ECE

EEE

Mech.

CSE

Civil

IT

EIE

Aeronautical

MME

Marine Engineering

Industrial Engg.


పర్యవేక్షణ... క్రమశిక్షణ

  •  

    ఇంటర్‌ విద్యలా కాకుండా ఇంజినీరింగ్‌ స్వేచ్ఛాయుతమైనది. ఇక్కడ విద్యార్థులు స్వతహాగా, స్వతంత్రంగా తమ అభిరుచికి అనుగుణంగా కొంతవరకు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఇష్టమైన బ్రాంచిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత తాము ఏమి కావాలని అనుకుంటున్నారో అలా తమను మలచుకోవాల్సి ఉంటుంది.

         ఇంజినీరింగ్‌లో విద్యార్థులు ఒక విద్యావాతావరణం నుంచి మరో విద్యావాతావరణానికి మారుతున్నారనేది కీలకాంశం. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో చెడు వ్యసనాలకు అలవాటయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణ, తోడ్పాటు చాలా అవసరం. ఈ విధంగా క్రమశిక్షణతో మొదటి సంవత్సరంలో విద్య సాగితే నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌ పయనం సజావుగా, విజయవంతంగా ముగుస్తుంది. చివరి సంవత్సరంలో ఉద్యోగ సముపార్జన, లేదా ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన పటిష్ఠత సంపాదించుకోవాల్సివుంటుంది.

         కొందరు విద్యార్థులు కళాశాలలో ప్రవేశం పొందాక కొత్త స్నేహితులతో కలిసి, కొత్త అలవాట్లు నేర్చుకుని వివిధ రకాల ప్రలోభాలకు ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా మొదటి సంవత్సరం పరీక్షల్లో తక్కువ శాతం మార్కులతో ఉత్తీర్ణులవడమో, ఫెయిల్‌ అవడమో జరుగుతోంది. ఈ ప్రభావం మిగతా సెమిస్టర్లపై పడి వాటిపై దృష్టిసారించలేకపోతున్నారు. చివరకు తక్కువ పర్సంటేజీలతో పాసై ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్య కోసం విదేశాల నుంచి వీసా పొందడంలో విఫలమవుతున్నారు. ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి.

               క్రమం తప్పకుండా తరగతులకు, ప్రయోగశాలలకు హాజరై విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తమ సబ్జెక్టుల మీద అవగాహన పెంచుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులవడం ఎంతో అవసరం. విద్యా సంబంధ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, క్రీడల్లో పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్నీ పెంపొందించుకోవాలి.

  • ఇంజినీరింగ్‌లో... తొలి మెలకువలు
  • కృషి చేయాలి, కష్టపడాలి
  • ప్రయాణంలో సమయహరణం

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning