Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తక్కువ ఫీజులతో ప్రామాణిక విద్య!

ప్రపంచస్థాయి ప్రమాణాలతో బోధన, తక్కువ ఫీజులు, మెరుగైన వసతులతో ఉండే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదవడం అంటే ఒక బ్రాండ్‌ ఇమేజ్‌గా భావిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి ఆ అవకాశాన్ని కల్పిస్తూ హెచ్‌సీయూ ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారికే కాకుండా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారికి కూడా ఎన్నో కోర్సులను ఈ విఖ్యాత విశ్వవిద్యాలయం అందిస్తోంది.

ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్‌ పీజీ
ఇంటర్‌ పూర్తికాగానే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ విధానంలో అయిదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను పలు విభాగాల్లో ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. సాధారణ కళాశాలల్లో బోధించే డిగ్రీ కోర్సులకు హెచ్‌సీయూ ఇంటిగ్రేటెడ్‌ పీజీలకు నాణ్యతపరమైన వ్యత్యాసం ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు:
మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, ఎమ్మెస్సీ ఎర్త్‌ సైన్సెస్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఈ కోర్సు వ్యవధి ఆరేళ్లు).
అర్హత: కొన్ని కోర్సులకు సైన్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా ప్లస్‌ టూ ఉత్తీర్ణత. మరికొన్నింటికి పాసై ఉంటే చాలు.

కోర్సు: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత (ఆర్ట్స్‌, సైన్స్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు)

ఎంఏ (హ్యుమానిటీస్‌)
కోర్సులు: తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌.
అర్హత: ఈ మూడు కోర్సులకు ఇంటర్‌ ఏ గ్రూప్‌లోనైనా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌)
కోర్సు: ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ.
అర్హత: అన్ని సోషల్‌ సైన్సెస్‌ కోర్సులకు ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం
అన్ని ఇంటిగ్రేటెడ్‌ (ఎంఏ, ఎమ్మెస్సీ) కోర్సులకూ రాత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ అండ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వంద మార్కులకే ప్రశ్నపత్రం. పరీక్షలో సైకాలజీ (ఇంటర్‌ స్థాయి), ఇంగ్లిష్‌ భాష అవగాహనపై ప్రశ్నలుంటాయి.
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ హ్యుమానిటీస్‌ (తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్స్‌) కోర్సులకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మెరిట్‌ ప్రకారం అభ్యర్థి ఎంచుకున్న కోర్సులోకి ప్రవేశం లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ సోషల్‌ సైన్సెస్‌ (ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఉమ్మడి పరీక్ష ఉంటుంది. దీన్ని వంద మార్కులకు నిర్వహిస్తారు.

గ్రాడ్యుయేట్లకు!
కోర్సులు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌/ అప్లైడ్‌ మ్యాథ్స్‌, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ - ఆపరేషన్స్‌ రిసెర్చ్‌, ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ప్లాంట్‌ బయాలజీ అండ్‌ బయో టెక్నాలజీ, ఎమ్మెస్సీ మాలిక్యులర్‌ మైక్రో బయాలజీ, ఎమ్మెస్సీ యానిమల్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌), హెల్త్‌ సైకాలజీ, న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌, ఓషన్‌ అట్మాస్ఫీరిక్‌ సైన్సెస్‌
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కొన్ని కోర్సులకు 60 శాతం, మరికొన్ని కోర్సులకు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలోకి జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ -న్యూదిల్లీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి పరీక్ష (సీఈఈబీ) ద్వారా సీట్లు కేటాయిస్తారు.
కోర్సు: ఎంసీఏ.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. అయితే ఇంటర్‌ లో మ్యాథ్స్‌ తప్పనిసరిగా చదివి ఉండాలి. నిట్‌లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నిమ్‌సెట్‌లో సాధించిన స్కోర్‌తో భర్తీ చేస్తారు.

పలు విభాగాల్లో ప్రత్యేక కోర్సులు
ఇంగ్లిష్‌, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌, కంపారిటివ్‌ లిటరేచర్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌, సంస్కృతం, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌, ఎంఎడ్‌, కమ్యూనికేషన్లలో ఎంఏను అందిస్తోంది.
మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌: భరతనాట్యం, కూచిపూడి.
ఫైన్‌ ఆర్ట్స్‌: పెయింటింగ్‌, ప్రింట్‌ మేకింగ్‌, స్కల్ప్‌చర్‌, ఆర్ట్‌, హిస్టరీ అండ్‌ విజువల్‌ స్టడీస్‌. ఎంబీఏ: హెల్త్‌ కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌ మెంట్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌..
వీటితోపాటు పలు విభాగాల్లో పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎంటెక్‌ కోర్సులను కూడా హెచ్‌సీయూ అందిస్తోంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 5
వెబ్‌సైట్‌: www.uohyd.ac.in



Back..

Posted on 17-04-2018