ప్రస్తుత 2012-13 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ (వెబ్ ఆధారితం) ఆగస్టు 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఈ/ బీటెక్/ ఫార్మసీ కోర్సుల్లో (ఎంపీసీ విధానం) విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాబోయే ముందు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ ర్యాంక్ నుంచి ఎంత వరకు ఏ తేదీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు మొదలైన వివరాలు ఇలా ఉన్నాయి...
సర్టిఫికెట్ల తనిఖీ:
ఎంసెట్ - 2012లో అర్హులైన అభ్యర్థులు తమ ర్యాంక్ ఆధారంగా సర్టిఫికెట్ల తనిఖీ నిమిత్తం నిర్ణీత తేదీల్లో ఏదైనా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌కు హాజరు కావాలి.
హెల్ప్ లైన్ సెంటర్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు:
అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు (ఎంసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టిక్కెట్, ఇంటర్ మెమో- కమ్ - పాస్ సర్టిఫికెట్, టెన్త్ మార్క్స్ మెమో, 6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, జనవరి 1, 2012 తర్వాత జారీ చేసిన ఇన్‌కం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు, మైనారిటీ, పీహెచ్/ సీఏపీ/ ఎన్‌సీసీ/ స్పోర్ట్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్లు).
ఫీజు:
అభ్యర్థులు సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.600 (ఓసీ/ బీసీ), రూ.300 (ఎస్సీ, ఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థులకు కూడా వారి ర్యాంకుల ఆధారంగా ఆగస్టు 27 నుంచి సర్టిఫికెట్ల తనిఖీ జరుగుతుంది.
నోట్:
అభ్యర్థులు తమ పాస్‌వర్డ్‌ను, లాగ్ఇన్ ఐడీ నెంబర్‌ను, తనకు సంబంధించిన ఇతర ప్రాథమిక సమాచారాన్ని ఇతరులకు ఎక్కడా వెల్లడించకూడదు.

Detailed Web Based Counselling Notification

Instructions to Candidates (English)

అభ్యర్థులకు సూచనలు