Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జేఏఓ పరీక్షలో జయీభవ!

కామర్స్‌ అభ్యర్థులకు జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (జేఏఓ) ఉద్యోగావకాశాలు ఒకటి తర్వాత ఒకటి క్రమంగా వస్తున్నాయి. నిన్న ఎస్‌పీడీసీఎల్‌ జేఏఓ, నేడు టీఎస్‌ జెన్‌కో జేఏఓ.. రేపు రాబోయే ఎన్‌పీడీసీఎల్‌ జేఏఓ! టీఎస్‌ జెన్‌కో 42 జేఏఓ ఉద్యోగాల నియామక పరీక్షను మే 27న నిర్వహించనున్నారు. నెలపైనే సమయమున్న ఈ పరీక్షకు సన్నద్ధత ఎలా సాగించాలో తెలుసుకుందాం!

టీఎస్‌ జెన్‌కో నియామకాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 13న ప్రారంభమై మే 10న ముగియనుంది. బీకామ్‌ లేదా ఎంకామ్‌ ఫస్ట్‌క్లాస్‌/ సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ ఇంటర్‌ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

జేఏఓ రాత పరీక్షను 100 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో 100 మార్కులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహిస్తారు. మొదటి విభాగంలో కామర్స్‌ సబ్జెక్టుల నుంచి 60 మార్కులకూ, రెండో విభాగంలో జనరల్‌ అవేర్‌నెస్‌, లాజికల్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ¨ల నుంచి 40 మార్కులకూ ప్రశ్నలను ఇస్తారు.

సిలబస్‌ విశ్లేషణ
* విభాగం-ఎలో కామర్స్‌లోని వివిధ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను ఇస్తారు. అడ్వాన్స్‌డ్‌ అకౌంటెన్సీ , ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, కాస్టింగ్‌, ఆడిటింగ్‌, టాక్సేషన్‌, బడ్జెట్‌, పారిశ్రామిక చట్టాల నుంచి దాదాపు 60 ప్రశ్నలను ఇస్తారు.
1. అడ్వాన్స్‌డ్‌ అకౌంటెన్సీ, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌: మొదటి విభాగంలో అత్యధిక సిలబస్‌ను ఈ సబ్జెక్టు నుంచి నిర్దేశించారు. జేఏఓ సాధించడంలో కీలకపాత్ర వహించే సబ్జెక్టుల్లో ఇది ప్రధానమైనది. 20- 25 ప్రశ్నలు రావొచ్చు. ప్రాథమిక భావనలు, పద్ధతులు, వివిధ సూత్రాలు, చిట్టాపద్దులు, వివిధ ఖాతాల నమూనాలను విశ్లేషిస్తూ చదవాలి. వీలైనన్ని ప్రాబ్లమ్స్‌ సాధన చెయ్యాలి.
2. కాస్టింగ్‌: మరో ముఖ్యమైన ఈ సబ్జెక్టు నుంచి 10- 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో వివిధ కాస్టింగ్‌ పద్ధతులు, వాటిని వినియోగించే పరిశ్రమలు, వివిధ సూత్రాలను చదువుతూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి. ముఖ్యమైన సూత్రాలనూ, ఇతర కీ-పాయింట్స్‌నూ క్లుప్తంగా నోట్‌ చేసుకుంటూ చదివితే మంచి ప్రయోజనం.
3. ఆడిటింగ్‌: 10- 15 ప్రశ్నల వరకు రావొచ్చు. ప్రాథమిక అంశాలతోపాటు వివిధ సెక్షన్లు, కనిష్ఠ, గరిష్ఠ సంఖ్య, ఆడిటర్‌ నియామకం, తొలగింపు, ఆడిటింగ్‌ ప్రమాణాలను వర్తమాన అంశాలతో జోడించి చదివితే మంచి స్కోరు సాధించవచ్చు.
4. బడ్జెట్‌: దీనిలో వివిధ రకాల బడ్జెట్లు, బడ్జెటరీ నియంత్రణ నుంచి 3- 5 ప్రశ్నలు రావొచ్చు.
5. టాక్సేషన్‌: 4- 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను చట్టం, వివిధ శ్లాబు రేట్లు, జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశాలు- ఇటీవలి మార్పులు, ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్లను శ్రద్ధగా చదవాలి.
6. పారిశ్రామిక చట్టాలు: దాదాపు 10 ప్రశ్నలు రావొచ్చు. ప్రతి చట్టం రూపొందించిన సంవత్సరం, వివిధ సెక్షన్లు, వివిధ నియమాలు, ముఖ్యమైన అంశాలు, ఇటీవల చేపట్టిన సంస్కరణలు, సవరణలను అధ్యయనం చేయాలి.
* విభాగం-బిలో జనరల్‌ అవేర్‌నెస్‌, లాజికల్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీలుంటాయి. అభ్యర్థుల సాధారణ పరిజ్ఞానాన్ని, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. ప్రధాన సబ్జెక్టుతో ఈ సబ్జెక్టులోని అంశాలను లోతుగా అధ్యయనం చేసినపుడే విజయం వరిస్తుంది. అభ్యర్థులు ఆంగ్లంలో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, గత 6 నెలల జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, తెలంగాణ చరిత్ర లోతుగా చదవాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి.

కామర్స్‌ సబ్జెక్టులకూ, జనరల్‌ అవేర్‌నెస్‌కూ ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. వీలైనన్ని మోడల్‌ పేపర్లను సాధన చేయాలి. ఇలా చేస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మరింత ఉత్సాహంగా చదివే అవకాశం ఉంది. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కావడానికి అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి ప్రణాళికతో, ప్రామాణిక పుస్తకాలను సానుకూల దృక్పథంతో దీక్షగా చదవాలి. రోజుకు 10 గంటల చొప్పున మొత్తం సిలబస్‌ను మూడు పర్యాయాలు చదవటం వల్ల ఫలితం ఉంటుంది.

రిఫరెన్స్‌ పుస్తకాలు

ఇంగ్లిష్‌ మీడియంలో
‌* అడ్వాన్స్‌డ్‌ అకౌంటెన్సీ - ఎస్‌పీ జైన్‌, కేఎల్‌ నారంగ్‌, ఎస్‌ఎన్‌ మహేశ్వరి, ఆర్‌ఎల్‌ గుప్తా, వీకే గుప్తా
* ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌- ఆర్‌కే శర్మ అండ్‌ శశి కె.గుప్తా, ప్రసన్న చంద్ర
‌* కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ - ఎంఎన్‌ అరోర (ఆబ్జెక్టివ్‌ బిట్స్‌), ఎస్‌పీ జైన్‌ అండ్‌ కేఎల్‌ నారంగ్‌ ‌
* ఆడిటింగ్‌- ఆర్‌జీ సక్సేనా, టీఎన్‌ టాండన్‌
‌* టాక్సేషన్‌- వీపీ గౌర్‌, రాజీవ్‌ పురి అండ్‌ పూజా గౌర్‌ ‌
* జీఎస్‌టీ (థియరీ అండ్‌ ఎంసీక్యూస్‌) - సీఏ రాజ్‌ కె. అగర్వాల్‌ అండ్‌ శివంగీ అగర్వాల్‌ ‌
* ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ - 2003- కమల్‌ పబ్లిషర్స్‌ ‌
* ఎకనామిక్స్‌ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ (ఫర్‌ ఇండస్ట్రియల్‌ యాక్ట్స్‌ డాక్టర్‌ టీఎన్‌ భాగోలివాల్‌ ‌
* జనరల్‌ ఇంగ్లిష్‌ - రెన్‌ అండ్‌ మార్టిన్‌ ‌
* హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ - శశి కె. గుప్తా అండ్‌ రోషిజోషి
తెలుగు మాధ్యమంలో
* అడ్వాన్స్‌డ్‌ అకౌంటెన్సీ, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌, ఆడిటింగ్‌: హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌: తెలుగు అకాడమీ అండ్‌ కళ్యాణి పబ్లికేషన్స్‌
* టాక్సేషన్‌ - హెచ్‌. ప్రేమ్‌రాజ్‌.
* తెలంగాణ ఉద్యమ చరిత్ర- ప్రొ. కోదండరామ్‌- తెలుగు అకాడమీ.
* జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ¨లపై ప్రామాణిక పుస్తకాలు

Back..

Posted on 18-04-2018