Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పునరావాస సేవలకూ కొన్ని డిగ్రీలు!

* సెట్‌ - 2020 నోటిఫికేషన్‌ విడుదల

దివ్యాంగుల పునరావాసానికి సంబంధించిన జాతీయస్థాయి సంస్థలు థెరపీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తాజాగా బీపీటీ, బీపీవో, బీవోటీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. కోర్సును బట్టి ఇంటర్మీడియట్‌ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఈ డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం దక్కుతుంది.

లోకోమోటార్‌ డిజెబిలిటీస్‌ (చలన సంబంధ వైకల్యాలు)తో ఇబ్బందిపడే అందరికీ పునరావాస సేవలు అందించే లక్ష్యంతో పలు సంస్థలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. సంబంధిత మానవ వనరులను సిద్ధం చేసేందుకు తగిన కోర్సులనూ రూపొందించారు. కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థల్లో ప్రవేశాలకు ఏటా సెట్‌-2020 నిర్వహిస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మంచి బోధనతోపాటు చక్కటి వసతులూ అందుతాయి.

అర్హతలు: అన్ని కోర్సులకూ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. బీపీవోకి ఎంపీసీ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్ఛు ఎన్‌ఐఈపీఎండీ, చెన్నై సంస్థలోని బీపీటీ, బీవోటీ రెండింటికీ ఎంపీసీ విద్యార్థులు అర్హులే. ఏ కోర్సు, ఏ సంస్థకైనా జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మార్కుల శాతంలో సడలింపులు వర్తిస్తాయి.

వయసు: జనవరి 1, 2000 - డిసెంబరు 31, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

పరీక్ష విధానం: వంద మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కోదానికి ఒక్కో మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. పార్ట్‌-ఎలో జనరల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం నుంచి పది ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌-బిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ / మ్యాథ్స్‌ సబ్జెక్టులుంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఇంటర్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10.

పరీక్ష తేదీ: ఆగస్టు 2

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్‌, విజయవాడ

వెబ్‌సైట్‌: http://www.svnirtar.nic.in/

Back..

Posted on 20-05-2020