జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్ పరీక్షలు వాయిదా

కాకినాడ(బాలాజీచెరువు), న్యూస్‌టుడే: సీమాంధ్రలో మే 7న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కారణంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం ఉపకులపతి తులసీరామ్‌దాస్ పేర్కొన్నారు. ఏప్రిల్ 24న ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. మే 6 నుంచి మే 18 వరకు జరగాల్సిన అన్నీ పరీక్షలు వాయిదాపడ్డాయన్నారు. బీటెక్ పరీక్షలు మే 19 నుంచి నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌లో బీటెక్ ఇంజినీరింగ్ విద్యార్థులు వెబ్‌కాస్టింగ్‌లో విధులు నిర్వహించడం, కళాశాలలను కౌంటింగ్ సెంటర్లుగా వినియోగించడం వల్ల ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేశామన్నారు. సమావేశంలో జేఎన్‌టీయూకే డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డాక్టర్ సాయిబాబు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో బీటెక్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశామన్నారు. మే 19 నుంచి పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జూన్ మొదటి వారానికి బీటెక్ ఆఖరిసంవత్సరం విద్యార్థులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. వీరు ఉన్నతవిద్యలో ప్రవేశాలకు, ఉద్యోగాలలో ప్రవేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సాయిబాబు వివరించారు.
* మే నెలాఖరులో స్నాతకోత్సవం
మే నెలాఖరులో జేఎన్‌టీయూకే నాలుగో స్నాతకోత్సవాన్ని నిర్వహించే అవకాశాలున్నట్లు వర్సిటీ వీసీ తులసీరామ్‌దాస్ తెలిపారు. ఏర్పాట్లపై సమాలోచనలు చేస్తున్నామన్నామని ఆయన వెల్లడించారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning