు SAPని వాడుతున్నాయి. ప్రతి వ్యాపార విభాగానికీ SAPలో మాడ్యూళ్లు ఉన్నాయి.
SAP అంటే- సిస్టమ్స్‌, అప్లికేషన్స్‌ అండ్‌ ప్రాడక్ట్స్‌ ఇన్‌ డేటా ప్రాసెసింగ్‌. ఇది ఒక వ్యాపార రంగ సాఫ్ట్‌వేర్‌. ప్రతి వ్యాపార లావాదేవీలు దీనిలో నమోదు చేసుకోవచ్చు. వ్యాపార లావాదేవీల్లో సంక్లిష్టమైనవాటికి కూడా సరైన పరిష్కారం చూపించగల సత్తా ఉన్న సాఫ్ట్‌వేర్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలోని ప్రతి విభాగానికి SAPలో ఒక మాడ్యూల్‌ ఉంది. ఉదాహరణకు..

మాడ్యూల్‌ పేరు
1. ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ (ఎఫ్‌ఐ)
2. కంట్రోలింగ్‌ (సీఓ)
3. మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఎం)
4. సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఎస్‌డీ)
5. ప్రొడక్షన్‌ ప్లానింగ్‌ (పీపీ)
6. హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

ఉపయోగాలు
* ఎస్‌ఏపీ ఒక ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) అయి ఉండడం వల్ల వ్యాపార లావాదేవీల ఇంటిగ్రేషన్‌, ఆటోమేషన్‌లకు అవకాశం ఇస్తుంది.
* ప్రతి బిజినెస్‌ సినారియోకు ఒక పరిష్కారం లభిస్తుంది.
* డేటా డూప్లికేషన్‌, పునరుక్తులూ లేకుండా చేస్తుంది.
* రియల్‌టైంలో విషయాలను, అంకెలను తెలుసుకోవచ్చు.
* సాఫ్ట్‌వేర్‌ వాడడానికి సులువుగా ఉంటుంది.
* ఎంత పెద్ద డేటా అయినా ప్రాసెస్‌ చేయగలదు.

ఎస్‌ఏపీ ఎఫ్‌1లోని అంశాలు (సబ్‌ మాడ్యూళ్లు)
* GL- జనరల్‌ లెడ్జర్‌
* AP- అకౌంట్స్‌ పేయబుల్‌
* AR- అకౌంట్స్‌ రిసీవబుల్‌
* BL- బ్యాంక్‌ అకౌంటింగ్‌
* AA- అసెట్‌ అకౌంటింగ్‌

ఎస్‌ఏపీ సీఓలోని అంశాలు (సబ్‌ మాడ్యూళ్లు)
* CEA-కాస్ట్‌ ఎలిమెంట్‌ అకౌంటింగ్‌
* CCA-కాస్ట్‌ సెంటర్‌ అకౌంటింగ్‌
* IO-ఇంటర్నల్‌ ఆర్డర్స్‌
* ABC-ఆక్టివిటీ బేస్‌డ్‌ కాస్టింగ్‌
* PC-ప్రాడక్ట్‌ కాస్ట్‌ కంట్రోలింగ్‌
* PA-ప్రాఫిటబిలిటీ అనాలిసిస్‌
* PCA-ప్రాఫిట్‌ సెంటర్‌ అకౌంటింగ్‌

సర్టిఫికేషన్‌ ఉపయోగాలు
* కొత్తగా SAP నేర్చుకుంటున్నవారు సులువుగా ఉద్యోగం సంపాదించవచ్చు.
* ఎస్‌ఏపీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నవారికి వారి క్లయింట్ల దగ్గర, వారి సంస్థలో వృత్తి నిపుణుడిగా గుర్తింపు, గౌరవం పెరుగుతుంది.
* ఫైనాన్స్‌ విభాగాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగంలో పనిచేస్తున్నవారికి సర్టిఫికేషన్‌ పూర్తిచేస్తే రోజువారీ కార్యకలాపాలపై వారికి పట్టు పెరుగుతుంది.
* సర్టిఫికేషన్‌ పూర్తిచేసినవారికి service.sap.com యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను అందజేస్తారు. దీని వల్ల ఎంతో విలువైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. నేరుగా ఎస్‌ఏపీతో సంప్రదించే అవకాశం ఉంటుంది.

కొత్తగా..
SAP సరికొత్త విప్లవానికి నాందిగా ఎస్‌ఏపీ ఎస్‌/4 హెచ్‌ఏఎన్‌ఏ ఫైనాన్స్‌ను చెప్పవచ్చు. దీనిని క్లౌడ్‌ ద్వారా కూడా నిర్వర్తించవచ్చు. ఫైనాన్స్‌ రంగ నిపుణులకు సులువుగా పరిష్కార మార్గాలు వెంటనే అందించగల సామర్థ్యం దీనికి ఉంది. వ్యాపార రంగంలో దీని ప్రాచుర్యం ఇపుడిపుడే పెరుగుతోంది.

అవకాశాలేమేం ఉంటాయి?
ఎస్‌ఏపీ నేర్చుకున్నవారికి ఉద్యోగావకాశాలు బాగుంటాయి. వీరు రెండు రకాల పాత్రలు నిర్వహిస్తారు.
ఎ) ఎస్‌ఏపీ ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌
ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ను సంస్థల్లో అమలు చేయడానికి కన్సల్టెంట్లుగా పనిచేయవచ్చు.
ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ అమలైన సంస్థల్లో రోజువారీ సమస్యలను పరిష్కరించవచ్చు.
బి) ఎస్‌ఏపీ యూజర్‌
వ్యాపార రోజువారీ కార్యకలాపాలు నమోదు చేసుకోవడానికీ, ఫైనాన్స్‌ విభాగాల్లో సూపర్‌ యూజర్‌గా కూడా విధులు నిర్వహించవచ్చు.

చివరగా...
ఎస్‌ఏపీ ఎఫ్‌ఐ, సీఓ వంటి మాడ్యూళ్లలో పూర్తిస్థాయి నైపుణ్యం సంపాదించడం కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. ఎస్‌ఏపీలో నైపుణ్యం సముద్రం లాంటిది. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అనుభవం సంపాదించే కొద్దీ ఇతర మాడ్యూళ్లపై కూడా అవగాహన పెరుగుతుంది. వృత్తి నిపుణులుగా బాగా రాణించవచ్చు. ఆవిధంగా కెరియర్‌లో ఎదగాలంటే సర్టిఫికేషన్‌ చేస్తే ఎంతో ఉపయోగకరం. ఇలాంటి నైపుణ్యాల సాధనలో అనుకూల వైఖరి, నేర్చుకోవాలి అన్న తపన ఎంతో ముఖ్యం. అప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి వీలవుతుంది.


Back..

Posted on 03-10-2016