కొలువుల సౌధం..!

భీమవరం విద్యావిభాగం : ''మా అబ్బాయి ఇంజినీరింగ్‌ చేశాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అబ్బాయి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు...'' మూడేళ్ల కిందట తల్లిదండ్రుల మాటలు ఇవి.రూ.లక్షల్లో జీతాలు, వారంలో రెండురోజులు సెలవులు, ఆధునాతన వసతులతో సాఫ్ట్‌వేర్‌ కొలువులు యువతను ఊరించాయి. నేడు పరిస్థితి మారింది. ఆర్థిక మాంద్యం దెబ్బతో కుదేలైన సాఫ్ట్‌వేర్‌ రంగం మళ్లీ కోలుకుంటున్నా విద్యార్థులు ఈ రంగంవైపు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఉద్యోగ భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. దీంతో క్రమంగా వారి ఆలోచనా ధోరణి మారుతుంది. ఉద్యోగ భద్రత పేరుతో చాలా మంది ఇతర రంగాలవైపు మళ్లుతున్నారు. ఎక్కువ మంది బ్యాంకింగ్‌ రంగంపై మొగ్గుచూపుతున్నారు.
* ప్రాంగణ ఎంపికలో కొలువు వరించినా.. : ఎ.ప్రగతి, పెంటపాడు.
భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ బ్రాంచిలో బీటెక్‌ పూర్తి చేశాను. 85 శాతం మార్కులు కూడా సాధించాను. గతేడాది కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికలో టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. కానీ ఆ ఉద్యోగం చేయడానికి నాకిష్టం లేదు. దీంతో బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్‌ తీసుకుంటున్నాను. సివిల్‌ సర్వీస్‌ పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం.
* ఉద్యోగ భద్రతకే పెద్దపీట : వి.గణేష్‌, భీమవరం.
భీమవరం డీఎన్నార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ బ్రాంచిలో బీటెక్‌ పూర్తి చేశాను. బీటెక్‌లో 63 శాతం మార్కులు సాధించాను. బ్యాంకు ఉద్యోగమైతే భద్రత ఉంటుంది. ప్రతి ఏటా జీతాలు పెరుగుతాయి. ప్రస్తుతం బ్యాంకింగ్‌ సేవలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయి. దీంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి.
* బ్యాంకింగ్‌ రంగంలో స్థిరపడాలని.. : ఎ.దీపిక, భీమవరం.
పెన్నాడ భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ బ్రాంచిలో బీటెక్‌ పూర్తి చేశా. 70 శాతం మార్కులు సాధించాను. ఏడాదికి నాలుగైదు సార్లు బ్యాంకింగ్‌ ఉద్యోగాల కోసం ప్రకటనలు వెలువడుతున్నాయి. భీమవరంలో శిక్షణ తీసుకుంటున్నాను. బ్యాంకింగ్‌ రంగంలో స్థిరపడాలన్నదే నా జీవితాశయం.
* మేనేజర్‌స్థాయికి చేరుకోవచ్చు : ఎ.నాగవెంకటల/, భీమవరం.
తుందుర్రు జీవీఐటీ కళాశాలలో సీఎస్‌ఈ బ్రాంచిలో బీటెక్‌ పూర్తి చేశాను. 70 శాతం మార్కులు సాధించాను. బ్యాంకు ఉద్యోగమైతే సెక్యూరిటీ ఉంటుంది. అనుభావాన్ని బట్టి మేనేజర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.
* అవకాశాలు అధికం : వై.రవికుమార్‌, కైకలూరు.
నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో 2007లో ఈసీఈ బ్రాంచిలో బీటెక్‌ పూర్తి చేశాను. హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం కూడా చేశాను. ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగానికి కొన్ని నెలల నుంచి శిక్షణ తీసుకుంటున్నాను.
* ఏడాదికి వేలల్లో ఉద్యోగాలు : వేమన వెంకన్న, శిక్షకుడు, భీమవరం.
బ్యాంకింగ్‌ ఉద్యోగాలకు అర్థమెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ అండ్‌ మార్కెటింగ్‌, జనరల్‌ ఎవేర్‌నెస్‌, బ్యాంకింగ్‌ ఎవేర్‌నెస్‌ వంటి సబ్జెక్టులను చదవాలి. సాధారణంగా ఆరు నుంచి పదో తరగతి చదివిన పాఠ్యాంశాల్లోని అంశాలనే బ్యాంక్‌ ఉద్యోగాల పరీక్షల్లో అడుగుతుంటారు. ఏడాదికి 20 వేల నుంచి 50 వేల ఉద్యోగాల వరకు బ్యాంకుల్లో అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో ఇంజినీరింగ్‌ విద్యార్థులు కూడా బ్యాంకు క్లర్క్‌ల ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. ఇటీవలే ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్స్‌ ప్రకటన వెలువడింది. దీనికిగానూ ఈ ఏడాది అక్టోబర్‌లో పరీక్ష ఉంటుంది.
* కళాశాల స్థాయి నుంచే సాధన : సీహెచ్‌.శివయ్య, కస్టమర్‌ అసిస్టెంట్‌, ఎస్‌బీఐ, రాయలం.
బీఎస్సీ డిగ్రీ పూర్తి చేయగానే బ్యాంక్‌ ఉద్యోగం సాధించాను. ఈ పరీక్షలకు ప్రత్సోగిత కిరణ్‌, విజేత వంటి పుస్తకాలను చదివాను. కళాశాలస్థాయి నుంచే జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలను అధికంగా చదివా.
* రోజుకు ఏడు గంటలు... : ఇమంది రాజేంద్రప్రసాద్‌, కస్టమర్‌.
ఎంఎస్సీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించాను. ప్రత్సోగిత దర్పణ్‌, ఉపకార పబ్లికేషన్‌ పుస్తకాలు చదివాను. పరీక్షలకు రోజుకు 7 గంటల పాటు సాధన చేశాను. బ్యాంకింగ్‌ ఉద్యోగాలకు మార్కెటింగ్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. క్రమం తప్పకుండా దినపత్రికలు చదువుతూ, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై అవగాహన ఉండాలి.
* అసిస్టెంట్‌, ఎస్‌బీఐ, భీమవరం ప్రాథమిక అంశాలపై పట్టు అవసరం : - కె.దుర్గఅన్నపూర్ణ, కస్టమర్‌ అసిస్టెంట్‌, ఎస్‌బీఐ, మొగల్తూరు, శేరేపాలెం.
ఎంసీఏ పూర్తిచేశాను. బ్యాంకు ఉద్యోగానికి సుమారు మూడు నెలలపాటు శ్రమించాను. ముఖ్యంగా ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌, రీజనింగ్‌ వంటి అంశాల్లో ప్రతిభ కనబర్చాలి. ఈ మేరకు కిరణ్‌ప్రకాష్‌ టెస్ట్‌ పేపర్లతోపాటు జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలను చదివాను. ఎస్‌బీఐలో ఉద్యోగంలో సాధించాను.


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning