22 వేల మందికి ఉద్యోగ అవకాశాలు!

* ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ ఎస్‌.డి.శిబులాల్‌

బెంగళూరు : ప్రస్తుత ఏడాదిలో 22,000 మందికి ఉద్యోగాలిచ్చే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ ఎస్‌.డి.శిబులాల్‌ తెలిపారు. ఇన్ఫోసిస్‌ కంపెనీ 2013-14 నాలుగో త్రైమాసిక, పూర్తి ఏడాది ఫలితాలను ఏప్రిల్ 15న ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి స్థూలంగా 39,985 మందికి, చివరి త్రైమాసికానికి 10,997 మందికి కంపెనీ ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో ఇన్ఫోసిస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,60,405 మందికి చేరింది.
ఉద్యోగులకు వేతనాల పెంపు
గత తొమ్మిది నెలల్లో వేతనాలు పెంచడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చే విధంగా దేశంలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలను 6-7 శాతం, ఖాతాదారు వద్ద (ఆన్‌సైట్‌) పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలను 1-2 శాతం పెంచినట్లు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ రాజీవ్‌ బన్సాల్‌ తెలిపారు. 9 నెలల్లో వేతన పెంపు రెండోసారని, తొమ్మిది నెలల క్రితం విదేశాల్లో ఖాతాదారుల వద్ద పని చేస్తున్న ఉద్యోగుల వేతనాన్ని 6-8 శాతం పెంచామని, పెరుగుతున్న వలసల రేటును తగ్గించడానికి, ఉద్యోగుల్లో నైతిక విశ్వాసాన్ని పెంచడానికి కంపెనీ వేతనాలు పెంచడంతోపాటు తరచూ పదోన్నతులను ప్రకటిస్తోంది. దీంతోపాటు సత్తా లేని వారిని బయటకు పంపే ప్రయత్నం కూడా చేస్తోంది. అక్టోబరు నుంచి దాదాపు 12,500 మందికి కంపెనీ పదోన్నతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ సగటున వేతనాలను 8 శాతం పెంచింది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning