Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అవకాశాలు అనంతం

       కొంజీవితంలో చక్కగా స్థిర పడాలంటే ఎంచుకున్న రంగమే కీలకం. తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను వమ్ము చేయకుండా విద్యార్థులు పోటాపోటీగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ తర్వాత చక్కగా స్థిరపడేందుకు పరితపిస్తున్నారు. ఆయా కోర్సులను చదువుతూ 'కొలువు' దీరుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసంతో పాటు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ రంగాల్లో రాణించేందుకు చదువుతో పాటు కృషి చేస్తున్నారు.
* సీఏ కోర్సుకు ఆదరణ
ఇంటర్‌ సీపీటీ 6 నెలల కోర్సు. ఐటీసీసీ నిర్దిష్ట కాలపరిమితితో అన్ని విషయాలు ఏకకాలంలో ఉత్తీర్ణత సాధించాలి. సీఏ ఫైనల్‌కు ముందు ఆర్టికల్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఉపాధి రెండు రకాలుంటుంది. సొంతంగా ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయవచ్చు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థల్లో ఉద్యోగం చేయవచ్చు. అభ్యర్థులకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనం ఉంటుంది. భారతదేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోంది. డిమాండుకు అనుగుణంగా సీఏల కొరత ఉంది. ఇంటర్‌ తర్వాత ఈ కోర్సు పట్ల మక్కువ చూపితే కెరీర్‌ను చక్కగా మలుచుకునే వీలుంటుంది.
* ఇంజినీరింగ్‌ అవకాశాలు
ఏటా ఇంజినీరింగ్‌ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. సామర్థ్యాన్ని బట్టి ఉపాధి అవకాశాలున్నాయి. కష్టపడి చదివి ఉత్తీర్ణత శాతం అభివృద్ధి చేసుకుంటే మంచి కంపెనీల్లో అవకాశాలు వస్తున్నాయి. మధ్య స్థాయి విద్యార్థులకు సాధారణ అవకాశాలు వస్తున్నాయి. కింది స్థాయి విద్యార్థులకు అవకాశాలు పూర్తిగా రావటం లేదు. బి.టెక్‌. చదివిన వారు ఎం.టెక్‌. చదవటానికి అర్హులు. మార్కెట్‌లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి ఆయా కంపెనీలు పోటీపడుతున్నాయి.
* మెడిసిన్‌
మెడిసిన్‌ బంగారు భవిష్యత్తు ఉన్న కోర్సు. వైద్యవిద్యలో రాణించటానికి దోహదపడుతుంది. ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీడీఎస్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వైద్య వృత్తిపై మక్కువ ఉన్నవారికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
* ఫార్మసీ రంగంలో
ఔషధ రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చేసిన యువతకు ఫార్మసిస్టుగా మంచి కంపెనీల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రయోగ శాలల్లో ఉపాధి మెరుగుపడుతుంది.
* విద్యాబోధన
మధ్యస్థాయి విద్యార్థులు డైట్‌సెట్‌ వైపు దృష్టిసారిస్తున్నారు. స్వల్ప కాలంలో జీవితంలో స్థిరపడాలనే అవకాశంతో రెండేళ్ల కోర్సును విద్యార్థులు అభ్యసిస్తున్నారు. తక్కువ వ్యవధిలో ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవటానికి ఇదో చక్కటి అవకాశం. పెరిగిన ఉపాధ్యాయ జీతాలను దృష్టిలో ఉంచుకుని టీటీసీ కోర్సుకు మంచి డిమాండు ఉంది.
* డెయిరీ టెక్నాలజీ
ఇంటర్‌ తర్వాత డెయిరీ టెక్నాలజీ కోర్సుకు చక్కటి ఆదరణ లభిస్తోంది. తెలంగాణ జిల్లాల్లో కామారెడ్డిలోనే ఈ కోర్సు ఉంది. శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోర్సు చదివిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధునాతన భవనం, బాలికల, బాలుర వసతిగృహాల నిర్మాణం ఇటీవలే పూర్తి చేశారు. డెయిరీ కోర్సును అభ్యసించడానికి యువతరం ఎక్కువగా పోటీ పడుతోంది.
* అవకాశాలను అందిపుచ్చుకోవాలి : వీరేందర్‌, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
యువత పోటీతత్వాన్ని అలవరచుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏ కోర్సు చదివితే ఎలాంటి ఉపాధి దక్కుతుందో ముందే అవగాహనకు రావాలి. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఏ రంగంలోనైతే నెగ్గుతామో అదే రంగంలో రాణించేందుకు కృషి చేయాలి.