ECE

EEE

Mech.

CSE

Civil

IT

EIE

Aeronautical

MME

Marine Engineering

Industrial Engg.


కృషి చేయాలి, కష్టపడాలి

 •  

  నిరంతరాయమైన లెక్చర్లు, ఎడతెగని హోమ్‌వర్క్‌, క్లిష్టమైన పరీక్షలు ఉన్నప్పటికీ ఇంజినీరింగ్‌ చదవడం సులభమే. ఉన్నతస్థాయిలో నిలవాలనుకుంటే కృషి, కఠినశ్రమ, సృజనాత్మక శక్తులతోనే సాధ్యమవుతుంది. సొంతంగా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ప్రొఫెసర్లు ప్రతిదీ అరటిపండు ఒలిచిపెట్టినట్టు బోధిస్తారని ఆశించకూడదు.
  సందేహాలను అడగడానికి భయపడాల్సిన అవసరం లేదు.

       తరగతుల్లో ఏదైనా సమస్య ఉన్నా/ ప్రొఫెసర్‌ బోర్డుపై రాస్తున్న సమీకరణాలు, వివరిస్తున్నదీ అర్థం కాకపోయినా మరొకసారి వివరించమని అడగొచ్చు. తరగతి పూర్తయిన తర్వాత/ మెటీరియల్‌, పుస్తకాల ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి చాలామంది అధ్యాపకులు సుముఖంగానే ఉంటారు.

       అర్థం కానివాటిని వివరించమని స్పష్టంగా అడగాలి. ఉదాహరణకు: 'ఈ సూత్రాన్ని ఎలా ఉపయోగించాలో ఉదాహరణతో చెప్పగలరా?'. మీ ప్రశ్న తెలివితక్కువదేమో అనిపించినా ఫర్లేదు, అడిగేయండి. మిగతా విద్యార్థులదీ అదే పరిస్థితి అయ్యుండొచ్చు. అయితే ఒకటి- మీ అంతట మీరు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా అధ్యాపకుడి సహాయం మాత్రం కోరకూడదు.

  విభిన్న పుస్తకాలను చదువుతుండాలి

             పాఠ్యాంశాల్లోని క్లిష్టతను తగ్గించడానికి కొన్ని పాఠ్యపుస్తకాలు ఉదాహరణలను వివరణతో సహా ఇస్తాయి. హోమ్‌వర్క్‌ లెక్కలు చేయడానికి కష్టంగా ఉంటే, పుస్తకంలో మాదిరి ఉదాహరణలను చూడొచ్చు. లేదా అదే సబ్జెక్టుకు సంబంధించిన వివిధ పుస్తకాలు, వెబ్‌సైట్లు వంటివి వెతకొచ్చు. అప్పటికీ మీకు కావాల్సిన వివరణ, ఉదాహరణలు దొరకకపోయినా, రెండు పుస్తకాల్లో ఒకే అంశాన్ని గురించి చదవడం వల్ల విషయం అవగాహన మెరుగవుతుంది. గ్రంథాలయంలో మీ కోర్సుకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ చదవండి. కాన్సెప్టులు, థియరీలపై సంపూర్ణ అవగాహనకు ఇది తోడ్పడుతుంది.

  ఇతర విద్యార్థులతో కలిసి పనిచేయాలి


  ఒంటరిగా చదువుకోవడం వల్ల ఎక్కడైనా అర్థం కానిది ఉంటే చదవటం అక్కడే ఆగిపోవచ్చు. దాన్ని వదిలేద్దామనే ఆలోచనా రావచ్చు. అదే- బృందంతో పనిచేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక దారి చూపించగలుగుతారు. సమస్య పరిష్కారానికి మీరు ఎంచుకున్న మార్గం కంటే మెరుగైనదాన్ని ఇతరులు చూపే అవకాశమూ ఉంటుంది.

  వివిధ రకాల ప్రాజెక్టుల్లో పాల్గొనాలి

  రోజువారీ పనులతో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి వీలున్న ప్రతి ప్రాజెక్టులోనూ పాల్గొనండి. ఇవి కళాశాలలో మీరు నేర్చుకున్న విషయ అనువర్తనకూ, ఉద్యోగమిచ్చేవారికి వివిధ రకాల ప్రాజెక్టుల్లో మీ అనుభవాన్ని చూపించడానికీ తోడ్పడతాయి.


  మంచి నెట్‌వర్క్‌ను రూపొందించుకోండి

            ఇంజినీరింగ్‌ ఒంటరిగా నిర్వహించే రంగం కాదు. దీనికి నాయకత్వం, కలిసి పనిచేయడం అవసరం. నెట్‌వర్క్‌ను కళాశాలలోనే రూపొందించుకోవడం ద్వారా కెరియర్‌ ప్రారంభంలో సహాయపడుతుంది. నెట్‌వర్క్‌ను రూపొందించుకోవాలంటే.. తోటి విద్యార్థులు, సీనియర్లు, ఉపాధ్యాయులతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవాలి. దీంతోపాటుగా సెమినార్లు, లెక్చర్లు, క్యాంపస్‌లో జరిగే కాన్ఫరెన్సులకు హాజరై ఉపన్యాసకులను పరిచయం చేసుకోవాలి. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఉందేమో తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమాలనూ వినియోగించుకోవాలి.  

  వేసవిలో ఇంటర్న్‌

  పరిజ్ఞానాన్ని నిలిపివుంచడానికి ప్రయోగాత్మక అనుభవం ఉపయోగపడుతుంది. కాబట్టి వేసవిలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సంస్థలు ప్రయోగాత్మక అనుభవం ఉన్నవారిని నియమించుకోవడానికి ఎల్లప్పుడూ సుముఖంగానే ఉంటాయి. ఈవిధంగా ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోను పెంచుకోండి. కొత్త సెమిస్టర్‌ కోసం తయారు కావడానికీ ఇంటర్నింగ్‌ తోడ్పడుతుంది.

  నైపుణ్యాలను మెరుగుపరచుకోండి

          ఇంజినీర్‌గా మీ రంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలంటే సాంకేతిక పరిజ్ఞానానికే పరిమితం కాకూడదు. తప్పకుండా అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు: మీ ఆలోచనలను ఉత్తమంగా గ్రాఫికల్‌గా ప్రదర్శించాలనుకుంటే విజువల్‌ డిజైనింగ్‌ కోర్సును ఎంచుకోవచ్చు. లేదా స్వల్పకాలిక మేనేజ్‌మెంట్‌ కోర్సు/ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవడం ద్వారా బిజినెస్‌పై ఎలా పట్టుసాధించాలో తెలుసుకోవచ్చు.

 • ఇంజినీరింగ్‌లో... తొలి మెలకువలు
 • పర్యవేక్షణ... క్రమశిక్షణ
 • ప్రయాణంలో సమయహరణం

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning