Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బ‌యాల‌జీలో ఉన్నత చ‌దువుల‌కు ఉమ్మడి ప‌రీక్ష

- ఎంపికైతే ప్రముఖ ప‌రిశోధ‌నా సంస్థల్లో ప్రవేశం
- టీఐఎఫ్ఆర్ జేజీఈఈబీఐఎల్ఎస్ ద్వారా అవ‌కాశం

బ‌యాల‌జీ అంటే మీకు ఆస‌క్తా? బ‌యాల‌జీ, అనుబంధ కోర్సుల్లో ప్రముఖ‌ సంస్థల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీజీ కోర్సులు చ‌ద‌వాల‌నుకుంటున్నారా? అయితే మీ కోస‌మే జాయెంట్‌ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేష‌న్ ఇన్ బ‌యాల‌జీ అండ్ ఇంట‌ర్ డిసిప్లిన‌రీ లైఫ్ సైన్సెస్‌(జేజీఈఈబీఐఎల్ఎస్‌) ఎదురుచూస్తోంది. ఈ ప‌రీక్షను టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్‌) నిర్వహిస్తుంది. రాత ప‌రీక్షలో అర్హత సాధించిన‌వారిని ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు. అందులోనూ అర్హత సాధిస్తే ప్రముఖ సంస్థల్లో ఉన్నత చ‌దువులు దిశ‌గా అడుగులు వేయ‌వ‌చ్చు. ఎంపికైన ప్రతి ఒక్కరికీ చేరే కోర్సును బ‌ట్టి ప్రతి నెలా రూ.28 వేల వ‌ర‌కు ఫెలోషిప్‌గా చెల్లిస్తారు.

ప్రవేశాలు క‌ల్పించే సంస్థలు:
-అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రీట్‌మెంట్‌, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్ ఇన్ క్యాన్సర్‌(ఏసీటీఆర్ఈసీ), ముంబై (http://www.actrec.gov.in/)

-సెంట‌ర్ ఫ‌ర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బ‌యాల‌జీ (సీసీఎంబీ), హైద‌రాబాద్ (http://www.ccmb.res.in)

-సెంట‌ర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ), హైద‌రాబాద్ (http://www.cdfd.org.in)

-డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ‌య‌లాజిక‌ల్ సైన్సెస్‌, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రీసెర్చ్ (డీబీఎస్‌-టీఐఎఫ్ఆర్‌), ముంబై (http://www.tifr.res.in/~dbs)

-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌), భోపాల్ (http://www.iiserb.ac.in/), కోల్‌క‌తా (http://www.iiserkol.ac.in), మొహాలీ (www.iisermohali.ac.in), పుణే (http://www.iiserpune.ac.in), తిరువ‌నంత‌పురం (http://www.iisertvm.ac.in)

-ఇన్‌స్టిట్యూట్ ఫ‌‌ర్ స్టెమ్ సెల్ బ‌యాల‌జీ అండ్ రీజ‌న‌రేటివ్ మెడిసిన్ (ఇన్‌స్టెమ్‌), బెంగ‌ళూరు (http://www.instem.res.in)

-నేష‌న‌ల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంట‌ర్ (ఎన్‌బీఆర్‌సీ), మ‌నేస‌ర్ (http://www.nbrc.ac.in)

-నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌య‌లాజిక‌ల్ సైన్సెస్ (ఎన్‌సీబీఎస్‌), బెంగ‌ళూరు (http://www.ncbs.res.in)

-నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్‌), పుణె (http://www.nccs.res.in)

-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాల‌జీ (ఎన్ఐఐ), న్యూదిల్లీ (http://www1.nii.res.in)

-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (నైస‌ర్‌), భువ‌నేశ్వర్ (http://www.niser.ac.in/)

-రీజ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ (ఆర్‌సీబీ), ఫ‌రీదాబాద్ (http://www.rcb.res.in/)

-సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ ఫిజిక్స్ (ఎస్ఐఎన్‌పీ), కోల్‌క‌తా (http://www.saha.ac.in)

-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ), చెన్నై (http://www.imsc.res.in/)

కోర్సులివీ...
పైన పేర్కొన్న అన్ని సంస్థలూ పీహెచ్‌డీ కోర్సుల‌ను అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సులు డీబీఎస్‌-టీఐఎఫ్ఆర్‌, ఎన్‌సీబీఎస్‌, ఐఐఎస్ఈఆర్‌-పుణె, కోల్‌క‌తాలు అందిస్తున్నాయి. ఎమ్మెస్సీ రీసెర్చ్ కోర్సు డీబీఎస్‌-టీఐఎఫ్ఆర్‌లో ఉంది. ఎమ్మెస్సీ న్యూరో సైన్స్ కోర్సును ఎన్‌బీఆర్‌సీ అందిస్తోంది.

అర్హత‌:
పీహెచ్‌డీ కోర్సుల‌కు బేసిక్ సైన్సెస్‌లో పీజీ లేదా అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉండాలి. ఎమ్మెస్సీ (ఆగ్రిక‌ల్చర్‌), బీటెక్‌/బీఈ, బీవీఎస్సీ, బీఫార్మసీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఎంఫార్మసీ కోర్సులు చ‌దివిన‌వారెవ‌రైనా అర్హులే. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ కోర్సుల‌కు బేసిక్ సైన్సెస్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉన్నవాళ్లు అర్హులు. జులై 2017లోగా డిగ్రీ పూర్తిచేసుకునేవాళ్లంతా ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. బ‌యాల‌జీ కోర్సుల్లో ప్రవేశానికి ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో శిక్షణ పొందిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వీరికి ప్రత్యేక ప‌రీక్ష ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు.

ప‌రీక్షలో...
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ స‌బ్జెక్టుల్లో ప్రాథ‌మికాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఎంపికైతే..
ఆగ‌స్టు 1, 2017 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిన‌వారికి మొద‌ట్లో రూ.25 వేలు పీహెచ్‌డీకి పేరు న‌మోదు చేసుకున్న అనంత‌రం రూ.28 వేలు ప్రతినెలా ఫెలోషిప్ చెల్లిస్తారు. అలాగే ఏటా కాంటింజెన్సీ రూపంలో రూ.32 వేలు ద‌క్కుతాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు చ‌దువుతున్న విద్యార్థుల‌కైతే మొద‌టి సంవ‌త్సరం ప్రతి నెలా రూ. 16 వేలు స్టైపెండ్ ద‌క్కుతుంది. ఆ ఏడాదికి రూ.20 వేలు కాంటింజెన్సీ గ్రాంటు మంజూరుచేస్తారు. రెండో ఏట ప్రతినెలా రూ.25 వేలు చెల్లిస్తారు. మూడో ఏట నుంచి ప్రతినెలా రూ.28 వేలు ఇస్తారు. కాంటింజెన్సీ కింద ఏడాదికి రూ.32 వేలు చెల్లిస్తారు. ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరిన‌వారికి నెల‌కు రూ.12 వేలు చొప్పున స్టైపెండ్ అందిస్తారు. ప్రవేశం క‌ల్పించే సంస్థల‌న్నీ దాదాపు ఉచితంగా వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యాలు సమ‌కూరుస్తాయి.

తాజా నోటిఫికేష‌న్ వివ‌రాలు...
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో https://www.ncbs.res.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: పురుషులైతే రూ.600, మ‌హిళ‌ల‌కు రూ.వంద‌. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించుకోవ‌చ్చు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన విద్యార్థులు వారు చ‌దువుతున్న క‌ళాశాల ప్రిన్సిపాల్‌/ డిపార్ట్‌మెంట్ హెడ్ ద్వారా వివ‌రాల‌తో కాలేజీ లెట‌ర్ హెడ్‌పైన విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పిస్తే అవ‌కాశాన్ని బ‌ట్టి ఫీజు నుంచి మిన‌హాయింపు క‌ల్పిస్తారు.
ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డానికి చివ‌రి తేదీ: అక్టోబ‌రు 10
ప‌రీక్ష తేదీ: డిసెంబ‌రు 11 (ఆదివారం) మ‌ధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వ‌ర‌కు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కోర్సులు చ‌దివిన‌వారికి ఉద‌యం 9 : 30 నుంచి 12 : 30 వ‌ర‌కు ప‌రీక్ష నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్ (బెంగ‌ళూరు, పుణే, ముంబై, చెన్నై, భువ‌నేశ్వర్..త‌దిత‌ర చోట్ల ప‌రీక్ష నిర్వహిస్తారు.
ఫ‌లితాల ప్రక‌ట‌న‌: జ‌న‌వ‌రి 31
ఇంట‌ర్వ్యూలు: ఫిబ్రవ‌రి, మార్చిల్లో
పూర్తి వివ‌రాల‌కు https://www.ncbs.res.in/academic/admissions చూడ‌వ‌చ్చు.

నోటిఫికేష‌న్ (క్లిక్‌)

పాత ప్రశ్నప‌త్రాలు క్లిక్     2016     2015

Back..

Posted on 09-09-2016