Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జోరుగా హుషారుగా...

     మరీ నెమ్మదిగా చదివి అర్థం చేసుకోవటం వల్ల సమయం వృథా అవుతుంది. ఉత్సాహం కూడా సన్నగిల్లుతుంది. నేటి పోటీ పరీక్షల యుగంలో వేగంగా చదివి విషయాన్ని ఆకళింపు చేసుకోవటం చాలా అవసరం. దీనికి విద్యార్థులు ఏయే మెలకువలు పాటించాలి?
జ్ఞాన సముపార్జనే తెలివితేటలను అభివృద్ధి చేసుకోవడానికి మూల సాధనం. స్పర్శ, రుచి, వాసన, శ్రవణం, దృశ్యం.. ఇలా జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సముపార్జన జరుగుతుంది.
మీరు ఈ కథనాన్ని చదువుతున్నారు కదా! మీ శరీరంలోని ఏ ఇంద్రియం దీన్ని చదువుతోందని అడిగితే ఏం చెబుతారు? ఆ జవాబు- 'కళ్ళు' అనే!
కానీ, అది సరి కాదు. నిజానికి చదివేది చేతనావస్థలో ఉన్న మన మెదడు. కళ్ళు కేవలం కెమెరాలా మాత్రమే పనిచేస్తాయి. ఒక కెమెరా ఒక ఫిల్మ్‌పై చిత్రాన్ని పట్టుకున్నట్టు కళ్ళు కూడా సమాచారాన్ని గ్రహించి మెదడుకు సరఫరా చేస్తాయి.
తొంభై శాతం సమాచార సేకరణ దృష్టి ద్వారానే జరుగుతుంది. అందువల్లనే జ్ఞాన సముపార్జనకు దీన్ని ప్రాథమిక ఇంద్రియంగా భావిస్తారు. ఏం చదవాలి; ఏది చదవడానికి తగినది?- ఈ మార్గదర్శకత్వం ప్రధానంగా పాఠ్యప్రణాళిక ఆధారంగా అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా లభిస్తుంది.
వేగంగా ఎలా చదవాలి; చదివే వేగాన్ని ఎలా పెంచుకోవాలి అనేది సాధారణంగా ఎవరూ బోధించరు. సిలబస్‌లో భాగంగానూ ఉండదు. నిజానికి విద్యార్థుల విజయసాధనలో పఠన సామర్థ్యం, వేగం ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
పఠనంలో రకాలు
పుస్తకాలను చదివే వేగం ఆధారంగా పఠనాన్ని మూడు రకాలుగా చెప్పవచ్చు. అంటే మూడు విధాల పాఠకులుంటారన్నమాట.
1. నెమ్మదిగా చదివేవారు: ఈ తరహా పాఠకులు సాధారణంగా నిమిషానికి 150- 200 పదాలు చదువుతారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులూ, యాభై సంవత్సరాలకు పైబడినవారూ ఈ రకంగా చదువుతారు. ఒక విద్యార్థికి విదేశీభాషగా ఆంగ్లం ఉంటే, మాతృభాషతో పోలిస్తే చదివే వేగం సహజంగానే తక్కువుంటుంది. ఇదే కాకుండా సాధారణంగా మానసిక ఒత్తిడి, కోపం, అలసటా- ఇవన్నీ చదివే వేగాన్ని తగ్గిస్తుంటాయి.
2. మధ్యస్థ వేగంతో చదివేవారు: ఈ తరహా వ్యక్తులు నిమిషానికి సుమారు 300- 400 పదాలు చదువుతారు. కళాశాల విద్యనభ్యసించే విద్యార్థుల సాధారణ వేగం నిమిషానికి 300- 350 పదాలు ఉంటుంది. ఈ వయసుకు వచ్చేటప్పటికి తగినంత పదజాల సామర్థ్యం వచ్చేస్తుంది. కాబట్టి మెదడు చాలావరకు సమాచారాన్ని సులువుగా గుర్తిస్తుంది. కాబట్టి వేగంగా చదివి అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
3. వేగంగా చదివేవారు: ఈ తరహా పాఠకులు నిమిషానికి 800- అంతకుమించిన పదాలను చదవగలరు. ఈ సహజ సామర్థ్యం లక్షమందిలో ఒకరిలో ఉంటుంది. స్వామి వివేకానంద, ప్రెసిడెంట్‌ రూజ్వెల్ట్‌, ప్రెసిడెంట్‌ జాన్‌ ఎఫ్‌. కెన్నడీ లాంటివారికి ఈ సామర్థ్యం ఉన్నదంటారు.

posted on 7.4.2015