ECE

EEE

Mech.

CSE

Civil

IT

EIE

Aeronautical

MME

Marine Engineering

Industrial Engg.


ప్రయాణంలో సమయహరణం

  •  

    ఇంజినీరింగ్‌ నాలుగేళ్ళూ వసతిగృహాల్లో (హాస్టళ్ళు) ఉండటం ఎన్నో రకాలుగా ప్రయోజనకరం. ఇదెంత వాస్తవమో ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో, విశ్వవిద్యాలయ కళాశాలల్లోని విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఈ రోజుల్లో దాదాపు 85 శాతం మంది డే స్కాలర్లుగా ఉంటున్నారు. ఇంటికీ- కళాశాల రాకపోకల కోసమని బస్సుల్లో ప్రయాణించడంలోనే 3-4 గంటల సమయం హరించుకుపోతోంది. దీంతో అధ్యయనానికి రోజుకు 3-4 గంటలకు మించి వ్యవధి వారికి చిక్కటం లేదు.

    * హాస్టళ్ళలో ఉండటం వల్ల డే స్కాలర్లకంటే రెట్టింపు సమయం చదువుకోవటానికి వీలవుతుంది.

    * డే స్కాలర్లకు ప్రయాణంలో వచ్చే అవాంతరాల వల్ల మొదటి గంట తరగతిని కోల్పోవటం తరచూ జరుగుతుంటుంది. హాస్టల్లో ఉండేవారికి ఈ సమస్య ఉత్పన్నం కాదు.

    * చాలా ముఖ్యమైన అంశం- హాస్టల్లో సీనియర్లు, సూపర్‌ సీనియర్లతో కలిసివుండే అవకాశం! ఉద్యోగవేటలో వారి సహకారం ఎంతో ఉపయోగకరం. సీనియర్లు జూనియర్ల పేర్లను రిఫర్‌ చేయటం ద్వారా వారి ఉపాధికి సహకారం అందిస్తుంటారు. డే స్కాలర్లకు ఈ సదుపాయం తక్కువ.

    * చాలా కళాశాలల్లో గ్రంథాలయం, ఇంటర్నెట్‌ కేంద్రం, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ లాబ్‌ మొదలైనవి రాత్రివరకూ నిర్వహిస్తుంటారు. డే స్కాలర్లు హాస్టల్లో ఉండేవారి మాదిరిగా ఈ సదుపాయాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేరు.

    * కళాశాల ముగిసిన తర్వాత నిర్వహించే అదనపు (రెమెడియల్‌) తరగతులకు హాజరుకావాలని ఉన్నా 'బస్సు వెళ్ళిపోతుంద'నే సమస్యతో వాటిని ఉపయోగించుకోలేని డే స్కాలర్లు చాలామంది ఉంటారు.

    * నిపుణుల ప్రసంగాలు చాలావరకూ కళాశాల వేళల తర్వాత కొనసాగుతుంటాయి. హాస్టల్లో ఉండేవారు వీటికి నిశ్చింతగా హాజరవుతూ సద్వినియోగం చేసుకోగలుగుతారు.

    * పట్టణ, నగర విద్యార్థులకు ఆసక్తి ఉన్నా క్రీడలూ, ఆటలకు సమయం ఉండదు. హాస్టల్లో ఉంటే వాటిలో పాల్గొనటానికి ఎంతో అవకాశం.

    * హాస్టళ్ళలో ఫొటోగ్రఫీ క్లబ్‌, పెయింటింగ్‌ క్లబ్‌, కామిక్స్‌ క్లబ్‌ లాంటివి ఉంటాయి. అక్కడ ఉండేవారు వీటిలో పాల్గొంటూ తమ ఆసక్తులకు పదునుపెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. హాస్టళ్లలో ప్రతికూల అంశాలు లేకపోలేదు. కానీ వాటి ఉపయోగాలతో పోలిస్తే అవి స్వల్పమే.

  • ఇంజినీరింగ్‌లో... తొలి మెలకువలు
  • కృషి చేయాలి, కష్టపడాలి
  • పర్యవేక్షణ... క్రమశిక్షణ

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning