అబ్బురపరచిన ప్రాజెక్టుల నమూనాలు

దుర్గాపురం(భీమవరం విద్యావిభాగం), న్యూస్‌టుడే: సౌరశక్తితో వ్యవసాయం చేస్తే... ఎవరి సహాయం లేకుండానే వీధిదీపాలు వాటంతటవే వెలిగి ఆరిపోతే... వాటర్‌ ట్యాంక్‌లో నీరు నిండిన తర్వాత తెలియలాంటే... వంటి అబ్బురపరిచే మినీ ప్రాజెక్టులను తయారు చేశారు ఇంజినీరింగ్‌ విద్యార్థినులు. భీమవరంలోని విష్ణు మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇల్యుమనరిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న మినీ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నేటి సమాజానికి అనుగుణంగా తమ ఆలోచన శక్తితో విద్యార్థినులు రూపకల్పన చేసిన పలు ప్రాజెక్టులను పరిశీలిస్తే...
* వాటర్‌ ట్యాంకు నిండితే
పరికరం పేరు: నీటిప్రవాహం, పరిమాణాన్ని సూచించే పరికరం
తయారు చేసిన విద్యార్థినులు: ఎస్‌.సాయిసేవిత, ఎం.సాయిప్రసన్న, ఎం.మానస, వై.లక్ష్మీదుర్గ, ఎస్‌కేషర్మిలా, ఎన్‌.మౌనిక.
ఉపయోగించిన పరికరాలు: బీసీ 547 (ట్రానిస్టర్లు), రెసిస్టర్లు(330 ఓమ్‌), ధ్వనిపరికరం(బజర్‌) వైర్లు.
పనిచేసే విధానం: వైర్లు వ్యాటర్‌ ట్యాంక్‌కు విభిన్న ఎత్తులో అమర్చి ఎల్‌ఈడీలను అనుసంధానం చేశారు. వ్యాటర్‌ ట్యాంక్‌లో నీరు నిండుకున్న స్థాయిని బట్టి ఆ ఎల్‌ఈడీ వెలుగుతుంది. వ్యాటర్‌ ట్యాంక్‌ పూర్తిగా నిండుకుంటున్నప్పుడు ధ్వని పరికరం ద్వారా హారన్‌ మోగేలా విద్యార్థినులు ప్రాజెక్టును రూపొందించారు.


* సౌరశక్తి విద్యుత్తుతో వ్యవసాయం
పరికరం పేరు: సోలార్‌ విద్యుత్తు ఆధారిత వ్యవసాయం.
తయారు చేసిన విద్యార్థినులు: వి.మేఘనాదీప్తి, యు.నాగసత్యదేవి, ఆర్‌.రమాదేవి, వి.కావ్యశ్రీ, పి.కుశల, టి.భాగ్యలక్ష్మి.
ఉపయోగించిన వస్తువులు: సోలార్‌ ప్యానెల్‌, బ్యాటరీ, మోటార్‌, చక్రాలు, వైర్లు.
పనిచేసే విధానం: సోలార్‌ ప్యానెల్‌ ద్వారా గ్రహించబడిన సౌరశక్తి బ్యాటరీలతో నిక్షిప్తమవుతుంది. ఆ బ్యాటరీ ద్వారా అనుసంధానం చేసిన మోటార్‌ ద్వారా చక్రాలు తిరిగి నీరు పల్లం నుంచి తోడి పొలాలకు పంపిణీ చేయవచ్చు. అలాగే చక్రాలను మార్చడం ద్వారా పొలంలో నిలిచిన నీటిని కూడా తోడి కాల్వలోనికి పంపవచ్చని విద్యార్థినులు ప్రాజెక్టు ద్వారా వివరించారు.


* వీధి దీపాలు వాటంతట అవే...
పరికరం పేరు: స్వయం ప్రకాశక వీధిదీపాలు.
తయారు చేసిన విద్యార్థినులు: జి.అనూష, ఎ.మౌనిక, ఎ.డి.ఎన్‌.ప్రియ, ఎం.కృష్ణప్రియ, ఎ.కావ్య.
ఉపయోగించిన వస్తువులు: డయోడ్‌లు, ట్రాన్సిస్టర్లు, సెన్సార్లు, రెసిస్టర్లు, ఎల్‌ఈడీలు, బ్యాటరీ, బల్బులు.
పనిచేసే విధానం: సెన్సర్లు, అమర్చడం ద్వారా సాయంత్రం సమయాల్లో చీకటిని గమనించి స్వయంగా దీనికి అమర్చబడిన బల్బులు వెలుగుతాయి. అదేవిధంగా ఉదయం అవగానే సెన్సర్లు వెలుగును గుర్తించి దీపాలను ఆపివేస్తాయి.


* ఇంట్లో చల్లదనానికి
పేరు: గృహశీతలీకరణ పరికరం
తయారు చేసిన విద్యార్థినులు: ఎన్‌.సంధ్య, సౌందర్య, ఎం.ఉమాదేవి, మౌనిక.
ఉపయోగించిన పరికరాలు: సింగిల్‌ ఫేస్‌ ఏసీ మోటారు, కేపాసిటర్‌ స్టార్‌ రన్నర్‌ మోటార్‌, ప్లాస్టిక్‌ ఫ్యాన్‌, బక్కెట్‌ వంటి చిన్న పరికరాలను వినియోగించారు.
పనిచేసే విధానం: ఒక బక్కెట్‌లో మంచినీరు తీసుకుని దానిపై మోటార్‌ అమర్చి ఆ మోటారు షాప్ట్‌కు ఫ్యాన్‌ అమర్చడం వల్ల బక్కెట్‌ చుట్టుపక్కల అమర్చిన ప్లాస్టిక్‌ గొట్టాల ద్వారా చల్లని గాలి బయటకు వస్తుంది. ఇలా ఒక గదిలో శీతలీకరణ చేయవచ్చని విద్యార్థులు మినీ ప్రాజెక్టు ద్వారా వివరించారు. దీన్ని కావాల్సిన విధంగా గదిలో టేబుల్‌పై అమర్చుకోవచ్చని విద్యార్థినులు పేర్కొంటున్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning