Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ప్రిప‌రేష‌న్ - ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు

తెలుగు

తెలుగు.. తేలికే కదా అని ఆదమరిస్తే మొదటికే మోసం వస్తుంది. సరిగా చదివితే నిజానికి సులభంగానే ఉంటుంది. పాదభంగాలు లేకుండా పద్యాలు రాయడానికి పద్యాలను కంఠస్థం చేయాలి. వ్యక్తీకరణ అంశాల్లో అభ్యర్థి సృజనాత్మకతను ప్రదర్శించాలి. అప్పుడే మంచి మార్కులు సొంతమవుతాయి.

తెలుగు పరీక్షను రెండు విధాలుగా నిర్వహిస్తారు. ఒకటి జనరల్‌ తెలుగు (01T, 02T) రెండోది కాంపోజిట్‌ తెలుగు (03T, 4S). మొదటి రోజు ప్రశ్నపత్రం ఇచ్చేటప్పుడు విద్యార్థి ఆ ప్రశ్నపత్రం తన ఐచ్ఛికానిదో? కాదో? పరిశీలించుకోవాలి. జనరల్‌ తెలుగు రాయబోయి కాంపోజిట్‌ తెలుగు రాసి మార్కులు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. కాబట్టి ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ఐచ్ఛికాన్ని పరిశీలించుకోవాలి.

పరీక్ష రాయడానికి 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ముందు దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. అంతర్గత ఎంపిక వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏ ప్రశ్నలకు సమాధానం రాయాలో వాటికి ‘టిక్‌’ మార్క్‌ ఇచ్చుకోవాలి.

జవాబు రాసేటపుడు ప్రశ్నను సమాధాన పత్రంలో రాయాల్సిన‌ అవసరం లేదు. దాని సంఖ్యను సరిగా వేస్తే చాలు. ప్రశ్న సంఖ్య సరిగా వేయకపోతే పేపరు దిద్దేటప్పుడు అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు విసుగు వచ్చే అవకాశం ఉంటుంది. మూల్యాంకనం చేయరు.

ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాసేలా అన్ని ప్రశ్నలనూ సాధన చేయాలి.

పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు

పేపర్‌-1
ప్రతిపదార్థం చదివేటప్పుడు పద్య అన్వయ క్రమాన్ని పాటిస్తూ చదవాలి. అర్థాలు రాయాలి. కర్త పదంతో ప్రతిపదార్థం ప్రారంభించి క్రియాపదంతో పూర్తి చేయాలి.
* కంఠస్థ పద్యం పాదభంగం లేకుండా రాసేలా సాధన చేయాలి. పద్యభాగం అర్థవంతంగా రాయాలి.
* వ్యక్తీకరణ - సృజనాత్మకత సామర్థ్యంలో 4 లఘు సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వాటిలో పద్యభాగం, గద్యభాగం నుంచి 2 చొప్పున వస్తాయి. వీటిలో ఒక కవి పరిచయం, ఒక ప్రక్రియ తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి పాఠ్యాంశాల కవులు, ప్రక్రియలు చదువుకోవాలి.
*వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు పది లేదా పన్నెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఈ విభాగంలోవి స్వీయ రచన ప్రశ్నలు కాబట్టి సమాధానాలు సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి.
* భాషాంశాలు మొత్తం చదివి జవాబులు పెట్టాలి. పాఠ్యాంశాల వెనుక ఉండే పదజాలం, వ్యాకరణాంశాలు సమగ్రంగా చదువుకోవాలి.

పేపర్‌-2
ఉపవాచకం, వాచకంలోని సృజనాత్మక అంశాల మీద ప్రశ్నలతో ఉంటుంది.
* సంఘటనా క్రమంలోని ప్రశ్నకు సమాధానం సరిగా రాయాలంటే రామాయణ కథపై పూర్తి అవగాహన ఉండాలి. 6 కాండలలో కథ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకూ ఉంటుందో తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
* అపరిచిత పద్యం, అపరిచిత గద్యం కింద ఇచ్చే ప్రశ్నలు పూర్తిగా చదివి అర్థం చేసుకొని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
* వ్యక్తీకరణ - సృజనాత్మకతలోని లఘు ప్రశ్నలలో ఒక పాత్ర స్వభావం సంఘటన ద్వారా నీవేం తెలుసుకున్నావు? అనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి, రామాయణంలోని ముఖ్య సంఘటనలను గుర్తుంచుకోవాలి.
* ఉపవాచకంలోని వ్యాసరూప ప్రశ్న ‘రామాయణం’పై ఉంటుంది. కాబట్టి కాండలలోని కథకు సంబంధించిన ప్రశ్న లేదా రామాయణం విశిష్టత గురించిన ప్రశ్నలను చదవాలి.
* సృజనాత్మక ప్రశ్నలకు మార్కుల సూచికలను అనుసరించి మార్కులు వేస్తారు. సృజనాత్మక ప్రశ్నకు నియమాలను అనుసరించి లేఖ, కరపత్రం, సంభాషణ వంటివి రాయాలి. లేఖ, కరపత్రం వంటివి ఒక పేజీలో పూర్తయ్యేలా రాయాలి.
* భాషాంశాల్లో జాతీయాలు వివరించడం, వాక్యభేదాలు, క్రియాభేదాలు గుర్తుంచుకోవాలి. కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యంగా మార్చేటప్పుడు ‘‘చేతబడి’’ అనే పదం గుర్తుంచుకుంటే సునాయాసంగా సమాధానాలు గుర్తించగలుగుతారు.

చేయకూడనివి
* ప్రశ్నపత్రం పూర్తిగా చదవకుండా సమాధానాలు రాయడం ప్రారంభించకూడదు.
* సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నను రాయవలసిన అవసరంలేదు. మార్జిన్‌లో ప్రశ్న సంఖ్య వేస్తే చాలు.
* అక్షరాలన్నీ ఒకే సైజులో పదానికి పదానికి మధ్య ఖాళీ ఉంచుతూ మూల్యాంకనం చేసే వారికి అర్థమయ్యేలా రాయాలి.
* వ్యాసరూప ప్రశ్నలకు 20 నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించకూడదు.
* కొట్టివేతలు లేకుండా జాగ్రత్తపడాలి.
* హాల్‌ టికెట్‌ నంబరు ఎక్కడా వేయకూడదు. మెయిన్‌ ఆన్స‌ర్‌ బుక్‌లెట్‌ నంబర్‌ మాత్రం ప్రతి అడిషినల్‌ షీట్‌ (అదనపు సమాధాన పత్రం), బిట్‌పేపర్‌ మీద వేయాలి.

ముఖ్యమైన ప్రశ్నలు

పేపర్‌ - 1
ప్రతిపదార్థాలు, కంఠస్థ పద్య భావాలు
1. శివరాజంతట మేల్ముసుంగు
2. అనలజ్యోతుల నీ పతివ్రతం
3. సురుచిర తారకాకుసుమ
4. వడిగొని టేకు లుప్పరిల్ల
5. దెసలను కొమ్మలొయ్య
6. నీరముతప్త లోహమున
7. ఉరుగుణవంతుడొడ్లు
8. తన చూపంబుధి మీద జాచి
వ్యాసరూప ప్రశ్నలు
1. శివాజీ వ్యక్తిత్వం గురించి రాయండి.
2. అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి.
3. ‘‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిళ్ళు’’ - సమర్థించండి.
4. వెన్నెల పాఠ్యాభాగ సారాంశం రాయండి.
5. హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధం రాయండి.
6. మానవ జీవితంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి అనడాన్ని నీవెలా సమర్థిస్తావు?
7. ‘గోరంత దీపాలు’ కథానికలో వృద్థుని పాత్ర స్వభావం గురించి రాయండి.
8. చిత్ర గ్రీవాన్ని గురించి సొంత మాటలలో రాయండి.

పేపర్‌- 2
ఉపవాచక ప్రశ్నలు
1. ‘‘రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ’’ సమర్థించండి.
2. శ్రీరామ జననం గురించి రాయండి.
3. సీతారామ కళ్యాణాన్ని వర్ణించండి.
4. శ్రీరాముడు వనవాసమేగడానికి కారణాలేమిటి?
5. అయోధ్య కాండ ఆధారంగా శ్రీరాముని గుణగణాలు వర్ణించండి.
6. సీతాపహరణ వృత్తాంతం రాయండి.
7. శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి రాయండి.
8. రామ రావణ యుద్ధాన్ని వర్ణించండి.
సృజనాత్మక ప్రశ్నలు
1. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని వర్ణిస్తూ రాయండి.
2. అమరావతి శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ లేఖ రాయండి.
3. మహిళల పట్ల వివక్ష, దాడులను ఖండిస్తూ కరపత్రం రాయండి.
4. చూడాకర్ణుడు, వీణాకర్ణుని మధ్య సంభాషణను రాయండి.
5. మీ పాఠాశాల వార్షికోత*వానికి అందరినీ ఆహ్వానిస్తూ ఆహ్వానపత్రం తయారు చేయండి.

- కె. లీలాకుమ‌ర్‌





ఇంగ్లిష్‌
పదో తరగతిలో ఆంగ్ల పరీక్షకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అన్ని సబ్జెక్టుల్లోనూ 10/10 తెచ్చుకునే విద్యార్థులు సైతం ఇంగ్లిష్‌లో 10/10 తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. పేపర్ల వారీగా మెలకువలను పాటిస్తే వీటిని అధిగమించి, మెరుగైన స్కోరు సాధ్యమవుతుంది.

పేపర్‌ 1: ప్రశ్నపత్రంలో 1 నుంచి 6వ ప్రశ్న వరకు వుండే comprehension passages పై వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తే మార్కులను గణనీయంగా పెంచుకోవచ్చు. 1, 2, 3, 6 యూనిట్లలో ఉండే passages ను బాగా సాధన చేయాలి. ప్రతి passage లోనూ వుండే విషయాన్ని ఎవరు, ఎవరితో చెప్తున్నారనేది బాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన nouns, pronouns ఎవరిని సూచిస్తున్నాయో తెలుసుకోండి. poetry ప్రశ్నలు question No. 4 లో ఉంటాయని గమనించాలి. poetry లో tone/tune/figures of speech పై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. question no. 7,8 లో conversation/ description/ diary entry/ script for a speech మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. coversationకు సమాధానం రాసేటప్పుడు discourse markers ను question tags ను ఉపయోగిస్తే పూర్తి మార్కులు వస్తాయి. 1 , 2, 3 యూనిట్స్‌లో conversation పై ప్రశ్నలు రావడానికి అవకాశముంది. diary entry కి dear diary అని సంబోధిస్తూ answer ను ప్రారంభించాలి. date/ day/ time రాయాలి. diary entry పూర్తయిన తరువాత సంతకం తప్పనిసరి. Speech రాసేటప్పుడు, ప్రారంభం, ముగింపు నియమాలు పాటించాలి. 4, 5, 6 యూనిట్స్‌ నుంచి ప్రశ్నలు రావచ్చు. question no.9 నుంచి 20 వరకుండే ప్రశ్నలు (bit paper లో) grammer అంశాలపై ఉంటాయి. question no. 9 లో editing పై ప్రశ్నలు englishలో common errors కు సంబంధించినవి. Question no. 10లో correct usage ప్రశ్నలుంటాయి. verb and tense/ verb and number/ prepositions/ articles/ conjunctions/ pronouns/ right form of the word మొదలైనవాటిపై ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. question no. 11 లో అడిగే ప్రశ్నలు unit 1, 5 ల నుంచి వస్తాయి. voice లో passive voice without object కు ప్రాధాన్యం ఇవ్వండి. unit 5 లో వుండే reported speech వాక్యాలు ముఖ్యమైనవి. unit 3, unit 5 లో ఉండే adverbial clauses/ unit 6 లో ఉండే linkers నుంచి ఒక ప్రశ్న వస్తుంది. prepositions కోసం యూనిట్‌ 2, 4లో వాక్యాలు ముఖ్యమైనవి. Question no. 17 నుంచి 20 వరకు వుండే language functions ప్రశ్నల కోసం modal verbs సాధన చేయాలి.

పేపర్‌ 2: ఈ పేపర్‌ లో వుండే comprehension విద్యార్థుల general comprehension talent ను పరీక్షించేలా ఉంటుంది. question no. 1 లో non verbal comprehension ఉంటుంది. data in table format/ bar diagram లు ముఖ్యమైనవి. Question no. 2 లోgeneral comprehension passage వస్తుంది. question no. 3 లో jumbled sentences ను meaningful order లో రాయడం పై ప్రశ్న వుంటుంది. ఈ order ఘటనలు జరిగిన క్రమంలో రాయాలి. question no. 4, 5లో letter/ news report/ biographical sketch / story writing మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటిలో news report/ biographical sketch లపై దృష్టి పెట్టాలి. news report లో incidents/ accidents/ events ముఖ్యమైనవి. Biographical sketch రాసేటప్పుడు chronological orderను పాటించాలి.

Important Discourses for Public Exams
1. In the lesson, “Attitude Is Altitude” you have read about Nick. You learnt that when Nick was eight years old, he went to his mother crying and told her that he wanted to kill himself. The mother of Nick consoled and encouraged him. Now, write a possible conversation between Nick and his mother in this context. The conversation should have at least 7 exchanges.

2. Imagine that you were Nick. Describe the feelings of Nick in the context given above.

3. You have read in one of your lessons that Vorobyov disaster took place on April 1986. You know that there was a explosion early in the morning. Imagine yourself as one of the victims and write a dairy entry on the day of the disaster.

4. You are asked to give a speech on the World Environment Day. Now prepare a speech to give on that day describing what happened in Vorobyov village, Ukraine. Narrate the whole incident in your speech.

5. You have read the lesson ‘Attitude Is Altitude’. In the lesson you have read that Nick was interested in learning surfing and met Bethany Hamilton to take her help. Write a possible conversation between Nick and Bethany Hamilton in that context. The conversation should have at least 5 exchanges.

6. You have read the play ‘The Dear Departed’. You know how the two daughter behaved for their father’s property. Imagine you are the
grandfather in the story. Write a description describing the agony of the grandfather over the behaviour of the two daughters.

7. You have read the lesson ‘My Childhood’. In the lesson you have read that a new teacher who came to Kalam’s class humiliated Kalam by sending him to the last bench. Now imagine that you are Kalam and write a diary entry when the incident took place.

8. You have read the lesson ‘Every Success Story Is also a Story of Great Failures’. You have understood the qualities of great people who achieved
success after great failures. Now prepare a script for your speech describing the great qualities of successful people taking the references from the lesson. You have to give this speech on the Youth Festival Day in your school.

9. In that lesson ‘Rendezvous with Ray’ you have read the details of Gaston Roberge’s association with Ray. Imagine that Roberge visited
your school on the Annaual Day of your school. You are interested in having a short conversation with him. He agreed. Now write an imaginary conversation between you and Gaston Roberge with reference to the details of your lesson.

10. In the lesson “The Journey” suppose the author realized and felt guilty of his attitude towards his father . Now describe about the inner
feelings of the author. Now, write a description that reflects the following ideas.

What mistake did he commit?
How did he feel for that?
What was his realisation?
How would he like to change his attitude towards his father in his future?

11. In the lesson “Attitude Is Altitude”, you have read about Nick. Being a differently-abled person he was teased, bullied and deeply depressed. One day he tried to kill himself as he was deeply depressed. Now imagine yourself as Nick and write a diary entry of that day.

12. You have read the lesson ‘Attitude Is Altitude’. You might have understood the disadvantages or problems faced by a disabled man without arms and legs. Now, prepare a script for a speech describing the disadvantages of this kind of disability taking references from the lesson ‘Attitude Is Altitude’.

13. In that lesson, ‘My Childhood’ you have read that when Kalam was in fifth standard, a new teacher came to his class. He asked Kalam to go and sit on the back bench. Kalam and his friend, Ramanadha Sastry felt very sad for their separation. This incident was reported to Lakshmana Sastry, the father of Ramanadha Sastry. Lakshmana Sastry talked to the teacher and settled the issue. Now write a possible conversation between Lakshmana Sastry and the new teacher in the above context.

14. In the lesson ‘My Childhood’ you have read that a new teacher who came to Kalam’s class asked Kalam to go and sit on the last bench. It made Kalam and his friend Ramanadha Sastry feel sad. Now describe the thoughts of Kalam over the incident that happened in the classroom.

15. You have read the story of Nick Vujicic who was born with no arms and legs. Imagine yourself as Nick's mother and write a diary entry on the day when she gave birth.

16. ‘Failures are the stepping stones to success.’ Write a description in supporting the statement extracting the references from your lesson “Every Success Story Is also a Story Great Failures”.

17. You have read the lesson , ‘My Childhood’. In that lesson, you have read that when Kalam wanted to go to Ramanadhapuram for higher
studies, Kalam’s mothert was hesitant. Kalam’s father tried to console and comfort her. Write a possible conversation between Kalam’s father and his wife in the above context.

18. You have read the story ‘The Brave Potter’. You have read that the villagers praised the potter as they thought that he caught the tiger and tied under the tree. But the potter did not how it happened.

Now, narrate the thoughts of the potter when he found the tiger tied to the tree in front of his house.

19. You have read the lesson ‘My Childhood’. In the lesson you have read that a new teacher, who came to Kalam’s class, humiliated Kalam by sending him to the last bench. Now imagine that you are Kalam and write a diary entry when the incident took place.

20. In the lesson ‘Environment’ you have read the views of Wangari Maathai about how wars are fought for the natural resources.

Now, write a script for a speech taking the views of Maathai. You have to present this speech on the World Environmental Day

- న‌వులూరి పేర‌య్య‌





భౌతికశాస్త్రం
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో.. భౌతికశాస్త్ర ప్రశ్నలు గుర్తుకు పెట్టుకుని, బట్టీపట్టి రాయడానికి వీలుగా ఉండవు. ఆలోచించి రాసేలా ఉంటాయి. విశ్లేషణాత్మకంగా అన్వయించి రాయాల్సి ఉంటుంది. సమాధానాలు ఒకేరకంగా రాయడానికి బదులు బహుళ విధాలుగా వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది.

ఆ ప్రశ్నలు నిర్ధారించిన విద్యాప్రమాణాలు, సాధించవలసిన సామర్థ్యాలకు సంబంధించినవై ఉంటాయి. పాఠ్యపుస్తకంలోని అన్ని ప్రశ్నలూ యథాతథంగా ప్రశ్నపత్రంలో రావు. అందువల్ల బట్టీపట్టి చదివే విధానానికి స్వస్తిచెప్పి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల వారీగా వెయిటేజీ లేదు. సిలబస్‌ మొత్తానికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్షుణ్ణంగా చదవాలి. పాఠాన్ని పూర్తిగా చదివి అందులో ముఖ్యమైన భావనలు, పటాలు, ఫార్ములాలు, ప్రయోగాలు, నిత్యజీవిత అనువర్తనాలను అవగాహన చేసుకోవాలి. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయటం అభ్యసించి, పునశ్చరణ చేయాలి. కృత్యాలు, ప్రయోగాలను సాధ్యమైనంతవరకూ వ్యక్తిగతంగా చేసి పరిశీలనలు, ఫలితాలను నమోదు చేయాలి. ప్రతి ప్రయోగ కృత్యానికీ నివేదికలు రూపొందించుకోవాలి. ప్రతి భావననూ విశ్లేషణాత్మకంగా చదవాలి. ప్రత్యేకంగా బొమ్మల ద్వారా వివరించగలగడం, అసంపూర్తిగా ఉన్న బొమ్మలను పూర్తిచేయడం, సందర్భోచిత పటాలు గీయటం సాధన చేయాలి.

ప్రశ్నల స్వభావం
విషయావగాహన: భౌతికశాస్త్రంలో నేర్చుకున్న భావనలను వివరించడం, ఉదాహరణలివ్వడం, కారణాలు చెప్పడం, పోలికలు, భేదాలు చెప్పటంపై ప్రశ్నలు.

ప్రశ్నించడం - పరికల్పనలు చేయడం: వివిధ భావనలపై విద్యార్థులు సొంతంగా ప్రశ్నలు అడిగేలా ఫలితాలు గురించి ఊహించే ప్రశ్నలు.

ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు: ప్రయోగ విధానం, ఉపయోగించిన పరికరాలు, వచ్చిన ఫలితాలు, ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించిన విధానం, చరాలు మార్చినప్పుడు వచ్చే ఫలితాలు, అమరికకు పటాలు గీయటం వంటి ప్రశ్నలు.

సమాచార నైపుణ్యాలు: సమాచారాన్ని విశ్లేషించడం, సేకరించడం, ఉపయోగించిన సాధనాలు, నమూనా పట్టికలు తయారు చేయటం వంటి ప్రశ్నలు.

బొమ్మలు గీయడం: పరికరాల అమరిక, పనిచేసే విధానం, బొమ్మలు గీయడం, ఫ్లో చార్టులు, గ్రాఫులు గీయడం వంటి ప్రశ్నలు.

ప్రశంస, విలువలు, జీవవైవిధ్యం: అభినందించే, ప్రశంసించే పద్ధతులు, నిర్వహించే లేదా పాల్గొనే పనులు, నినాదాలు, కరపత్రాలు, వ్యాసాలు రాయడం వంటి ప్రశ్నలు.

ప్రశ్నపత్రంలో పార్టు-ఎ మూడు విభాగాలుగా ఉంటుంది. పార్టు ఎ-కి సమాధాన పత్రంలోనూ, పార్టు బి-కి ప్రశ్నపత్రంలోనూ సమాధానాలు రాయాలి.

పార్ట్‌-ఎలోని విభాగం-1లో 4 ప్రశ్నలుంటాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాయాలి.

అనుస‌రించాల్సిన అంశాలు

* సరైన ప్రణాళిక, సంసిద్ధత, పునశ్చరణ మంచి గ్రేడ్‌ పాయింట్లు సాధించడానికి దోహదం చేస్తాయి.

* ఇంట్లో, పాఠశాలలో పునశ్చరణకు తగిన సమయం కేటాయించాలి.

* ప్రతి పాఠ్యాంశాన్నీ పూర్తిగా అవగాహన చేసుకుని చదవాలి.

* కీ పాయింట్లను తయారుచేసుకోవాలి.

* స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకొని వాటికి జవాబులు రాయడం సాధన చేయాలి.

* పాఠ్యపుస్తకంలోని ‘అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం’లోని అన్ని ప్రశ్నలకు స్వయంగా సమాధానాలను రాసుకుని పునశ్చరణ చేసుకోవాలి.

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు
1 మార్కు

1) 37OC ను కెల్విన్‌ మానంలోకి మార్చండి.

2) n = 3 అయితే l విలువలను తెలపండి.

3) విశిష్ట నిరోధానికి S.I. పద్ధతిలో ప్రమాణం ఏమిటి?

4) కింది సమ్మేళనాల్లో ఏది త్రికబంధాన్ని కలిగి ఉంటుంది?
C3H6, C3H8, C3H4

5) ఒక వాహకంలో 4 నిమిషాల్లో 90 కులూంబ్‌ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలోని విద్యుత్‌ ప్రవాహం ఎంత?

* పార్టు-ఎ విభాగం-2లో 5 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 3 లేదా 4 వాక్యాల్లో సమాధానాలు రాయాలి.

2 మార్కులు

1) వజ్రం ప్రకాశించడానికి కారణమేమిటి? ఇందులో ఇమిడి ఉన్న అంశాన్ని మీరెలా అభినందిస్తారు?

2) NaOH ఉపయోగాలను తెలపండి?

3) వస్తువును 2F1, F1 ల మధ్య ఉంచినపుడు పుటాకార కటకం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాన్ని గీయండి.

4) 6, R2 నిరోధం గల రెండు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం 4 లు అయితే R2 విలువను కనుక్కోండి.

5) బాష్పీభవనం, మరగడం మధ్య భేదాలను తెల్పండి.

* పార్టు-ఎ విభాగం-3లో 4 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ప్రతి ప్రశ్నకు అంతర్గత వెసులుబాటు ఉంది. ఏదైనా ఒకదాన్ని ఎన్నుకొని సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు 8- 10 వాక్యాల్లో సమాధానం రాయాలి.

4 మార్కులు

1) ఓవర్‌లోడ్‌ వల్ల విద్యుత్‌ సాధనాలు ఎందుకు పాడవుతాయి? ఓవర్‌లోడ్‌ వల్ల సంభవించే ప్రమాదాలను ఎలా నివారించగలం?

2) సాధారణంగా దృష్టి దోషాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడతాయి? పట సహాయంతో వివరించండి. కటకాలను ఉపయోగించి దృష్టి దోషాలను ఎలా సవరిస్తారో వివరించండి.

3) ధాతువులను సాంద్రీకరణం చెందించే ప్రక్రియలను తెలిపి, వివరించండి.

4) పట్టక వక్రీభవన గుణ‌కాన్ని కనుక్కునే ప్రయోగాన్ని వివరించండి.

5) s, p ఆర్బిటాళ్ళ జ్యామితీయ ఆకృతులను గీయండి.

* పార్టు-బిలో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు. ఇచ్చిన నాలుగు సమాధానాల్లో (A, B, C, D) ఒకదాన్ని ఎంచుకుని బ్రాకెట్లలో రాయాలి. దిద్దేసిన, కొట్టివేసి రాసిన సమాధానాలకు మార్కులు ఇవ్వరు.

1) ఒక పరమాణువులో చివరి ఎలక్ట్రాన్‌ క్వాంటం సంఖ్యలు 3, 2, -2, +1/2 అయితే, దాని పరమాణ సంఖ్య ( )
A) 19 B) 20 C) 21 D) 22

2) అత్యధిక ఋణ విద్యుదాత్మకత గల మూలకం బాహ్యతమ కర్పరంలోని ఎలక్ట్రాన్‌ విన్యాసం ( )
A) ns2np3 B) ns2np4 C) ns2np5 D) ns2np6

- కంచర్ల గగన్‌ కుమార్‌





పరీక్షల ముందు ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే సందేహాలు విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తూంటాయి. అయితే తగిన మెలకువలు పాటిస్తే వాటిని అధిగమించి, పరీక్షల్లో మంచి స్కోరు సంపాదించవచ్చు. పదోతరగతి విద్యార్థులకు శ్రమించే తత్వం, సన్నద్ధత చాలా ముఖ్యం. కష్టపడి చదవటం అలవాటు చేసుకోవాలి. చదివేటప్పుడూ, రాసేటప్పుడూ ‘ఇక చాలు’ అనే భావన రానీయకండి. ఇంకాస్త చదివితే మార్కులు పెరుగుతాయి. కొంచెం ఆలోచించి రాస్తే మరో అర మార్కు సంపాదించవచ్చు అనే భావనతో పరీక్షలు రాయండి.

ప్రణాళిక: ఏ పని చేపట్టినా ఒక పద్ధతిని ఆచరిస్తే ఫలితం బాగుంటుంది. ప్రతి సబ్జెక్టుకూ కొంత సమయం కేటాయించాలి. ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి, వాటిని బాగా చదివి, చూడకుండా రాయాలి. రాని ప్రశ్నలను వదిలివేయకుండా మళ్ళీ ప్రయత్నించాలి.

ప్రశాంతత: పరీక్షలంటే భయపడితే చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సన్నద్ధమయ్యేటప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడూ కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ‘నేను సాధించగలను, తప్పక సాధిస్తాను’ అనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.

చేతిరాత: పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల దీనిపై శ్రద్ధ వహించాలి. ఒకవేళ మీ చేతిరాత బాగుండకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. దస్తూరి అందంగా ఉండటం ముఖ్యం కాదు; మీరు రాసింది దిద్దేవారికి అర్థం కావాలి. అందుకు పదానికీ పదానికీ¨ మధ్య కాస్త ఖాళీ ఇవ్వండి. అలాగే ప్రతి రెండు వాక్యాల మధ్యా కొంచెం దూరం పాటించండి. అంతే!

పునశ్చరణ: పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఇంతకుముందు చదివిన ప్రశ్నలనే పునశ్చరణచేస్తూ అవగాహన పెంచుకోవాలి. పరీక్షకు ముందు సబ్‌ హెడ్డింగ్స్, ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చదవాలి. 1, 2, 4 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలపై పట్టు సాధించాలి. ఛాయిస్‌ లేని 1/2, 1, 2 మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. రోజూ ఒకటి లేదా రెండు వ్యాసరూప ప్రశ్నలు రాయడాన్ని సాధన చేస్తే పరీక్షలో వేగంగా, తప్పులు లేకుండా విషయాన్ని వివరించడం సాధ్యమవుతుంది. స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలను ఇప్పటికే చాలావరకు చదివిఉంటారు. వాటిని మినహాయించి మిగతా ప్రశ్నలపై దృష్టి పెట్టండి. జవాబులను చదివేసమయంలో బిట్లుగా వచ్చే పాయింట్లను అండర్‌లైన్‌ చేసి ఉంచుకోండి. పరీక్షలు సమీపించినప్పుడు వాటిని పునశ్చరణ చేయండి.

ప్రశ్నపత్రం చదవాలి: పరీక్షల్లో విద్యార్థులంతా సాధారణంగా చేసే పొరపాటు. ప్రశ్నపత్రాన్ని చదవడానికి 15 నిమిషాలు కేటాయించి, ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదివితే ఎలా రాయాలి అనే అంశంపై స్పష్టత ఏర్పడుతుంది. అలాగే సమయపాలన తేలికవుతుంది.

మార్కులకు అనుగుణంగా: ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ఏయే అంశాలను తప్పనిసరిగా రాయాలి అనే దానిపై విద్యార్థులకు స్పష్టత అవసరం. అడిగిన ప్రశ్నకు ఏ పాయింట్లు ఉంటే పూర్తి మార్కులు పొందుతారో తెలుసుకొని ఉండాలి. మొదట ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా తప్పనిసరిగా రాయాల్సిన అంశాల తర్వాతే, మిగతావి రాయటం మేలు.

అవసరముంటేనే అడిషనల్స్‌: అదనపు జవాబుపత్రాలను (అడిషనల్స్‌) అవసరంమేరకే తీసుకోండి. ఎక్కువ పేజీల్లో సమాచారం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు అనేది అపోహే. జవాబు పత్రాల్లో అవసరానికి మించి ఖాళీలు వదిలి ఎక్కువ అడిషనల్స్‌ తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి విసుగ్గా అనిపించడంతోపాటు మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఎక్కువ పేజీలు ఉంటే ఎక్కువ మార్కులు ఇస్తారని రాసిన జవాబునే మళ్లీ రాయవద్దు. అవసరమైన మేరకే రాయాలి. అనవసర విషయాలు చర్చించడం వల్ల మార్కులు తగ్గడం, సమయం వృథా కావడం తప్ప ప్రయోజనం ఉండదు.

సమయ సద్వినియోగం: కొందరు విద్యార్థులు పరీక్షలో సమయం చూసుకోకుండా రాస్తూనే ఉంటారు. ఇలాంటివారు తమకు తెలిసిన జవాబులు రాయకుండానే పేపర్‌ ఇచ్చేయాల్సి వస్తుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆయా ప్రశ్నలకు నిర్దేశిత సమయాన్ని మాత్రమే కేటాయించండి. మొదట మీకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. మరిచిపోయిన జవాబులను చివరిలో ప్రయత్నించండి. ప్రశ్నల నంబరు వేయడం మరవకండి. వీటిని మార్జిన్‌ ఎడమపక్క వేయాలి. జవాబుల్లో ఉపశీర్షికలు (సబ్‌హెడ్డింగ్స్‌) ఉంటే వాటిని అండర్‌లైన్‌ చేయాలి. ఉపశీర్షికలు లేని సమాధానాల్లోని పాయింట్స్‌లో ముఖ్యపదాలను అండర్‌లైన్‌ చేయండి. అదనపు (ఛాయిస్‌) ప్రశ్నలకు ముందే రాయకండి. చివరిలో సమయం ఉంటేనే రాయండి.

జవాబులను పూర్తిగా రాయాలి. అవసరమైనచోట అదనపు పాయింట్లను జతచేయాలి. అర్థమయ్యే చేతరాత, క్రమబద్ధంగా రాసిన జవాబులు, ఉప విభాగాలు, ముఖ్యమైన పదాలను అండర్‌లైన్‌ చేయడం, మార్జిన్‌ వదలడం, ప్రశ్నపత్రం దిద్దేవారిని ఆకట్టుకుంటాయి. అన్ని జవాబులూ రాసిన తర్వాత, జవాబు పత్రాన్ని అంతా చదివి తప్పులుంటే సరిచేయండి.

సాంఘికశాస్త్రం

భూగోళశాస్త్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు భారతదేశ పటాన్నీ, చరిత్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు ప్రపంచపటాన్నీ దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పటాలను చూస్తూ చదవండి. ఒకసారి చదివితే ఏదీ రాదు. వచ్చేవరకూ చదవండి. బిట్స్‌ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) బట్టీ పట్టవద్దు. డ్రిల్లింగ్‌ (ఒకరిని ఒకరు అడగటం) చేస్తే మేలు.

వ్యాఖ్యానించడం: ‘ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి వ్యాఖ్యానించడం’ అనే నైపుణ్యంలో ఇచ్చే పేరాను కొంతమంది ఉన్నది ఉన్నట్లు రాస్తున్నారు. ఇలా చేయకూడదు. పేరాను పూర్తిగా చదవండి. ప్రశ్నను అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన అంశాలు మాత్రమే రాయండి. అభిప్రాయాలు అడిగినప్పుడు ఆ పేరాలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాయండి. దీనికోసం పాఠ్యపుస్తకంలోని రెండు పేరాలను తీసుకుని సాధన చేయండి.

పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలు: పాఠ్యపుస్తకంలో ఉన్న పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలను పరిశీలించండి. ఆ పట్టిక మనకు ఏమి తెలియచేస్తుంది? సమాచారంలో మొదటి, చివరి స్థానంలో ఏం ఉన్నాయి? వాటి మధ్య తేడా ఏమిటి? ప్రత్యేకత ఏమిటి? పటాలైతే ఏ దిక్కులో ఏ దేశాలున్నాయి? భారతదేశపటంలో ఏ వైపు ఏ రాష్ట్రాలున్నాయి? మొదలైన ప్రశ్నలతో వాటిని పరిశీలనాత్మక ధోరణిలో చూడండి.

పట నైపుణ్యాలపై అవగాహన ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఈ నైపుణ్యంలో మూడు విధాలుగా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రాలను, భారతదేశ చిత్తుపటాలను గీయమనడం; ప్రాంతాలను, దేశాలను గుర్తించమనడం; గుర్తించిన పటాన్నిచ్చి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమనడం. ఈ మూడింటినీ సాధన చేయండి. ఈ సాధన ద్వారా సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలను బట్టీపట్టకుండా అర్థం చేసుకోవచ్చు. దేశాలు, దీవులు, ఇతర ప్రాంతాలను కొన్ని ఆకారాల్లో (జంతువులు, పక్షులు, అక్షరాలు, అంకెలు) గుర్తుపెట్టుకుంటే వాటిని సులభంగా గుర్తించవచ్చు. మ్యాప్‌ను గుర్తించేటప్పుడు ప్రశ్న సంఖ్యను అక్కడ వేయకూడదు. గుర్తించిన చోట పేరు మాత్రమే రాయాలి. ఒకవేళ స్థలం లేకపోతే బాణం గుర్తువేసి రాయాలి. లేదా గుర్తించాల్సిన ప్రదేశంలో మ్యాప్‌పై సంఖ్యవేసి, ఎదురుగా పేరు రాయాలి.

సమకాలీన అంశాలు: ఈ నైపుణ్యంలో పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి.

* మొదటి పేపర్‌లో- పాఠశాల విద్య, భ్రూణహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, లింగ వివక్ష, మధ్యాహ్న భోజన పధకం, మురికి వాడలు, చౌకధరల దుకాణాలు, నీరు- అమ్మకాలు, నీటి కాలుష్యం, భూగర్భజలాలు, ప్రపంచీకరణ, పోషకాహారం, భూగోళం వేడెక్కడం, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్‌పొర.

* రెండో పేపర్‌లో- ప్రపంచయుద్ధాలు, భారతదేశంతో ఇతర దేశాల సంబంధాలు, ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, నూతన రాష్ట్రాలు, జిల్లాల ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, సామాజిక ఉద్యమాలపై దృష్టిపెట్టండి.

బిట్‌పేపర్‌ రాసేటప్పుడు: బిట్‌పేపర్‌ ఇచ్చిన వెంటనే మెయిన్‌ పేపర్‌ రాయడం ఆపి బిట్‌పేపర్‌ పూర్తి చేయాలి. సమయం ఉంటే ఆ తర్వాత మెయిన్‌ పేపర్‌ రాయాలి.

* A, B, C, D లు బ్రాకెట్టులో రాసేటప్పుడు సరిగా రాయండి. జవాబులు తప్పు రాశామనుకుంటే దానిపై దిద్దవద్దు. తప్పు అనుకున్నదాన్ని పూర్తిగా కొట్టివేసి, అప్పుడు సరైన సమాధానం రాయాలి. అన్ని బిట్లనూ పూరించండి. ఒక్కోసారి ఏదైనా బిట్‌ తప్పుగా రావచ్చు. ఇలాంటివి అటెమ్ట్‌ చేస్తే మార్కు వస్తుందని మర్చిపోవద్దు.

ముఖ్యమైన ప్రశ్నలు

పేపర్‌-1

1. ‘వ్యవసాయానికి మైదాన ప్రాంతాలు తోడ్పడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు’. ఈ పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది?

2. మిగతా రంగాలకంటే సేవారంగానికి ప్రత్యేకత ఉంది. కొన్ని ఉదాహరణలతో వివరించండి. (ఏపీకి మాత్రమే)
* ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించడం ఉపయోగకరమేనా? ఎందుకు (తెలంగాణకు మాత్రమే)

3. మీ రాష్ట్రంలో ‘పాఠశాల విద్యను విప్లవం‘గా చేపట్టాలంటే ఏమి చేయాలో తగు సూచనలు ఇవ్వండి.

4. ‘భూగోళం వేడెక్కడానికి మానవుడే కారణం’. వివరించండి.

5. వలసలు వెళ్ళినవారు ఆ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా/సమస్యలకు కారణం అవుతారా? మీ సమాధానానికి కారణాలు రాయండి?

6. ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరుస్తుంది అని ఒకరంటే దేశాభివృద్ధికి సహాయపడుతుంది అని మరొకరు అంటున్నారు- వ్యాఖ్యానించండి.

7. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం రావడానికి రెండు నినాదాలు రాసి, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.

8. ‘ప్రత్యేక ఆర్థిక మండలి’ (సెజ్‌) అని దేన్ని అంటారు? వివరించండి?

9. భారతదేశ చిత్రపటాన్ని గీచి, మీ రాష్ట్రాన్ని, దాని రాజధానిని గుర్తించండి.

10. ఆనకట్టలు కట్టడం వలన ఎవరికి లాభం కలుగుతుంది? ఎవరికి నష్టం కలుగుతుంది?

పేపర్‌-2

1. రెండో ప్రపంచ యుద్ధానికి దోహదం చేసిన ప్రత్యేక అంశాలేవి?

2. లెనిన్, స్టాలిన్‌లు రష్యాసమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు?

3. చైనాలో భూ సంస్కరణల కోసం చేపట్టిన కార్యక్రమాలు రాసి, వాటి ఫలితాలు తెల్పండి.

4. సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో పటేల్‌ కృషిని ప్రశంసించండి?

5. రాజ్యాంగ సభ చర్చల్లో ‘అంటరానితనం’ అనే అంశంపై ప్రొమథరంజన్‌ ఠాకూర్‌ ఏమన్నారు?

6. భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను తెలపండి?

7. ఎన్నికల సంఘం విధులు తెలిపి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అది ఎలా నియంత్రిస్తుందో వివరించండి? (తెలంగాణకు మాత్రమే)
* పొరుగు దేశాలతో శాంతియుతంగా ఉండటానికి మన దేశం చేపట్టాల్సిన చర్యలను సూచించండి? (ఏపీకి మాత్రమే)

8. బహుళ పార్టీ వ్యవస్థ వల్ల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలపండి?

9. సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలను రాయండి?

10. గ్రామపెద్దలు, కోర్టులు వివాదాలు/తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేన్ని ఇష్టపడతారు? ఎందుకు? (ఏపీకి మాత్రమే)
* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో వివిధ వర్గాల ప్రజల కృషిని వివరించండి? (తెలంగాణకు మాత్రమే)

- బొమ్మడి నారాయణరావు





గణితశాస్త్రం

నూరుశాతం మార్కులను కచ్చితంగా సాధించగలిగే సబ్జెక్టు గణితశాస్త్రం. ఈ సబ్జెక్టు పరీక్షలో విజయానికి వేగం, కచ్చితత్వం రెండు కళ్ళు. అందుకే విద్యార్థికి ఈ రెండూ తప్పనిసరి. పదో తరగతి గణితంలో 10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించడానికి సరైన సన్నద్ధతతో పాటు పరీక్షల్లో జవాబులను చక్కగా ప్రెజెంట్‌ చేయటం కూడా అవసరం. అందుకోసం చేయాల్సినవి.

పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చదవటం సరి కాదు. ప్రణాళిక ఏదీ లేకుండా ఇలా చదివితే ఫలితం ఉండదు. ఏయే సబ్జెక్టుల్లో, ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నామో గుర్తించాలి. ప్రణాళికాబద్దంగా పునశ్చరణ (రివిజన్‌) చేసుకోవాలి. ఉదాహరణకు 30 రోజుల వ్యవధిలో రెండు రోజులకు ఒక చాప్టర్‌ చొప్పున కేటాయించుకుంటే 15 చాప్టర్లు చక్కగా రివిజన్‌ చేసుకోవచ్చు.

విద్యార్థులు తెల్లవారుఝామున 4 గంటలకు నిద్రలేవటం మంచిది. ఈ సమయంలో చదివిన విషయాలు ఎక్కువగా గుర్తుంటాయి. రాత్రి 10.30 గంటలవరకు శ్రద్ధగా చదవటం మేలు. ప్రతిరోజూ సబ్జెక్టుకు రెండు గంటల చొప్పున అన్ని సబ్జెక్టులు పునశ్చరణ చేసుకోవాలి. జవాబులను పెన్సిల్‌తో రాయకూడదు. బిట్‌ ప్రశ్నల జవాబుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉండకుండా చూసుకోవాలి.

* గణితం పేపర్‌1 కి సంబంధించిన 7 చాప్టర్లలో మొత్తం 20, పేపర్‌ 2కి సంబంధించి 7 పేపర్లలో మొత్తం 25 భావనలున్నాయి. అన్ని భావనలపైనా పట్టు సాధించినట్లయితే నూరుశాతం మార్కులకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ భావనల ఆధారంగానే పరీక్షల్లో ప్రశ్నలు రూపొందిస్తారు.

* ప్రతీ చాప్టర్‌లోని సూత్రాలు, నిర్వచనాలు ఒక చార్టుపై రాసి ప్రతిరోజూ పునశ్చరణ చేసుకోవాలి. మెరుగైన స్కోరుకు ఇవి దోహదం చేస్తాయి.

* పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. అవగాహన చేసుకుని బాగా వచ్చిన ప్రశ్నలను ముందుగా రాయాలి.

* కంపాస్‌ పెట్టె తప్పనిసరిగా ఉంచుకోవాలి.

* జవాబు రాసే ప్రతీ ప్రశ్నసంఖ్యనూ మార్జిన్‌లో రాయాలి. జవాబు పత్రానికి రెండువైపులా మార్జిన్‌ గీయాలి.

* చివరన జవాబులన్నీ సరిచూసుకోవాలి.

* అదనపు జవాబు పత్రాలు, గ్రాఫ్, పార్టు - బి జవాబుపత్రాలన్నీ వరుసగా కట్టాలి.

* ప్రశ్నలను బట్టీ పట్టే అలవాటు ఏమాత్రం సరికాదు. తెల్లవార్లూ మేలుకుని చదవటం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి.

* అనవసరంగా ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే ఆశించిన మార్కులు సాధ్యమవుతాయి.

- డా. టీఎస్‌వీఎస్‌ సూర్యనారాయణమూర్తి







Posted on 28-01-2019