Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పై చేయి సాధించాలంటే...

       ద్యోగం కోసం అన్వేషిస్తున్నపుడు చాలా పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు అన్నీ మీతో పాటే సమానంగా ఉన్నా.. కొన్నిసార్లు మీ పోటీ దారులు మీపై పైచేయి సాధించి కొలువును చేజిక్కించుకొంటూ ఉంటారు. ఇందుకు కారణం మీ పోటీదారులతో పోల్చితే మీలో కొన్ని అంశాలపై అవగాహన లేకపోవడం. అందువల్ల ఉద్యోగవేటలో పోటీని తట్టుకోవాలంటే కొన్ని కీలక అంశాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా మీ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసిన అంశాలేంటో తెలుసుకోవాలి. ఇందుకోసం నిపుణులు అందించే సూచనలను పాటించాలి.
నిపుణులు చెబుతున్న అంశాలివీ
       ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలను వెదకడం సరికాదు. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన సంస్థలున్న ప్రాంతాలకు వెళ్లాలి. అప్పుడే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.
* సీవీ, రెజ్యూమెను మీ వ్యక్తిగత వివరాలు, నామమాత్రపు నైపుణ్యాలు, అర్హతలతో సాదాసీదాగా రూపొందించవద్దు. రిక్రూటర్‌ను ఆకట్టుకొనేలా వృత్తికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు, ప్రతిభ తదితర వివరాలతో రెజ్యూమెను తీర్చిదిద్దాలి
* చదువు పూర్తయ్యాక కొలువుకు తగిన శిక్షణ తీసుకోవాలి. కేవలం చదువుకున్న అంశాలతోనే ఉద్యోగం సాధించడం ప్రస్తుతం కొంచెం కష్టం.
* మీ నైపుణ్యాలు, ప్రతిభ, అర్హతలపై స్పష్టమైన అంచనా, అవగాహన ఉండాలి. లేకుంటే రిక్రూటర్ల వద్ద మీరు మీ ప్రతిభను పూర్తిస్థాయిలో కనబరచలేరు.
* దరఖాస్తు, పరీక్ష, రెజ్యూమె, ఇంటర్వ్యూలు, బృంద చర్చల్లో సృజనాత్మకత, కొత్తదనం కనిపించాలి. ఇవి లేకుంటే అర్హతలు, ప్రతిభ ఉన్నా ఉద్యోగం సాధ్యం కాకపోవచ్చు.
ఎప్పుడూ ఉన్నత ఉద్యోగాలనే ఆశించడం సరికాదు. అవి అనుభవం ఉన్నవారికే వస్తాయన్న విషయాన్ని గుర్తించాలి.
* ఆంగ్లభాష, వర్తమాన అంశాలపై పట్టు ఉండాలి. ఇది ఉద్యోగంలోరాణించడానికి.. కొత్తదనం కనబరచడానికి ఉపకరిస్తాయి.
* ఎంచుకున్న రంగానికి సంబంధించిన కనీస అంశాలపై స్పష్టత కలిగి ఉండాలి.
* ఉద్యోగానికి నిజాయతీగా ప్రయత్నించకుండా అడ్డదారులు వెదకడం సరికాదు. సదరు కొలువకు అర్హతలు, నైపుణ్యాలు ఏంటో తెలుసుకొని వాటిని సాధించి తర్వాత ప్రయత్నించాలి. ఇవి లేకుండా ఉద్యోగం ఎవరూ ఇవ్వరు.
* వృత్తిలో రాణిస్తున్న వారితో సంబంధాలు ఉండాలి. ఆ రంగానికి సంబంధించిన కీలక అంశాలు, తాజా విశేషాలు తెలుస్తాయి.
* ఆయా రంగాలకు సంబంధించి పుస్తకాలు చదవాలి. కొంత అధ్యయనం చేయాలి.
* సరైన నడవడిక, భావ వ్యక్తీకరణ కూడా ముఖ్యమే. ఇవి లేకపోతే ఇక్కడ ఎంత నైపుణ్యం ఉన్నా ప్రదర్శించలేరు.
       కెరీర్‌బిల్డర్ అనే సంస్థ.. సమాన అవకాశాలున్నపుడు ఎవరు ఏఏ కారణాలతో ఉద్యోగం సాధిస్తున్నారో తెలుసుకొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రిక్రూట్‌మెంట్ సంస్థల వద్ద సర్వే చేసింది. సర్వే వివరాలు.. ఇంటర్వ్యూలు, బృంద చర్చలు తదితర సందర్భాల్లో అభ్యర్థి హాస్యచతురత ప్రదర్శించాల్సి ఉంటుంది. సర్వేలో 27 శాతం మంది రిక్రూటర్లు హాస్యచతురతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చూడ చక్కని ఆహార్యం కూడా ముఖ్యమే. దీనికి 26 శాతం మంది ప్రాధాన్యం ఇచ్చారు. ఇక శారీరకదారుఢ్యానికి 13 శాతం మంది, వర్తమాన వ్యవహారాలపై అవగాహన కలిగి ఉన్న వారికి 8 శాతం మంది ప్రాధ్యాం ఇస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదికల్లో చురుగ్గా ఉండటం కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగార్థులకు సానుకూల అంశంగా మారుతోంది. ఇలాంటి వారిని ఎంపిక చేసుకొనేందుకు 8 శాతం రిక్రూటర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.