Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దివ్యమైన కెరియర్‌కు దారులివిగో!

దేశంలో స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ కోర్సులకు మైసూర్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సంస్థ ప్రఖ్యాతమైంది. దివ్యాంగులకు నాణ్యమైన విద్య, సేవలందించే సుశిక్షితులను తయారు చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో పలు కోర్సులు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపికచేస్తారు. ఇందులో చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్‌ అందిస్తున్నారు.

ఏఐఐఎస్‌హెచ్‌తోపాటు అనుబంధ సంస్థల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
డిప్లొమా కోర్సులు
1. డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ ఇయర్‌ మౌల్డ్‌ టెక్నాలజీ
* సీట్ల సంఖ్య: 25
* అర్హత: ఫిజిక్స్‌తో ఇంటర్‌ లేదా ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌ల్లో డిప్లొమా / ఐటీఐ లేదా డెంటల్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత అర్హత పరీక్షలో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
* వయసు: జులై 1, 2018 నాటికి 24 ఏళ్లలోపు.
2. డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌
* సీట్ల సంఖ్య: 25
* అర్హత: ఏదైనా గ్రూప్‌తో ఇంటర్లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
* వయసు: 17 ఏళ్లు ఉండాలి.
3. డిప్లొమా ఇన్‌ హియరింగ్‌, లాంగ్వేజ్‌ & స్పీచ్‌
* సీట్ల సంఖ్య: ఒక్కో సెంటర్‌లో 25 చొప్పున ఉంటాయి. ఈ కోర్సును ఏఐఐఎస్‌హెచ్‌తోపాటు మరో ఎనిమిది సంస్థల్లో నిర్వహిస్తున్నారు.
* అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
* వయసు: జులై 1, 2018 నాటికి 21 ఏళ్లలోపు.
* ఈ కోర్సుల వ్యవధి ఏడాది. ఎంపికైనవారికి నెలకు రూ.250 చొప్పున పది నెలలపాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు.
పీజీ డిప్లొమా
1. పీజీ డిప్లొమా ఇన్‌ అగ్మెంటేటివ్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ కమ్యూనికేషన్‌
* అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ / స్పెషల్‌ బీఎడ్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి ఏడాది. 20 సీట్లు ఉన్నాయి.
2. పీజీ డిప్లొమా ఇన్‌ క్లినికల్‌ లింగ్విస్టిక్స్‌ ఫర్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ
* అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ / స్పెషల్‌ బీఎడ్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి ఏడాది. 10 సీట్లు ఉన్నాయి.
3. పీజీ డిప్లొమా ఇన్‌ ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
* అర్హత: బీఎస్సీ - ఫిజిక్స్‌ / మ్యాథ్స్‌ / ఎలక్ట్రానిక్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌ / ఫోరెన్సిక్‌ సైన్స్‌ / లేదా స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ ముఖ్యాంశంగా బీఎస్సీ / బీఏఎస్‌ఎల్‌పీ లేదా బీటెక్‌ - ఎలక్ట్రానిక్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌/ కమ్యూనికేషన్‌ లేదా ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధి ఏడాది. 10 సీట్లు ఉన్నాయి.
4. పీజీ డిప్లొమా ఇన్‌ న్యూరో ఆడియాలజీ
* అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ కోర్సు వ్యవధి ఏడాది. 10 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులకు ఎంపికైనవారికి నెలకు రూ.500 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ : మే 2
* పరీక్ష తేదీ: మే 26
* వెబ్‌సైట్‌: http://aiishmysore.in
బ్యాచిలర్‌ డిగ్రీ... 1.
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ
* సీట్లు: ఏఐఐఎస్‌హెచ్‌లో 62, జబల్‌పూర్‌లోని ఎన్‌ఎస్‌సీబీఎంసీలో 10.
* అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎంపికైనవారికి మొదటి మూడేళ్లు సంవత్సరానికి 10 నెలల పాటు నెలకు రూ.800 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో భాగంగా నెలకు రూ.5000 చొప్పున చెల్లిస్తారు.
2. స్పెషల్‌ బీఎడ్‌
* సీట్లు: 20
* అర్హత: ఏదైనా డిగ్రీలో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత. అలాగే జులై 1, 2018 నాటికి అభ్యర్థి వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో చేరినవారికి నెలకు రూ.400 చొప్పున ఏటా పది నెలలపాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

Back..

Posted on 05-03-2018