Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొవిడ్‌ - 19పై ప్రత్యేక కోర్సు

* టీసీఎస్‌ ‘కరోనా వారియర్స్‌’

కొవిడ్‌ -19ను ఎదుర్కోవడంలో ఎంతోమంది వైద్య సిబ్బంది ముందు నిలిచి పోరాడుతున్నారు. ఇంకెంతోమంది వారికి అండగా నిలుస్తున్నారు. ఈ కృషిలో తమవంతు సాయమందించాలని ఆశించే వారికి టీసీఎస్‌ అవకాశమిస్తోంది. ‘కరోనా వారియర్స్‌’ పేరిట ఒక ఆన్‌లైన్‌ కోర్సును అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు దీనిలో చేరి, సర్టిఫికెట్‌ అందుకోవచ్చు!

కరోనా వైరస్‌ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఈ సమయంలో వైరస్‌ సోకినవారిని జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికీ ప్రాధాన్యం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజా, భవిష్యత్‌ హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ను సంసిద్ధులను చేయడానికి టీసీఎస్‌ ఒక కోర్సును ప్రవేశపెట్టింది. ‘కరోనా వారియర్స్‌’ పేరుతో దీన్ని అందిస్తోంది. కరోనా వైరస్‌, దాని లక్షణాలు, వ్యాధి సోకకుండా, వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.

టీసీఎస్‌ తన స్ట్రాటజిక్‌ యూనిట్‌, డిజిటల్‌ లర్నింగ్‌ ప్లాట్‌ఫాం ‘టీసీఎస్‌ ఐఓఎన్‌’ ద్వారా ఈ కోర్సును అందజేస్తోంది. టీసీఎస్‌ లైఫ్‌సైన్సెస్‌ యూనిట్‌ నిపుణులు, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ విషయ నిపుణులు (ఎస్‌ఎంఈస్‌), ఫ్యాకల్టీ కలిసి దీనిని రూపొందించారు. ఇది ఇంటరాక్టివ్‌ కోర్సు. వీడియోలు, ఇతర లర్నింగ్‌ మెటీరియల్స్‌- రెగ్యులేటరీ గైడ్స్‌, ప్రెజెంటేషన్లు, ఇన్ఫోగ్రాఫిక్స్‌ ద్వారా బోధన ఉంటుంది. ఉచిత ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ కోర్సు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఎంచుకునే వీలు కల్పించారు. కాలవ్యవధి ఆరు గంటలు (వారం పాటు సాగుతుంది). ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉంది. దీనిని ప్రత్యేకంగా విద్యార్థులు, పారామెడికల్‌, ప్రొఫెషనల్‌ హెల్త్‌కేర్‌ వర్కర్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. నర్సులు, ఫార్మసిస్టులు, రిసెప్షనిస్టులు, రేడియాలజీ, టెక్నీషియన్లు, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌ తదితరులకు వారి వృత్తికి నిర్దిష్టంగా పనికొచ్చే అంశాలను అందజేస్తుంది.

వేటికి ప్రాధాన్యం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ప్రకారం.. వర్చువల్‌ సపోర్ట్‌ ప్రాక్టీస్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ పాలసీస్‌, మెంటల్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, రెసిడెంట్‌ అవేర్‌నెస్‌, ట్రావెల్‌ మోడ్‌ శానిటైజేషన్‌, విజిటల్‌ మూమెంట్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌ ప్రోటోకాల్స్‌ వంటి అంశాలకు కోర్సులో ప్రాధాన్యమిచ్చినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
కోర్సు పూర్తయిన తర్వాత సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ మాడ్యూల్‌ ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో సాగుతుంది. విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ https://learning.tcsionhub.in/courses/coronawarriors/ లో దరఖాస్తు చేసుకోవాలి. పేరు, ఈ-మెయిల్‌, మొబైల్‌ నంబరు లేదా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ అకౌంట్లలో ఏదో ఒకదానితో సైన్‌అప్‌ కావచ్ఛు.

సిలబస్‌ అంశాలు
* ఇంట్రడక్షన్‌ టూ కొవిడ్‌ -19
* ప్రివెంటివ్‌ మెజర్స్‌ ఎట్‌ పర్సనల్‌ స్పేస్‌/ హోమ్‌
* ప్రివెంటివ్‌ మెజర్స్‌ ఎట్‌ వర్క్‌
* ప్రివెంటివ్‌ మెజర్స్‌ డ్యూరింగ్‌ కమ్యూట్‌ టూ వర్క్‌ప్లేస్‌
* ప్రొఫెషన్‌ స్పెసిఫిక్‌ మెజర్స్‌
* అడిషనల్‌ మెజర్స్‌ టు హ్యాండిల్‌ కొవిడ్‌-19

Back..

Posted on 06-05-2020