Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సర్కారీ ఉద్యోగులకు ప్రత్యేక ఎంబీఏ

* దేశంలోనే తొలిసారిగా విశాఖ ఐఐఎంలో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలను అత్యంత వేగంగా, మరింత పారదర్శకంగా అందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులకు... నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన సముపార్జన ఎంతో అవసరం. వారికి అత్యున్నత స్థాయి డిజిటల్, ఎలక్ట్రానిక్ విధానాలపై అవగాహన పెంచేందుకు, శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో కోర్సులను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక ఎంబీఏ (డిజిటల్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్-డీజీఎం)లో భాగంగా వీటిని నిర్వహించబోతున్నారు.

ఎన్నాళ్ల పాటు
కోర్సు వ్యవధి రెండేళ్లు. ఈ కాలంలో మొత్తం 20 రోజులు (ఒక్కో విడతలో 5 రోజులచొప్పున 4 సార్లు) విశాఖ ఐఐఎం క్యాంపస్కు రావాల్సి ఉంటుంది. రెండు వారాలపాటు విదేశీ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో క్షేత్ర పర్యటనలు ఉంటాయి. మేనేజ్మెంట్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తారు. మిగిలిన కార్యక్రమాలను ఆన్లైన్లో నిర్వహించేలా కోర్సును రూపొందించారు.

ఎంపిక పరీక్ష ఆన్లైన్లో...
ఆసక్తిగల వారు కోర్సులో చేరేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్ఛు త్వరలో అభ్యర్థుల ఎంపిక పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. పూర్తి వివరాలను విశాఖపట్నం ఐఐఎం వెబ్సైట్లో పొందుపరిచారు.

విశాఖలో పనిచేసే వారికి..
విశాఖపట్నంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మరో ఎంబీఏ కోర్సును ప్రారంభించబోతున్నారు. వారాంతాల్లో శిక్షణ ఉంటుంది. మూడేళ్ల ఉద్యోగ అనుభవం కలవారు అర్హులు. క్యాట్, జీమ్యాట్ తదితరాల స్కోరు ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు రాయని వారి కోసం వచ్చే సెప్టెంబరు 8న ఒక ప్రవేశపరీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో ఎంపికైన 30 మందికి సీట్లు కేటాయిస్తారు. కోర్సు ఫీజు రూ.11.95 లక్షలు.

ఇదీ అర్హత
కోర్సు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులే అర్హులు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం ఐదేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి.

ఎంతమందికి... రుసుములెంత?
బ్యాచ్కు 40 మంది చొప్పున అవకాశం కల్పిస్తారు. కోర్సు ఫీజు రూ.16.50 లక్షలు. ఎంపికైన వారిలో తొలి 20 మందికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పూర్తి ఫీజును చెల్లిస్తుంది. మిగిలిన 20 మందికి సంబంధించిన ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విభాగాలు చెల్లించుకోవచ్ఛు

అరుదైన అవకాశం
ప్రభుత్వ ఉద్యోగుల ఎంబీఏ(డీజీఎం) కోర్సు నిర్వహణ బాధ్యతను విశాఖ ఐఐఎంకు ఇవ్వడం గొప్ప అవకాశం. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్చైన్ సాంకేతికత, వర్చువల్ రియాలిటీ తదితర ఎన్నో పరిజ్ఞానాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మెరుగ్గా అందించడంపై సమగ్ర తర్ఫీదు ఇస్తాం.

Back..

Posted on 03-09-2019