Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఇరవై గంటల్లో నైపుణ్యాలు

* టీసీఎస్‌ ఆధ్వర్యంలో కోర్సు
* ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఉచితం

దేశంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు భారీగా ఉద్యోగావకాశాలను అందిస్తున్న సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌). విద్యార్థుల్లో కెరియర్‌ నైపుణ్యాలు పెంచేందుకు ఈ సంస్థ ఏఐసీటీఈతో కలిసి డిజిటల్‌ లర్నింగ్‌ కోర్సును అందిస్తోంది. గుర్తింపు పొందిన కళాశాలల విద్యార్థులకు ఇది ఉచితం. ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకోవాలనుకునే వారికి మంచి అవకాశం!

విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలను అందించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఐఓఎన్‌ (టీసీఎస్‌ ఐఓఎన్‌) ఏఐసీటీఈతో కలిసి వివిధ కెరియర్‌ స్కిల్స్‌ను కోర్సుగా అందిస్తోంది. అకడమిక్‌, ఆప్టిట్యూడ్‌ల పరంగా అర్హులైన విద్యార్థులకు ప్రస్తుతం పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది.

కెరియర్‌లో ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగే విధంగా ప్రోత్సహించాలన్నదే ఈ కోర్సు ఉద్దేశం. కోర్సు కాలవ్యవధి వారం రోజులు. నేర్చుకునే మొత్తం సమయం 20 గంటలు. ఇది ఆన్‌లైన్‌ కోర్సు. నియమిత షెడ్యూల్‌ లేకుండా విద్యార్థి నేర్చుకునే వేగాన్ని (సెల్ఫ్‌ పేస్‌డ్‌) బట్టి కోర్సు ఫార్మాట్‌ ఉంటుంది. ఇందులో అభ్యర్థులు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, డెవలపింగ్‌ కోర్‌ ఐటీ స్కిల్స్‌ను నేర్చుకుంటారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన దాదాపు 10,000 కళాశాలల విద్యార్థులకు ఈ కోరుస ఉచితం. యూజీ, పీజీ విద్యార్థులెవరైనా దీనికి నమోదు చేసుకోవచ్చు. మొత్తం 11 మాడ్యూళ్లు ఉన్నాయి. అవి కార్పొరేట్‌ ఎటికెట్‌, ఎఫెక్టివ్‌ ఈ-మెయిల్‌ రైటింగ్‌, రెజ్యూమె అండ్‌ కవర్‌ లెటర్‌, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, గ్రూప్‌ డిస్కషన్లు, ప్రెజెంటేషన్లు, కార్పొరేట్‌ ఇంటర్వ్యూలు, సాఫ్ట్‌ స్కిల్స్‌, టెలిఫోన్‌ ఎటికెట్‌, కెరియర్‌ గైడెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌, ఐటీ ఫౌండేషన్‌ స్కిల్స్‌. చివరి రెండింటికి మినహా మిగతా అన్నింటికీ వీడియో, కేస్‌స్టడీస్‌ ఉంటాయి. టీసీఎస్‌ నిపుణులతో వెబినార్స్‌ కూడా నిర్వహిస్తారు. చివరి రెండు మినహా ప్రతి మాడ్యూల్‌ పూర్తయ్యాక ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ చేస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. వీటన్నింటినీ సమర్థంగా పూర్తిచేసినవారికి చివర్లో సర్టిఫికెట్‌ ఇస్తారు.

ఆసక్తి ఉన్నవారు నేరుగా వెబ్‌సైట్‌ https://learning.tcsionhub.in/courses/career-skills/ లో నమోదు చేసుకోవచ్చు.

గ్లోబల్‌ పోటీకి దీటుగా..
దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లోనూ నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్‌ వాళ్లతోపాటు గుర్తింపు పొందిన యూజీ, పీజీ కళాశాలల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు పూర్తిగా ఉచితం. వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్‌డెస్క్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. వీటిని నేర్చుకోవడం వల్ల వ్యక్తిగత అభివృద్ధితోపాటు పరిశ్రమలు కోరుకునే జీవన, సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. గ్లోబల్‌ పోటీకి దీటుగా ఎదుగుతారు.
- వి.రాజన్న, టీసీఎస్‌ టెలికం టెక్నాలజీ బిజినెస్‌ ,యూనిట్‌ గ్లోబల్‌ హెడ్‌


Back..

Posted on 23-07-2019