Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రత్యేక కోర్సుల్లోకి ప్రవేశ పరీక్ష

చెవిటి, మూగ, అంధత్వం ఉన్న దివ్యాంగులకూ, మానసిక వికాసం సరిగా లేని పిల్లలకు ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటిని గుర్తించి తగిన మద్దతు ఇస్తే వారూ చదువుల్లో రాణించగలుగుతారు. అయితే ఆ దివ్యాంగులకు సేవలు, బోధన చేసేవారికి కొన్ని నైపుణ్యాలు ఉండాలి. వాటిని పొందాలంటే వారు కొన్ని కోర్సులు చేయాలి. ఆ కోర్సుల్లో చేరడానికి జాతీయస్థాయిలో ఒక ఉమ్మడి పరీక్ష ఉంది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి పలు ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

దివ్యాంగులకు ప్రత్యేకంగా బోధన, సేవలు అందించడానికి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని పరిధిలో దేశవ్యాప్తంగా 450 సంస్థలు ఉన్నాయి. వీటిలో ఏడాది వ్యవధితో సర్టిఫికెట్ కోర్సులు, రెండేళ్ల డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. దాదాపు 17,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సులకు పోటీ పడవచ్చు. డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సహా పలు కోర్సుల్లో చేరవచ్చు. కోర్సులు పూర్తి చేసినవారు జాతీయ సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలు, ఎన్జీవోలు మొదలైనవాటిలో ఉద్యోగాలు పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చాలా సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం...
ఇవీ కోర్సులు
డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ్ల్శ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపయిరిమెంట్) ్ల్శ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్ రిటార్డేషన్) ్ల్శ డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ / సెరిబ్రల్ పాల్సీ / డెఫ్ బ్లైండ్/ హియరింగ్ ఇంపయిరిమెంట్ / మల్టిపుల్ డిజెబిలిటీస్ / మెంటల్ రిటార్డేషన్/ విజువల్ ఇంపయిరిమెంట్ / ్ల్శ డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపయిర్ అండ్ ఇయర్ మౌల్డ్ టెక్నాలజీ ్ల్శ డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ ్ల్శ డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ ్ల్శ డిప్లొమా ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ ్ల్శ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ ్ల్శ డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ (మెంటల్ రిటార్డేషన్) ్ల్శ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ (విజువల్ ఇంపయిరిమెంట్)
పరీక్ష ఇలా...
వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. అన్ని ప్రశ్నలూ ఆబ్జెక్టివ్ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత
ఆన్‌లైన్ దరఖాస్తులు: జూన్ 20 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు
దరఖాస్తు ఫీజు: రూ. 500
అడ్మిట్ కార్డులు: జూన్ 25 నుంచి లభిస్తాయి.
పరీక్ష తేదీ: జూన్ 30
ఫలితాలు: జులై 5న ప్రకటిస్తారు.
www.rehabcouncil.nic.in

Back..

Posted on 19-06-2018