ఇక మూడేళ్లపాటు గేట్ స్కోర్ గుర్తింపు

* ఈసారి నెల ముందుగా పరీక్ష

ఈనాడు, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఎంటెక్ చేసేందుకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) ప్రక్రియలో ఈసారి కొన్ని మార్పులు చేశారు. ఇప్పటివరకు గేట్‌లో సాధించిన స్కోర్ రెండేళ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. అంటే రెండేళ్లలోపు ఆ స్కోర్‌తో ఏదైనా సంస్థలో ఎంటెక్‌లో చేరవచ్చు. ఇకపై ఆ వ్యవధిని మూడేళ్లకు పెంచారు. అంతేకాక ఇప్పటివరకు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ఆన్‌లైన్ పరీక్షలు ముగిసేవి. ఇకనుంచి జనవరిలో ప్రారంభించి ఫిబ్రవరి రెండో వారానికల్లా పూర్తిచేయనున్నారు.

వచ్చే గేట్ పరీక్షలను జనవరి 31, ఫిబ్రవరి 7, 8, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందువల్ల బీటెక్ చివరి పరీక్షలకు సిద్ధం కావడానికి సమస్య ఉండదని భావిస్తున్నారు. పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి దరఖాస్తు ఫారం ప్రతిని కూడా పంపే అవసరం లేదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబరు 1న ప్రారంభమై అక్టోబరు 1వ తేదీతో ముగుస్తుంది.
WEBSITE

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning