Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆన్‌లైన్‌లో టీసీఎస్‌ ఉచిత కోర్సులు

* డిజిటల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ డిజిటల్‌ అసెస్‌మెంట్‌

లాక్‌డౌన్‌ కాలాన్ని విద్యార్థులు సమర్థంగా సద్వినియోగం చేసుకోవటం కోసం టీసీఎస్‌ ప్రత్యేకంగా ఉచిత ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. వీటిని తమ వెబ్‌సైట్‌- టీసీఎస్‌ ఐఓఎన్‌ కెరియర్‌ ఎడ్జ్‌లో అందుబాటులో ఉంచింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఈ లాక్‌డౌన్‌ సమయంలో ‘డిజిటల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ సర్టిఫికేషన్‌’ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. తన డిజిటల్‌ లర్నింగ్‌ హబ్‌- టీసీఎస్‌ ఐఓఎన్‌లో కెరియర్‌ ఎడ్జ్‌ 15 డేస్‌ ప్రోగ్రామ్‌ పేరుతో దీనిని అందిస్తోంది. ఇది ఉచిత సెల్ఫ్‌ ఆన్‌లైన్‌ కోర్సు. అండర్‌ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్స్‌ ఎవరైనా దీన్ని చేయవచ్చు.

ఈ కోర్సులో చేరిన అభ్యర్థి రోజుకు రెండు గంటల చొప్పున వారానికి 12 గంటలు కేటాయించాల్సి ఉంటుంది. నానో ట్యుటోరియల్‌ వీడియోలు, కేస్‌స్టడీస్‌, అసెస్‌మెంట్లు కోర్సులో భాగంగా ఉంటాయి. ఆంగ్లభాషలో బోధన ఉంటుంది. అసెస్‌మెంట్లు అభ్యర్థి బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి సాయపడతాయి. టీసీఎస్‌ నిపుణులు వెబినార్లనూ నిర్వహిస్తుంటారు. పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి ఇవి తోడ్పడతాయి.

ఒక్కోరోజు ఒక్కో మాడ్యూల్‌ ఉంటుంది. అలా 14 రోజులపాటు ఏదో ఒక అంశంపై బోధన ఉంటుంది. కోర్సు చివర్లో అన్ని మాడ్యూళ్లు పూర్తిచేసుకున్నాక ఎండ్‌ ఆఫ్‌ కోర్స్‌ అసెస్‌మెంట్‌ ఉంటుంది.

నేర్చుకునే అంశాలు
* కమ్యూనికేట్‌ టూ ఇంప్రెస్‌
* డెలివర్‌ ప్రెజెంటేషన్స్‌ విత్‌ ఇంపాక్ట్‌
* డెవలప్‌ సాఫ్ట్‌స్కిల్స్‌ ఫర్‌ ద వర్క్‌ప్లేస్‌
* గెయిన్‌ గైడెన్స్‌ ఫ్రమ్‌ కెరియర్‌ గురూస్‌
* రైట్‌ ఎ విన్నింగ్‌ రెజ్యూమె అండ్‌ కవర్‌ లెటర్‌
* స్టే ఎహెడ్‌ ఇన్‌ గ్రూప్‌ డిస్కషన్స్‌
* ఏస్‌ కార్పొరేట్‌ ఇంటర్వ్యూస్‌
* లర్న్‌ కార్పొరేట్‌ ఎటికెట్‌
* రైట్‌ ఎఫెక్టివ్‌ ఈ-మెయిల్స్‌
* లర్న్‌ కార్పొరేట్‌ టెలిఫోన్‌ ఎటికెట్‌
* అండర్‌స్టాండ్‌ అకౌంటింగ్‌ ఫండమెంటల్స్‌
* గెయిన్‌ ఫండమెంటల్‌ స్కిల్స్‌ ఇన్‌ ఐటీ
* అండర్‌స్టాండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌.

ఇవీ ఫ్రీనే..!
* ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలనుకునేవారికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
* జీఎస్‌టీ అంశాలపై అవగాహన తెచ్చుకోవాలనుకునేవారికి ఐసీటీ అకాడమీ- జీఎస్‌టీ 90 మినిట్స్‌
* సాఫ్ట్‌స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి కెరియర్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ప్రోగ్రామ్‌
* మౌఖిక పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ఇంటర్వ్యూ స్కిల్స్‌
* రెజ్యూమె అండ్‌ కవర్‌లెటర్‌ రైటింగ్‌
* ఈ-మెయిల్‌ ఎటికెట్‌ లాంటి వారం వ్యవధిగల కోర్సులు
* 10 వారాల వ్యవధి ఉన్న ‘ఇంట్రడక్షన్‌ టూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ కోర్సు ఉచితంగా నేర్చుకోవచ్చు.

కోర్సులో చేరినవారందరితో కెరియర్‌ ఎడ్జ్‌- నాక్‌డౌన్‌ ద లాక్‌డౌన్‌’ పేరిట కమ్యూనిటీ ఏర్పాటు చేస్తారు. మాడ్యూళ్లకు సంబంధించి ఏ సందేహమైనా దానిలో పోస్టు చేయొచ్చు. సంబంధిత మోడరేటర్‌ దాన్ని తీర్చడంలో సాయం చేస్తారు. అసెస్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ అంద జేస్తారు. ఇది అభ్యర్థి రెజ్యూమెకు అదనపు విలువను చేకూర్చడంలో సాయపడుతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు పక్కనే దానికి కేటాయించిన మార్కులుంటాయి. దరఖాస్తు చివరితేదీ అంటూ ఏమీ లేదు.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పేరు, మెయిల్‌, మొబైల్‌ నంబరు ఆధారంగా సైన్‌అప్‌ కావాలి. వివరాలన్నీ పూర్తిచేసి కోర్సును ప్రారంభివచ్చు.

వెబ్‌సైట్‌: https://learning.tcsionhub.in/c ourses/career-edge/

Back..

Posted on 15-04-2020