Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉచిత శిక్షణ.. ఉపాధికి రక్షణ

» యువతకు బాసట.. సద్వినియోగంతో సత్ఫలితం

       స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంభన సాధించాలనే ఆలోచన.. ఇందుకు కంప్యూటర్, కుట్టు శిక్షణ, మార్కెటింగ్, బ్యూటీషియన్ వంటి కోర్సులు ఉపయుక్తం.. శిక్షణ తీసుకోవాలంటే వేలాది రూపాయలను వెచ్చించాలి.. ఆర్థిక ప్రగతి అనే ఆలోచనకు శిక్షణ భారంతో వెనుకడుగు వేస్తుంటారు.. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు మేమున్నామంటూ ఉచిత శిక్షణకు ఆహ్వానం పలుకుతున్నాయి.. శిక్షణే కాదు వసతి, భోజనం పూర్తిగా ఉచితమంటూ యువతలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి శిక్షణ సంస్థలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని కలను సాకారం చేసుకోవచ్చు. జిల్లాలో ఉచిత శిక్షణ అందిస్తున్న సంస్థలు, అవి అందించే శిక్షణకు సంబంధించిన సమగ్ర సమాచారంతో 'న్యూస్‌టుడే' అందిస్తున్న ప్రత్యేక కథనం.ి.

నిరుద్యోగ నిర్మూలనలో డీఆర్డీయే-ఐకేపీ
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస,్థ ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు పలు అంశాల్లో ఉచిత శిక్షణ లభిస్తోంది. కంప్యూటర్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాల్‌సెంటర్, సెక్యూరిటీ ఉద్యోగాలకు సంబంధిత శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా జూకీ కుట్టు మిషన్‌పై కుట్టు పని, ఎంబ్రాయిడరీలో తర్పీదునిస్తున్నారు. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని ముఖ్య పట్ణణాల్లోని పరిసర ప్రాంతాల యువతకు ఉచిత శిక్షణ లభిస్తోంది. వివరాలకు 9989477891, 9246651077 నంబరులో సంప్రదించండి.
స్వయం ఉపాధికి బాసటగా ఎస్బీహెచ్ శిక్షణ
ఎస్బీహెచ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నగరంతోపాటు ఇతర ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. శిక్షణతోపాటు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. స్వయం ఉపాధికి బ్యాంకు రుణ మంజూరుకు తోడ్పాటు అందిస్తున్నారు. కంప్యూటర్, ఏసీ, ఫ్రిజ్, చరవాణి మరమ్మతు, కుట్టు, ఎంబ్రాయిడరీ వంటివెన్నో కోర్సుల్లో శిక్షణ సదుపాయం ఉంది. 20 మంది నిరుద్యోగులు తమకు కావాల్సిన కోర్సును సూచిస్తే అందులోనూ శిక్షణ ఇచ్చేందుకు సంస్థ సంసిద్ధం. మరిన్ని వివరాలకు 0878- 2248312, 9030502550 ఫోను నంబర్లను సంప్రదించాలి.
కార్మికుల నైపుణ్యానికి..
కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు కార్మిక సంక్షేమ మండలి ఉచిత శిక్షణ అందిస్తోంది. ఇప్పటికే అనేక మంది శిక్షణతోపాటు ధ్రువీకరణ పత్రం, పనిముట్లు వంటివి పొందారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో పాటు శిక్షణ అనంతరం స్త్టెఫండు లభిస్తుంది. మరిన్ని వివరాలకు 9492555252 ఫోను నంబరులో సంప్రదించాలి.
పట్టణ యువతకు మెప్మా
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలోనూ పట్టణ యువతకు ఉపాధికి అనువైన శిక్షణ లభిస్తోంది. నగర, పురపాలక సంఘాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. నర్సింగ్, డాటా ఎంట్రీ, హోటల్ మేనేజ్‌మెంటు, కంప్యూటర్ తదితర కోర్సుల్లో శిక్షణ లభిస్తుంది. మరిన్ని వివరాలకు 0878-2252345 ఫోను నంబరులో సంప్రదించాలి.
నిర్మాణ రంగంలో రాణించేందుకు
నిర్మాణ రంగంలో ఉద్యోగం, ఉపాధి సాధనకు నేషనల్ అకాడమీ ఫర్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ఉచిత శిక్షణ ఇస్తోంది. శిక్షణ కాలంలో ఉచితంగా భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తారు. నిర్మాణ రంగంలో లభించే ఉపాధి అవకాశాలకు అనువైన విభాగాల్లో శిక్షణ అందిస్తున్నారు. హౌజ్ వైరింగ్, సానిటేషన్, ఎలక్ట్రికల్, ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్ సూపర్‌వైజర్, ప్లంబింగ్ వంటి కోర్సులో ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంటు కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9989470292, 9848827124 ఫోను నంబరులో సంప్రదించాలి.
పోటీ పరీక్షల కోసం
స్టడీ సర్కిల్
వెనుకబడిన అభ్యర్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు అనువైన ఉచిత శిక్షణ బీసీ స్టడీ సర్కిల్ అందిస్తోంది. శిక్షణతో పాటు పరీక్షలకు ఉపయుక్తమయ్యే స్టడీ మెటీరియల్‌ను అందిస్తోంది. అర్హుల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరించి తరగతులు నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నారు. మరిన్ని వివరాలకు 9618577922 ఫోను నంబరులో సంప్రదించాలి. ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ ప్రకటనలు వెలువడిన సందర్భంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తారు.