ఆన్‌లైన్‌ కోర్సులు... ఇవిగోండి అడ్డాలు!

ఖాళీగా ఉండడం దేనికి?ఆన్‌లైన్‌లో ఏదైనా కోర్సు చేస్తే!
ఇవిగో అందుకు మార్గాలు...
లాగిన్‌ అయ్యి ఎంపిక చేసుకోండి!
కొన్ని కోర్సులు ఉచితం కూడా!
కొన్నింటిలో సర్టిఫికెట్‌ ఇస్తున్నారు...
ఒక్కోదాంట్లో ఒక్కోరకం టీచింగ్‌ స్త్టెల్‌!
అన్నీ గమనించాకే కోర్సులో చేరండి!

* www.udemy.com
మీకు ఆసక్తికరమైన రంగాన్ని ఎంపిక చేసుకుని కోర్సులు బ్రౌజ్‌ చేసి వెతకొచ్చు. ఉదాహరణకు మీరు సంగీత ప్రియులైతే 'మ్యూజిక్‌' విభాగంలోకి వెళ్లి కోర్సుల్ని బ్రౌజ్‌ చేయండి. గిటార్‌ నేర్చుకుందాం అనుకుంటే Beginnerకోర్సులు చాలానే ఉన్నాయి. పియానో, కర్నాటిక్‌ మ్యూజిక్‌లను కూడా నేర్చుకోవచ్చు. అన్ని కోర్సుల్ని బ్రౌజ్‌ చేసేందుకు సైట్‌ హోం పేజీలోని Course Categories మెనూలోకి వెళ్లండి. Photography and Art Courses మెనూలోకి వెళ్లి ఫొటోగ్రఫీ కూడా నేర్చుకోవచ్చు.

* www.coursera.org
కోర్సులు నేర్చుకోవడమే కాదు. సర్టిఫికెట్‌ కూడా పొందొచ్చు. కాకపోతే పూర్తి స్థాయి విద్యార్థులా కష్టపడి చదవాల్సిందే. హోం పేజీలోని Courses, Specializations మెనూల్లోకి వెళ్లి కోర్సుల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. భాషని ఎంపిక చేసుకుని కోర్సు వివరాల్ని చెక్‌ చేసుకోవచ్చు.

* www.udacity.com
మీకు ఉన్న తీరిక సమయం ఆధారంగా కోర్సుల్ని బ్రౌజ్‌ చేసుకుని చదువుకోవచ్చు. హోం పేజీలోని Course Catalog మెనూలోకి వెళ్లి అందిస్తున్న కోర్సుల్ని చూడొచ్చు. Videos, Exercises, Personalized support ద్వారా క్లాస్‌లు ఉంటాయి.

* www.edx.org
కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, రోబోటిక్స్‌... లాంటి కోర్సులు హోం పేజీలో కనిపిస్తాయి. ఏయే విశ్వవిద్యాలయాలు కోర్సుల్ని ఆఫర్‌ చేస్తూన్నాయో కూడా చూడొచ్చు. హోం పేజీలోని Courses మెనూలోకి వెళ్లి మరిన్ని కోర్సులను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.

* www.khanacademy.org
ఇదో విజ్ఞాన భాండాగారం. నెలకో 10 మిలియన్ల విద్యార్థులు ఈ ఆన్‌లైన్‌ వారధిని సందర్శిస్తున్నారు. ఎలాంటి రుసుము చెల్లించకుండానే దీంట్లోని కోర్సుల్ని పూర్తి చేయవచ్చు. మీరు వాడుతున్న జీమెయిల్‌, ఫేస్‌బుక్‌ ఐడీలతో లాగిన్‌ అవ్వొచ్చు. హోం పేజీలోని Learnమెనూలోకి వెళ్లి అందుబాటులో ఉన్న పాఠ్యాంశాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning