Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సేవలు అందించేందుకూ కోర్సులు!

భారతదేశంలో దాదాపు రెండు శాతం మంది ఏదో ఒక వైకల్యంతో బాధ పడుతున్నారని ఒక అంచనా. వీరికి వైద్యంతోపాటు ప్రత్యేక సేవలూ అవసరమవుతాయి. ఇందుకోసం నాణ్యమైన మానవ వనరులు కావాలి. వాటిని సమకూర్చడానికి కొన్ని సంస్థలను నెలకొల్పారు. వాటిలో నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటార్‌ డిజెబిలిటీస్‌ (ఎన్‌ఐఎల్‌డీ) ఒకటి. ఇందులో ఆర్థోపెడిక్‌ సేవలు లక్ష్యంగా పలు కోర్సులను రూపొందించారు. ఈ కోర్సుల్లోకి ప్రవేశాలను ఉమ్మడి పరీక్ష ద్వారా కల్పిస్తారు.

వైద్యరంగంలో వైద్యులతోపాటు ఇతర మెడికల్‌ కోర్సులు చదివినవారికీ డిమాండ్‌ ఉంటుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగించడం, త్వరగా కోలుకునేలా చేయడం, ప్రమాద బారిన పడినవారిని సాధారణ స్థితికి తీసుకురావడం... ఇవన్నీ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ లాంటివాటితో సాధ్యం. అందుకే ఈ అంశాల్లో నిపుణులను తయారుచేయడానికి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేశారు. ఇవి కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటిల్లో బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఇవీ కోర్సులు
* బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీవో)
* బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)
* బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీవోటీ)
అర్హత: బీపీవో, బీవోటీ, బీపీటీ కోర్సులకు ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. జనరల్‌ అభ్యర్థులైతే కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మార్కుల శాతంలో సడలింపులు వర్తిస్తాయి.
వయసు: జనవరి 1, 1998 - డిసెంబరు 31, 2001 మధ్య జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్ల సడలింపు ఉంది.
వ్యవధి: ప్రతి కోర్సు వ్యవధీ నాలుగేళ్లు. అదనంగా మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. పునరావాస కేంద్రాలు, ఆసుపత్రులు, ఎన్జీవోలు మొదలైన చోట్ల అవకాశాలు ఉంటాయి. సొంతంగానూ ఉపాధి పొందవచ్చు.
పరీక్ష తీరు
పరీక్ష వ్యవధి 2 గంటలు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఇస్తారు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. ఇందులో పార్ట్‌-ఎలో జనరల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు వస్తాయి. వీటికి పది మార్కులు. పార్ట్‌-బిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ బయాలజీ లేదా మ్యాథ్స్‌ ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. మొత్తం వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 మిగిలిన అందరికీ రూ.750.
ఆన్‌ లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 25
పరీక్ష తేదీ: జూన్‌ 17
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం సికింద్రాబాద్‌లో ఉంది.
వెబ్‌సైట్‌: http://niohkol.nic.in
ప్రవేశం కల్పించే సంస్థలు
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటివ్‌ డిజెబిలిటీస్‌ - కోల్‌కతా
* స్వామీ వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - కటక్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ - చెన్నై

Back..

Posted on 23-05-2018