వెబ్‌లో ఉచితం.... వెయ్యండి గాలం!

 • * మైక్రోసాఫ్ట్ విండోస్ కొనాలంటే.. రూ.6,000
  * అడోబ్ ప్రీమియర్ కొంటే... రూ.6,390
  * ఎమ్మెస్ ఆఫీస్... కొనుగోలు చేస్తే... రూ.5,499

  * అడోబ్ పేజీమేకర్... కావాలంటే... రూ.30,650
  * మొత్తం దాదాపు లక్షపై మాటే! మరి, వీటికి ప్రత్యామ్నాయం వాడితే! ఆ లక్ష ఆదా చేసినట్టే కదా!
       కొత్త సిస్టం కొంటాం. ఉచితంగా ఇస్తున్నారు కదాని పైరేటెడ్ ఓఎస్‌ని వాడతాం. దీంతో పీసీ అప్‌డేట్ అవ్వదు. కుప్పలుగా వైరస్‌లు వచ్చి కూర్చుంటాయి. దీంతో వేలు పోసి కొన్న కంప్యూటర్ కాస్తా నత్త నడకన పని చేస్తుంది.

  ఇక్కడ సాధారణ పీసీ వినియోగదారుడు తెలిసీ తెలియక రెండు తప్పులు చేస్తున్నారన్నమాట. ఒకటి... పైరేటెడ్ ఓఎస్ వాడడం.. రెండు... ఓపెన్ సోర్స్ ద్వారా నెట్టింట్లో ఉచితంగా అందుబాటులో ఉన్న వాటి గురించి తెలుసుకోకపోవడం... అందుకే పీసీని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఒక్కసారి అవేంటో తెలుసుకుంటే డబ్బు ఆదాతో పాటు అధికారికంగా అందుబాటులో ఉన్న వాటిని మాత్రమే వాడుకునేందుకు ఉన్న వేదికలేంటో తెలుస్తాయి. ఆయా ఉచిత మార్గాలెంటో వివరంగా తెలుసుకుందాం!
  ముందుగా ఓఎస్...
       పీసీ, ల్యాపీ, నోట్‌బుక్... లాంటివి కొనేప్పుడు ఇన్‌బిల్ట్‌గా ఓఎస్ ఉందా? లేదా? అనే విషయాన్ని తప్పని సరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటి అవసరాలకు కంప్యూటర్‌ని తీసుకుంటే 'విండోస్ 7 హోం బేసిక్' వెర్షన్ ఉండేలా చూసుకోవాలి. మల్టీటచ్, విండోస్ మీడియా సెంటర్, విండోస్ ఎక్స్‌పీ మోడ్... లాంటి అదనపు సౌకర్యాలు హోం బేసిక్ వెర్షన్‌లో ఉండవు. 'విండోస్ 7 హోం ప్రీమియం' వెర్షన్‌లో మాత్రమే ఉంటాయి. ప్రీమియం వెర్షన్ ధర సుమారు రూ.12,999. ఓఎస్‌ని కొనుగోలు చేసి పీసీని సురక్షితంగా వాడుకోవాలంటే ఇవి తప్పని సరి. ఏం అక్కర్లేదు... పైరేట్ వెర్షన్స్ వాడదాం అనుకుంటే వేలు పోసి కొన్న పీసీని మీ చేతులతో మీరే హ్యాకర్ చేతిలో పెట్టినట్టే. మరైతే పైసా ఖర్చులేకుండా ఓఎస్‌ని వాడడం ఎలా?

  ఇదిగో ప్రత్యామ్నాయం

       UBUNTU ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ నుంచి వెలువడిన ఓఎస్. లినక్స్ పునాదిపైన ప్రాణం పోసుకుని పాపులర్ అయ్యింది. సీసీ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ తక్కువ ఉన్నా ఓఎస్‌ని పూర్తిస్థాయిలో వాడుకోవచ్చు. డెస్క్‌టాప్, ల్యాపీ, ఫోన్, ట్యాబ్లెట్ వాడుతున్న పరికరం ఏదైనా ఉచితంగా ఓఎస్‌ని నిక్షిప్తం చేసుకుని వాడొచ్చు. వైరస్‌ల దాడిని చాలా వరకూ నిర్మూలించొచ్చు. యూఎస్‌బీ డ్రైవ్, డీవీడీల నుంచే రన్ చేసుకుని ఉబుంటుని వాడొచ్చు. ఓఎస్‌లో ఇన్‌బిల్ట్‌గా డాక్యుమెంట్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లు, ఛాట్ క్త్లెంట్, ఈమెయిల్ క్త్లెంట్, మల్టీమీడియా ప్లేయర్... లాంటి టూల్స్‌ని నిక్షిప్తం చేశారు. ఎక్కువగా ఆదరణ పొందిన Skype, Audacity, GIMP, Google Chrome... లాంటి మరిన్ని అప్లికేషన్లను కూడా ్య్జ్య్థ్మ్యలో పొందొచ్చు. విద్యార్థులకు ఉపయోగపడే 'ఎడ్యుకేషనల్ ఆప్స్', గేమ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే లేటెస్ట్ వెర్షన్ని www.ubuntu.com లోకి వెళ్లండి.

  ఫొటోలకు ప్రత్యేకం...
       సందర్భం ఏదైనా క్లిక్ చేసిన ఫొటోలను సిస్టంలో కాపీ చేసేస్తాం. తర్వాత వాటిని ఎడిట్ చేసుకోవాలనుకుంటాం. వెంటనే గుర్తొచ్చేది 'అడోబ్ ఫొటోషాప్'. ఎప్పటికప్పుడు ఆధునిక సౌకర్యాల్ని అందిస్తూ వెర్షన్లు మార్చుకుంటోంది. Styles, Vector layers, tilt shift effects, HDR Editing... ఇలా చెప్పాలంటే చాలానే సౌకర్యాలు. కెమెరాలోని ఫొటోలను సరాసరి ఫొటోషాప్‌లో ఓపెన్ చేసుకుని ఎడిటింగ్ ప్రక్రియ చేపట్టవచ్చు. కానీ, ఇది ఖర్చుతో కూడుకున్న విషయం. అవసరాన్ని బట్టి కొనాలా? ఉచితంగా అందుబాటులో ఉన్నవి వాడాలా? అనేది మీ ఇష్టం. ఒకవేళ పైరేట్ వెర్షన్లు వాడితే అప్‌డేట్స్‌ని జత చేసుకోవడానికి వీలుండదు. మాలిషియస్ ఫైల్స్‌ని సిస్టంలోకి ప్రవేశించే వీలుంటుంది.

  ప్రత్యామ్నాయం
       GIMP. ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్‌కి బదులుగా దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ నుంచి అధికారికంగా అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు కమ్యూనిటీ విడుదల చేసే అప్‌డేట్ వెర్షన్లు సాఫ్ట్‌వేర్‌కి జత చేయవచ్చు. Layers, Channel Mixer, Clone, Healing Tools... లాంటి ఇతర ఆప్షన్లతో ఫొటోలను ఆకట్టుకునేలా మార్పులు చేయవచ్చు. Tiff, Psd, PNG ఫైల్స్‌ని సపోర్ట్ చేస్తుంది. విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్‌ల్లో ఏది వాడుతున్నా అప్లికేషన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. వాడాలనుకుంటే www.gimp.org లింక్‌ని చూడండి.
  * మరోటి PHOXO. మిని ఫొటోషాప్‌గా దీన్ని పిలుస్తున్నారు. తక్కువ మెమొరీ ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. www.phoxo.com
  * మరోటి ప్రయత్నించాలనుకుంటే PAINT.NET టూల్‌ని ప్రయత్నించొచ్చు. www.getpaint.net
  * డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ అవేం లేకుండా ఆన్‌లైన్‌లోనే 'అడోబ్ ఫొటోషాప్'ని వాడుకోవచ్చు. బేసిక్ ఎడిటింగ్ టూల్స్‌ని ఉచితంగా అందిస్తోంది. www.photoshop.com/tools లింక్‌లోకి వెళ్లండి.
  ఆఫీస్ అడ్డా
       ప్రతి ఒక్కరి పీసీలో ఉండాల్సిన సాఫ్ట్‌వేర్ ఏదైనా ఉందంటే కచ్చితంగా అది 'ఎమ్మెస్ ఆఫీస్'. ఇంటి అవసరాలకు, విద్యార్ధులకు ప్రత్యేక వెర్షన్ని అందిస్తున్నారు. అదే 'హోం అండ్ స్టూడెంట్ వెర్షన్'. వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ ప్రజంటేషన్, ఇన్‌నోట్‌లను దీంట్లో పొందొచ్చు. 7జీబీ స్కైడ్రైవ్ స్పేస్‌ని కూడా అందిస్తున్నారు. ఒకవేళ మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ క్త్లెంట్‌తో ఆఫీస్ సూట్‌ని కావాలంటే 'ఆఫీస్ హోం, బిజినెస్' ఎడిషన్‌ని కొనాల్సిందే. ఇలా కాకుండా అనధికారిక ఆఫీస్ టూల్స్‌ని వాడడం ఏ మాత్రం సరైంది కాదు.
  ప్రత్యామ్నాయం
       OPEN OFFICE వేలు పోసి కొనేంత తాహతు మీకు తేకపోతే ఆఫీస్ అవసరాలకు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. ఒక్కసారి డౌన్‌లోడ్ చేస్తే ఎన్ని పీసీల్లోనయినా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఎమ్మెస్ ఆఫీస్‌లో మాదిరిగానే వర్డ్, స్ప్రెడ్‌షీట్స్, ప్రెజంటేషన్, డేటాబేస్ ఎడిటర్...టూల్స్‌ని గుత్తగా ఒకేచోట పొందొచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫార్మెట్‌ల్లోనే ఫైల్స్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఎమ్మెస్ ఆఫీస్‌లో క్రియేట్ చేసిన వాటిని ఎలాంటి ఆటంకం లేకుండా ఓపెన్ ఆఫీస్‌లోనూ యాక్సెస్ చేయవచ్చు. అధికారిక వెర్షన్ కావడంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని డౌన్‌లోడ్ చేసి యాడ్ చేసుకునే వీలుంది. కావాలంటే www.openoffice.org లోకి వెళ్లండి.
  * ఇలాంటిదే మరోటి LibreOffice ఆఫీస్ మాదిరిగానే దీన్ని ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. పీసీ, ట్యాబ్, మ్యాక్, మొబైళ్లలోనూ తగిన వెర్షన్లు అందిస్తున్నారు. www.libreoffice.org
  * SSuite. ఆఫీస్‌కి అదనంగా మరిన్ని ఉన్నాయి. www.ssuitesoft.com
  వీడియో ఎడిటింగా?
       పీసీల్లో చేసే ముఖ్యమైన పనుల్లో వీడియో ఎడిటింగ్ ఒకటి. పండక్కో... మరేదైనా శుభాకార్యానికో తీసుకున్న వీడియోని కావాల్సినట్టుగా ఎడిట్ చేయడానికి ప్రొఫెషనల్స్ 'అడోబ్ ప్రిమియర్' అప్లికేషన్ని వాడతారు. హోం వీడియోలను ఎడిట్ చేసేందుకు ఇదో ప్రధాన వారధి. వివిధ రకాల ఎడిటింగ్ స్త్టెల్స్‌తో వీడియోకి హాలీవుడ్ హంగుల్ని అద్దొచ్చు. దీంట్లో ఎడిట్ చేసిన వాటిని youtube, Vimeo లాంటి వీడియో సర్వీసుల్లోకి సులభంగా అప్‌లోడ్ చేసి షేర్ చేయవచ్చు. అడోబ్ అధికారిక సైట్ నుంచి కొనుగోలు చేసి వాడొచ్చు.
  ప్రత్యామ్నాయం
       LIGHTWORKS. ఫ్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌గా వీడియోలకు మరిన్ని అదనపు హంగులు అద్దొచ్చు. అదీ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని. హెచ్‌డీ వీడియో ఎడిటింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. టూల్‌ని వాడేందుకు అనువైన 'టుటోరియల్ వీడియోలను' సైట్‌లో చూడొచ్చు. ప్రీమియం వెర్షన్‌లోకి మారితే 3డీ సపోర్ట్ చేస్తుంది. కావాలంటే www.lwks.com లింక్‌లోకి వెళ్లండి.
  * ఇలాంటిదే మరోటి ezvid. చిత్రీకరించిన వీడియోలను ఎడిట్ చేసి యూట్యూబ్‌లో షేర్ చేసేందుకు అనువైన వేదిక. www.ezvid.com
  * విండోస్ అందించే మూవీ మేకర్ కావాలంటే అధికారిక సైట్ నుంచి Windows Movie Maker పొందొచ్చు. వాడుతున్న ఓఎస్ ఆధారంగా సెట్అప్ ఫైల్స్ ఉన్నాయి. http://goo.gl/uM4u4r
  * ఓపెన్‌సోర్స్ అందించే మరో వీడియో ఎడిటింగ్ టూల్ VirtualDub. కావాలంటే http://goo.gl/-AwB8-BD లింక్‌లోకి వెళ్లండి.

  డీటీపీ కోసం...
       పుస్తకాలు, వ్యాపార బ్రోచర్, విజిటింగ్ కార్డులు... ఒకటేమిటి అన్నింటికీ వాడే కమర్షియల్ టూల్స్ 'అడోబ్ పేజీమేకర్', 'మైక్రోసాఫ్ట్ పబ్లిషర్'. వ్యాపారం, ఉద్యోగం, ఇంటి అవసరాలకు సంబంధించిన పనుల్ని డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ద్వారా పూర్తి చేయవచ్చు. నాణ్యతతో కూడిన కరపత్రాల్ని డిజైన్ చేయవచ్చు.
  ప్రత్యామ్నాయం
       Scribus. ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సులభమైన ఇంటర్ఫేస్‌తో పేజీ లేఅవుట్స్‌ని డిజైన్ చేసుకుని బుక్ పబ్లిషింగ్ చేయవచ్చు. అధికారిక సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని అందిస్తున్నారు. www.scribus.net వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు.
  * PagePlus. డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో డిజైనింగ్ చేయవచ్చు. ఇన్‌బిల్ట్ పేజీ లేఅవుట్స్ సిద్ధంగా ఉంటాయి. http://goo.gl/V67D5U
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning