ఇప్పటికీ ఐటీనే మేటి!

* టీనేజీ తొలి ప్రాధాన్యం ఆ రంగానికే
* ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఎంతో ఇష్టం
* ఇంటర్‌నెట్‌ బ్రౌజింగ్‌కు అధిక సమయం
* ఆవిష్కృతమైన నగర యువత అంతరంగం
ఎన్ని ఒత్తిడులు.. ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా సరే ఇప్పటికీ ఐటీ ఉద్యోగమంటే యువత ఎక్కువ మక్కువ చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన పరిస్థితుల్లో ఈ రంగానికి కొంతవరకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. పెద్ద పెద్ద కంపెనీలే కొత్త ఉద్యోగులను తీసుకోవడం మానేశాయి. చిన్నా చితక కంపెనీలు మూతపడ్డాయి. వీటన్నింటినీ యువత పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఐటీ ఉద్యోగానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. మెట్రో, మినీ మెట్రో నగరాల్లోనూ యువత ఐటీనే కోరుతున్నారు. హైదరాబాద్‌లోనూ ఇందుకు భిన్నంగా లేదు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఆ రంగంలో ఉండటం.. అయిందెకల జీతాలు.. విలాసవంతమైన జీవితం.. వారాంతపు సరదాలు.. వీటి ముందు వృత్తిపరమైన ఒత్తిడికి యువత పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఐటీ ఉద్యోగం కోసం యువత కలలు కంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌తోపాటు 13 మెట్రో నగరాల్లో టీసీఎస్ సర్వేలో తేలిన నిజాలివి. 12-18 ఏళ్ల వయస్సు ఉన్న దాదాపు 18,196 ఉన్నత పాఠశాలల విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో యువత తమ ఇష్టాఇష్టాలను వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం...
నోట్: పట్టికల్లోని అంకెలన్నీ శాతాల్లో
ఉపాధి కోసం ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
ఉన్నత విద్య తర్వాత ఐటీలో చేరతామని ఇండియా మొత్తంలో 36.58 శాతం మంది ఆసక్తి చూపితే... అదే హైదరాబాద్‌లో 26.98 శాతం మంది ఐటీకి ఓటేశారు. మరో 12.56 శాతం మంది ఇంజినీర్లు అవుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగంపై దేశవ్యాప్తంగా 5.03 శాతం ఆసక్తి చూపితే.. భాగ్యనగరంలో 1.97 శాతం మందే ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

ఉపాధి రంగం ఇండియా మెట్రో మినీమెట్రో హైదరాబాద్
ఐటీ 36.58 32.73 40.42 26.98
ఇంజనీరింగ్ 20.24 20.98 19.50 12.56
మీడియా/ఎంటర్‌టైన్‌మెంట్ 9.85 12.43 7.28 6.89
మెడిసిన్ 9.38 7.35 11.40 4.20
బ్యాంకింగ్/ఆర్థిక 5.22 5.30 5.14 3.25
ప్రభుత్వ ఉద్యోగం 5.03 3.84 6.22 1.97
పర్యాటకం/ఆతిథ్య రంగం 3.30 3.15 3.46 2.16
రిటైల్ 1.26 0.75 1.77 0.40
ఇతర/చెప్పలేం 6.59 1.43 11.74 0.56
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారా?
నగరంలో దాదాపు 83.39 శాతం యువత ఆన్‌లైన్ షాపింగ్‌కే ఓటేస్తున్నారు. దేశ సగటు కంటే ఇది దాదాపు 15 శాతం ఎక్కువ. ఇంటి దగ్గర నుంచే పలు ఉత్పత్తులను ఎంపిక చేసుకునేందుకు ఆస్కారం ఉండటం... కొన్ని సైట్లు డిస్కౌంట్లు ప్రకటించడంతో ఆన్‌లైన్‌లో షాపింగ్ అంటే మక్కువ చూపుతున్నారు.
  ఇండియా మెట్రో మినీమెట్రో హైదరాబాద్
అవును 68.12 68.32 67.91 83.39
కాదు 31.88 31.68 32.09 16.61
బ్రౌజింగ్ చేయాల్సిందే...
చాలామంది యువత ఇంటర్‌నెట్ ముందు అధిక సమయం వెచ్చిస్తున్నారు. నగరంలో 16.56 శాతం మంది యువత 30 నిమిషాల నుంచి గంటపాటు, మరో 13.15 శాతం మంది 1-2 గంటల పాటు ఇంటర్‌నెట్‌కు కేటాయిస్తున్నారు. ఇటీవల మినీ మెట్రోలకు ఈ సంస్కృతి వ్యాపిస్తోంది. నెట్ బ్రౌజింగ్ సమాచార సేకరణ వరకు అయితే...మంచిదే కాని...ఈ స్వేచ్ఛ దుర్వినియోగం చేస్తే ప్రమాదమే. నిఘా పెట్టాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులపై ఉంది.
వెచ్చించే కాలం ఇండియా మెట్రో మినీమెట్రో హైదరాబాద్
30-60 నిమిషాలు 32.71 33.81 31.60 16.56
1-2 గంటలు 22.76 19.46 26.05 13.15
15-30 నిమిషాలు 20.27 21.26 19.27 15.40
2-3 గంటలు 12.47 11.69 13.25 8.19
15 నిమిషాలకంటే తక్కువ 9.15 10.53 7.76 7.16
గాడ్జెట్ గురూ
ఏదో ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ యువత చేతిలో ఉండాల్సిందే. దేశ వ్యాప్తంగా 86.68 శాతం మంది యుక్త వయస్సు నుంచి సెల్‌ఫోన్లు వాడుతున్నారు. నగరంలో 71.20 శాతం యువత చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. 54 శాతం మంది కంప్యూటర్, 48.78 శాతం ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. ప్రతికూలాంశాలున్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అంటే యువత ఎక్కువ ఇష్టపడుతున్నారు.
గాడ్జెట్ ఇండియా మెట్రో మినీమెట్రో హైదరాబాద్
మొబైల్‌ఫోన్ 86.68 82.43 90.94 71.20
హోం పీసీ 77.03 61.28 71.62 54.79
ల్యాప్‌టాప్ 55.05 66.00 58.18 48.78
ఎంపీ-3 ప్లేయర్ 48.40 51.92 44.88 48.15
టాబ్లెట్ 35.85 42.35 29.34 25.21
గేమింగ్ పరికరాలు 32.19 34.82 29.55 12.81
సామాజిక మీడియా బంధాలను నెరపేందుకు ఉపయోగపడుతుందా?
ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ లాంటి సామాజిక వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితులు, సన్నిహితులు కలుస్తున్నట్లు ఇప్పటికే అందరూ అంగీకరించే వాస్తవం. నగర యువత కూడా ఇదే నమ్ముతున్నట్లు తేలింది. దాదాపు 47.19 శాతం యువత దీనిని అంగీకరించారు. మరో 27.04 శాతం మంది ఇదే విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు.
అవును/కాదు ఇండియా మెట్రో మినీమెట్రో హైదరాబాద్
కొంతవరకు నిజమే 56.21 52.30 60.12 47.19
పూర్తిగా నిజం 29.29 30.35 28.22 27.04
నిజం కాదు 7.35 6.72 7.98 4.57
స్నేహితులను ఎలా కలుస్తుంటారు?
యువత స్నేహితులను, సన్నిహితులను నేరుగా కలిసేందుకే ఇష్టపడుతున్నారు. నగరంలో 37.87 శాతం ఇలాంటి వారే. మరో 15.74 శాతం ఫోన్ ద్వారా పలకరిస్తామన్నారు. 15.56 శాతం మాత్రం సామాజిక వెబ్‌సైట్లను వాడుకుంటున్నట్లు వెల్లడించారు.
సాధనం ఇండియా మెట్రో మినీమెట్రో హైదరాబాద్
ముఖాముఖి(ఫేస్ టుఫేస్) 45.56 44.73 46.40 37.87
ఫోన్ 20.94 19.20 22.68 15.74
సామాజిక మీడియా 19.52 18.13 20.91 15.56
ఎస్ఎంఎస్ 9.65 9.54 9.77 5.61
ఈమెయిల్ 3.33 4.68 1.97 3.87
ట్విట్టర్ 1.59 1.42 1.77 1.09
సామాజిక మీడియా సమాచారం, కొత్త అంశాలు తెలుసుకునేందుకు పనిచేస్తుందా?
సామాజిక మీడియా ద్వారా సమాచారం, కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని అధిక శాతం మంది యువత పేర్కొన్నారు. నగరంలో 47.19 శాతం మంది యువత ఇదే నమ్ముతున్నారు. కేవలం 3.02 శాతం మాత్రం కాదని చెప్పారు.
అవును/కాదు ఇండియా మెట్రో మినీమెట్రో హైదరాబాద్
కొంత నిజమే 56.21 52.30 60.12 47.19
పూర్తిగా నిజం 29.29 30.35 28.22 27.04
నిజం కాదు 7.35 6.72 7.98 3.02


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning