అయిదేళ్లలో 5 లక్షల ఐటీ కొలువులు

* సిలికాన్‌ కారిడార్‌, డిజిటల్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌
* జిల్లాకో సైబరాబాద్‌...
* స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు

కర్నూలు,ఈనాడు: ఆంధ్రప్రదేశ్‌ను సిలికాన్‌ కారిడార్‌గా, డిజిటల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, రాబోయే అయిదేళ్లలో అయిదు లక్షల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా మనది ఒక్కటే జాతి అని, ఏ ప్రాంతంలోని తెలుగువారు ఏ రకమైన వివక్షకీ గురి కాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కర్నూలు నగరంలో నిర్వహించిన 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఈసుదీర్ఘంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగంలోని ముఖ్యాంశాలు క్లుప్తంగా....
జిల్లాకో సైబరాబాద్‌...
విశాఖపట్నంలో మెగా ఐటీ హబ్‌, అనంతపురం, తిరుపతి, విజయవాడ, కాకినాడల్లో ఐటీ హబ్స్‌ ఏర్పాటు చేస్తాం. హార్డ్‌వేర్‌ రంగాన్నీ ప్రోత్సాహిస్తాం.
ఏటా డీఎస్సీ: రూ.516 కోట్లతో మాధ్యమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించబోతున్నాం. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తాం.
సెప్టెంబరు నుంచి: సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు. ఇందుకోసం ప్రత్యేక సీఈవోల నియామకం.
పొరుగు రాష్ట్రాలతో సఖ్యత: పొరుగు రాష్ట్రాలన్నింటితో సుహృద్భావ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తాం. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏమాత్రం రాజీపడబోం.
పరిశ్రమలు- మౌలిక వసతులు: విశాఖ, తిరుపతి, విజయవాడ మెగా సిటీలుగా అభివృద్ధి. జిల్లాకు ఒకటి చొప్పున 13 స్మార్ట్‌ సిటీలు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు మార్గాలు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning